
చెన్నై: తమిళనాడు మంత్రి బాలకృష్ణారెడ్డికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. 1998లో హోసూర్‌లో బస్సుపై రాళ్లదాడికి పాల్పడిన కేసులో ఆయనకు శిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించింది. ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లేలా వ్యవహరించినందుకు గాను న్యాయస్థానం ఆయన శిక్ష విధిస్తూ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో 108 మంది నిందితులు ఉండగా, వారిలో 16 మందిని కోర్టు దోషులుగా తెల్చింది. ఈ తీర్పుతో బాలకృష్ణారెడ్డి ఎమ్మెల్యే, మంత్రి పదవిని కోల్పోనున్నారు.
కాగా, ప్రత్యేక కోర్టు తీర్పుపై బాలకృష్ణారెడ్డి మంగళవారం మద్రాసు హైకోర్టును ఆశ్రయించనున్నట్టుగా సమాచారం. కాగా, తమిళనాడు క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న బాలకృష్ణారెడ్డి హోసూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment