తల్లీకొడుకులకు పదేళ్ల జైలు
Published Tue, Oct 25 2016 1:44 AM | Last Updated on Fri, Jul 27 2018 2:21 PM
తణుకు : భార్యను వేధించి ఆమె మృతికి కారకులైన భర్త, అతని తల్లికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తణుకు నాలుగో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి జి.గోవిందకేశవరావు సోమవారం తీర్పుచెప్పారు. కోర్టు లైజినింగ్ అధికారి ఆర్.బెన్నిరాజు కథనం ప్రకారం.. దువ్వ గ్రామానికి చెందిన దేవరపల్లి లక్ష్మి తన కుమార్తె వాణిరత్నకుమారికి అదే గ్రామానికి చెందిన పడాల చిన్నబాబుకు పెళ్లి చేశారు. 2012లో రత్నకుమారిని ఆమె భర్త, అత్త వేధింపులకు గురి చేయడంతో ఆమె మృతి చెందింది. దీనిపై మృతురాలి తల్లి లక్ష్మి తణుకు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పటి ఎస్సై ఎం.కేశవరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భర్త, అత్తల వేధింపుల వల్లే రత్నకుమారి మృతి చెందినట్లు నిర్ధారించిన పోలీసులు నిందితులు పడాల చిన్నబాబు, అతని తల్లి భూలక్ష్మిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టులో వాదోపవాదాల అనంతరం న్యాయమూర్తి నిందితులిద్దరికీ పదేళ్ల జైలుశిక్షతోపాటు ఒకొక్కరికి రూ. వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించకుంటే మరో ఆరునెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు.
Advertisement