
లైంగిక దాడికి యత్నించిన తండ్రి
కామంతో కళ్లు మూసుకుపోయి కూతురిపై లైంగికదాడికి ప్రయత్నించిన తండ్రికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ ....
వ్యక్తికి ఏడాది జైలు
చిలకలూరిపేట టౌన్ : కామంతో కళ్లు మూసుకుపోయి కూతురిపై లైంగికదాడికి ప్రయత్నించిన తండ్రికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పుచెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని వెంగళరెడ్డి నగర్‌కు చెందిన బంటుపల్లి ఏసుదాసు 2013 అక్టోబర్ నాలోగో తేదీన భార్యను బయటకు పంపి కుమార్తెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు.
ఆందోళనకు గురైన కూతురు కేకలు వేయటంతో చుట్టుపక్కల వారు రావటం గమనించి పరారయ్యాడు. ఈ విషయమై కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నేరం రుజువు కావటంతో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సీహెచ్‌వీఎన్ శ్రీనివాసరావు సోమవారం నిందితుడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. బాధితురాలి తరుపున ఏపీపీ లక్ష్మిరాణి వాదించారు.