వివాహేతర సంబంధం కేసులో టీడీపీ నాయకుడికి జైలుశిక్ష | TDP Leader Has Been Jailed In An Extramarital Affair Case | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం కేసులో టీడీపీ నాయకుడికి జైలుశిక్ష

Published Wed, Oct 23 2019 7:55 AM | Last Updated on Wed, Oct 23 2019 8:05 AM

TDP Leader Has Been Jailed In An Extramarital Affair Case - Sakshi

సాక్షి, ధర్మవరం : వివాహేతర సంబంధం కేసులో టీడీపీ నాయకుడికి మూడేళ్ల జైలు శిక్షను విధిస్తూ ధర్మవరం సీనియర్‌ సివిల్‌ జడ్జి క్రిష్ణవేణమ్మ తీర్పునిచ్చారు. బత్తలపల్లి మండలం గంటాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఈశ్వరయ్య తన మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసిన తర్వాత ఆమె భర్త శ్రీకాంత్‌ మనస్తాపానికి గురై కిరోసిన్‌ పోసుకొని నిప్పటించుకుని మూడేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మృతుని సోదరి ఫిర్యాదు మేరకు బత్తలపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఈశ్వరయ్య, అతడి మరదలు రాధపై సెక్షన్‌ 306 కింద కేసు నమోదు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో ముద్దాయిలు ఈశ్వరయ్య, రాధలకు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తూ జడ్జి క్రిష్ణవేణమ్మ తీర్పు వెలువరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement