పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు ఏడాది జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. 1988 నాటి కేసులో కోర్టు ఆయనుకు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై సిద్ధూ గురువారం స్పందిస్తూ.. కోర్టు తీర్పును గౌరవిస్తానని, పోలీసులకు లొంగిపోతానని అన్నారు.
ఇంతలోనే శుక‍్రవారం సిద్ధూ మాట మార్చారు. ఆరోగ్య కారణాల రీత్యా లొంగిపోవడానికి మరికొన్ని వారాల సమయం కావాలని నవజోత్ సింగ్ సిద్ధూ కోరారు. దీంతో, సిద్ధూ తరఫున ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఈ మేరకు సింఘ్వీ.. సీజేఐ ఎన్వీ రమణను కలవాలని ఏఎం ఖన్వీల్కర్ సూచించారు. ఇక, కేసు రివ్యూ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖన్వీల్కర్, జస్టిస్ ఎస్‌కే కౌల్‌తో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.
కాగా, సుప్రీంకోర్టు ఆదేశాలు ఇంకా తమకు అందలేదని, శుక్రవారం ఉదయం ఛండీగఢ్ కోర్టు నుంచి పాటియాలా పోలీస్‌స్టేషన్‌కు వస్తాయని అధికారులు తెలిపారు. అనంతరం సమన్లను సిద్ధూకి అందించి లొంగిపోవాలని కోరుతున్నామని పోలీసులు చెప్పారు. అరెస్టు చేసిన వెంటనే సిద్ధూను వైద్య పరీక్షల కోసం స్థానిక ఆసుపత్రికి తరలిస్తామని స్పష్టం చేశారు.
Will submit to the majesty of law ….
— Navjot Singh Sidhu (@sherryontopp) May 19, 2022
ఇది కూడా చదవండి: లాలూ ప్రసాద్ యాదవ్, కుటుంబ సభ్యులకు షాక్ ఇచ్చిన సీబీఐ
Comments
Please login to add a commentAdd a comment