శృంగారానికి పర్మిషన్ తీసుకోవాల్సిందే..! | Man must inform police 24 hours before having sex | Sakshi
Sakshi News home page

శృంగారానికి పర్మిషన్ తీసుకోవాల్సిందే..!

Published Sat, Jan 23 2016 7:09 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

శృంగారానికి పర్మిషన్ తీసుకోవాల్సిందే..! - Sakshi

శృంగారానికి పర్మిషన్ తీసుకోవాల్సిందే..!

లండన్: ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి నార్త్ యార్క్షైర్ మేజిస్ట్రేట్  కాస్త భిన్నమైన శిక్ష ఖరారు చేశారు. గతంలో ఎప్పడు ఇలాంటి తీర్పును మనం విని ఉండకపోవచ్చు. ఆ వివరాలిలా ఉన్నాయి.. 2015లో ఓ వ్యక్తి(40)   మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడని కేసు నమోదు చేశారు. అయితే, ఇప్పటివరకూ ఆ కేసుపై ఎటువంటి పురోగతి లేదు. గత డిసెంబర్ లో  మొదటసారి ఈ కేసుపై విచారణ జరిగింది. తాజాగా రెండోసారి ఆ అత్యాచారం కేసు విచారణకు వచ్చింది. నార్త్ యార్క్షైర్ లోని నార్త్అలర్టన్ మేజిస్ట్రేట్ నాలుగు నెలలపాటు అతడికి ఓ శిక్ష ఖరారు చేశారు.

సెక్స్ చేయాలనుకున్న ఒక రోజు ముందే తమకు వివరాలు తెలపాలని సూచించారు. అందరిలాగా అతను తనకు నచ్చిన ఏ మహిళతోనైనా శృంగారంలో పాల్గొనవచ్చు. కానీ, సెక్స్ చేయాలని అతడు భావించినప్పుడు కచ్చితంగా 24 గంటల ముందే పోలీసులకు వివరాలందించాలని తీర్పు ఇచ్చారు. ఎవరితో(యువతి, మహిళలు)అయితే శృంగారంలో పాల్గొంటాడో వారి పూర్తి వివరాలను తెలియజేయాలట. అంతేకాకుండా ఆ యువతి పేరు సహా పుట్టినతేదీ, ఈ-మెయిల్ అడ్రస్ లాంటి వివరాలను కచ్చితంగా అందించాలట. ఒకవేళ సమాచారం ఇవ్వకుండా, పర్మిషన్ లేకుండా శృంగారంలో పాల్గొంటే  అతడికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు.

2015 మార్చిలో వచ్చిన కొన్ని నూతన చట్టాలు ఇందుకు ఊతమిస్తున్నాయి. ఏ వ్యక్తి నుంచి అయినా స్త్రీలకు సెక్స్ పరమైన ఇబ్బందులు, వారిపై అత్యాచార దాడులు జరగవచ్చని భావిస్తే అలాంటి వారికి ఈ శిక్ష విధించవచ్చని ఇంగ్లండ్ నూతన చట్టాల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా  నిందితుడు వాడుతున్న సెల్ ఫోన్ వివరాలు.. ఎవరితో మాట్లాడుతున్నాడు, ఇంటర్నెట్ లో ఎవరెవరితో చాటింగ్ చేస్తున్నాడు తదితర అంశాలపై కూడా ఆంక్షలు విధించారు. వినడానికి వింతగా ఉన్నా ఇంగ్లండ్, వేల్స్ లలో ఈ రకమైన చట్టాలను గతేడాది అమల్లోకి తీసుకొచ్చారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement