కారు చోరీ కేసులో ముగ్గురికి జైలు
Published Thu, Dec 15 2016 2:11 AM | Last Updated on Mon, Sep 4 2017 10:44 PM
గణపవరం (నిడమర్రు) : కారు చోరీ కేసులో ముగ్గురికి కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించినట్లు సీఐ ఎ¯ŒS.దుర్గాప్రసాద్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం 2016 ఏప్రిల్‌లో గణపవరానికి చెందిన షేక్ సపుల్లా, గంధవరపు బాలాజీ, ఎస్‌కే గౌస్ బాషా కలిసి భీమవరానికి చెందిన పొదిలి శ్రీరామచంద్రమూర్తి కారును అద్దెకు తీసుకు వెళ్లారు. కేశవరం సమీపంలో కారు డ్రైవర్‌ను కొట్టి ఆ కారును తీసుకు వెళ్లిపోయారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్ట్‌చేసి తాడేపల్లిగుడెం కోర్టులో హాజరుపరచగా.. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో ఫస్ట్ ఏజేఎఫ్‌సీఎం ఎం.వి.ఎ¯ŒS.పద్మజ నిందితులకు రెండేళ్ల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో నెల రోజులు శిక్ష కొనసాగించాలని
తీర్పులో పేర్కొన్నారు.
Advertisement
Advertisement