సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)లో చేరేందుకు వెళుతూ మహారాష్ట్రలోని నాగ్‌పూర్ విమానాశ్రయంలో చిక్కిన ముగ్గురు యువకులు అబ్దుల్లా బాసిత్, సయ్యద్ ఒమర్ ఫారూఖ్ హుస్సేనీ, మాజ్ హసన్ ఫారూఖ్‌లను సీసీఎస్ అధీనంలోని సిట్ అధికారులు మంగళవారం కస్టడీలోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం ఈ ముగ్గురినీ వారం రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. దీంతో సిట్ బృందం చంచల్‌గూడ జైలులో ఉన్న ముగ్గురినీ కస్టడీలోకి తీసుకుని, ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఆపై తమ కార్యాలయానికి తీసుకువెళ్లి విచారణ ప్రారంభించారు.
వారం రోజుల విచారణలో భాగంగా వీరిని ఆదిలాబాద్‌తో పాటు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు తీసుకువెళ్లనున్నారు. కాశ్మీర్‌కు చెందిన వివాదాస్పద నాయకురాలు అంద్రాబీతో వీరికి సంబంధాలు ఉన్నాయా అనే అంశంపై ఆరా తీయాలని సిట్ నిర్ణయించింది.
సిట్ కస్టడీలో ‘ఐసిస్ త్రయం’
Published Wed, Jan 6 2016 3:38 AM | Last Updated on Sat, Jul 28 2018 6:26 PM
Advertisement
Advertisement