చంచల్‌గూడ జైల్లో యంగ్ హీరో! | actor Nithiin spent time in chanchalguda jail | Sakshi
Sakshi News home page

చంచల్‌గూడ జైల్లో యంగ్ హీరో!

Published Fri, Jan 20 2017 6:48 PM | Last Updated on Sat, Jul 28 2018 6:26 PM

చంచల్‌గూడ జైల్లో యంగ్ హీరో! - Sakshi

చంచల్‌గూడ జైల్లో యంగ్ హీరో!

హైదరాబాద్‌: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు వెళ్లారు. హీరో ఏంటీ.. జైలుకు వెళ్లడం ఏంటని కంగారు అక్కర్లేదండీ. ఎందుకంటే ఓ మూవీ షూటింగ్‌లో భాగంగా నితిన్ చంచల్‌గూడ జైలులో కొన్ని గంటలు గడిపాడు. 14 రీల్స్‌ బ్యానర్‌పై హను రాఘవపూడి దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్‌ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్‌ గురువారం చంచల్‌గూడ పురుషుల జైల్లో జరిగింది. దీంతో ఒక్కసారిగా జైలు ప్రాంగణంలో కొద్దిసేపు సందడి వాతావరణం నెలకొంది.

నటులు పృధ్వీ, బ్రహ్మాజీ, హీరో నితిన్‌లపై జైలు లోపల కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. అ..ఆ.. సినిమాతో రూ.50 కోట్ల క్లబ్లో చేరిన నితిన్ కొంత విరామం తర్వాత చేస్తున్న ఈ మూవీ షూటింగ్‌ గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కొనసాగింది. ఇప్పటివరకూ జైలులో కొన్ని సీన్లు చిత్రీకరించారు. ఇంకా కొన్ని సీన్లు తీయాల్సి వస్తే మరోసారి ఈ లెటెస్ట్ మూవీ యూనిట్ చంచల్‌గూడలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. ఓల్డ్ సిటీ కుర్రాడిగా కనిపించేందుకు భారీగా గడ్డం పెంచేసి రఫ్ లుక్లో కనిపిస్తున్నాడు నితిన్. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీలో సీనియర్ నటుడు అర్జున్‌ స్టైలిష్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement