
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మలారెడ్డి(మధ్యలో)
సాక్షి, హైదరాబాద్ : నకిలీ పాస్‌పోర్టు కుంభకోణం కేసులో అసలు నిందితులైన కేసీఆర్, హరీష్ రావులను వదిలేసి తన భర్తను అక్రమంగా ఇరికించారని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మలారెడ్డి ఆరోపించారు. బుధవారం చంచల్‌గూడ జైల్లో ఉన్న జగ్గారెడ్డిని ఆయన కుటుంబసభ్యులు ములాఖత్‌లో కలిశారు. జైలు అధికారులు మాత్రం కేవలం జాలీ ములాఖత్‌కు మాత్రమే అవకాశం కల్పించారు. అనంతరం నిర్మలారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జగ్గారెడ్డి చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసని ఆయన మచ్చలేని మనిషి అని పేర్కొన్నారు.
అధికార దాహంతోనే జగ్గారెడ్డిని అరెస్ట్ చేశారని ఆగ్రహించారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన కేసీఆర్, హరీష్‌రావులను ఎందుకు అరెస్ట్ చేయటం లేదని ప్రశ్నించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా అధికారులు సాధారణ ములాఖత్ ఇచ్చారని, జాలీ మధ్యలోనుంచి మాటలు స్పష్టంగా వినిపించటంలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment