చంచల్‌గూడ జైలులో అల్లు శిరీష్!
నిజమే... అక్షరం పొల్లు పోకుండా మీరు చదివిందంతా నిజమే! యువ హీరో అల్లు శిరీష్ ఓ రోజంతా చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. ఆయన జైలుకు వెళ్లొచ్చి వారమైంది. కానీ, ఈ మేటర్ బయటకు రాలేదు. గుట్టు చప్పుడు కాకుండా అల్లు శిరీష్ జైలుకు వెళ్లొచ్చారు. టాక్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్... డ్రగ్స్ రాకెట్ కేసుతో అల్లు వారబ్బాయికి ఏం సంబంధం లేదు. ఆయనపై ఇతరత్రా కేసులు ఏవీ లేవు. మరి, జైలుకు ఎందుకు వెళ్లారు? అంటే...
సిన్మా షూటింగ్ కోసం! ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో అల్లు శిరీష్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్నా మధ్య రెండు మూడు రోజులు చంచల్‌గూడ జైలులో షూటింగ్ చేశారు. షూటింగ్ పూర్తయిన తర్వాత పోలీసుల రిక్వెస్ట్ మేరకు అల్లు శిరీష్ ఖైదీలకు మంచి మాటలు చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. సురభి, సీరత్‌కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్ కీలక పాత్ర చేస్తున్నారు.