బంకులో ‘చిల్లర’ గొడవ | Change issue in the bunk | Sakshi
Sakshi News home page

బంకులో ‘చిల్లర’ గొడవ

Published Sat, Dec 3 2016 1:49 AM | Last Updated on Tue, Sep 3 2019 9:06 PM

Change issue in the bunk

- ఖైదీ, జైలు సిబ్బందిపై వినియోగదారులు దాడికి యత్నం
- చంచల్‌గూడ జైలు పెట్రోల్ బంకులో ఘటన
 
 హైదరాబాద్: చిల్లర లేదన్నందుకు కొందరు వినియోగదారులు ఖైదీ, సిబ్బందిపై దాడికి ప్రయత్నించారు. ఈ సంఘటన శుక్రవారం చంచల్‌గూడ జైలు పెట్రోల్ బంకులో చోటుచేసుకుంది. సిబ్బంది, ఖైదీల వివరాల ప్రకారం పెట్రోల్ పోరుుంచుకున్న కొందరు వినియోగదారులు రూ. 2 వేలు నోటు ఇవ్వగా చిల్లర లేదన్న ఖైదీని దూషించడమే కాకుండా అడ్డుకున్న సిబ్బందిపై దాడి చేయబోయారు. 

కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. వీరిపై వినియోగదారులు ఒక్కసారిగా దాడి చేయబోయారు. దీంతో సిబ్బంది డబీర్‌పురా పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఖైదీలు, సిబ్బందితో గొడవకు దిగిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ బచ్చు సైదయ్య తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement