వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి బెయిల్పై విడుదల అవుతున్న నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు, జగన్ అభిమానులు పెద్ద సంఖ్యలో చంచల్గూడ జైలుకు చేరుకున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి బెయిల్పై విడుదల అవుతున్న నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు, జగన్ అభిమానులు పెద్ద సంఖ్యలో చంచల్గూడ జైలుకు మంగళవారం చేరుకున్నారు. ఆ నేపథ్యంలో పోలీసులకు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
దాంతో చంచల్గూడ జైలు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జైలు పరిసర ప్రాంతాల్లో మూడంచల భద్రతను ఏర్పాటు చేశారు. అందుకోసం నగరంలోని 17 పోలీసు స్టేషన్లకు చెందిన పోలీసు బలగాలను మోహరించిన సంగతి తెలిసిందే.