ఏలూరు, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం పోరుబాట సాగిస్తున్న జిల్లాలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉద్యమాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్నారుు. చంచల్‌గూడ జైలులో జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావంగా జిల్లావ్యాప్తంగా చేపట్టిన ఆమరణ, రిలే నిరాహార దీక్షలు గురువారం ఐదో రోజుకు చేరారుు. ద్వారకాతిరుమలలో గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు చేపట్టిన స్వీయనిర్బంధ ఆమరణ నిరాహార దీక్ష ఐదో రోజూ కొనసాగింది. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్‌లో వైఎస్సార్ సీపీ నాయకుడు గుమ్మాపు సూర్యవరప్రసాదరావు నిరవధిక దీక్షను గురువారం ఉదయం పోలీసుల భగ్నం చేశారు. కొవ్వూరు మండలం దొమ్మేరులో రాష్ట్ర ఎంపీటీసీల సంఘం మాజీ అధ్యక్షుడు ముదునూరు నాగరాజు దీక్ష గురువారం మూడో రోజూ కొనసాగింది.
మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని, పార్టీ సీఈసీ సభ్యుడు కొయ్యే మోషేన్‌రాజు సంఘీభావం తెలిపారు. పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పాతపాటి సర్రాజు ఆధ్వర్యంలో ఉండి సెంటర్‌లో ప్రజాకోర్టు పేరిట నమూనా కోర్టు నిర్వహించి ఉద్యమంలోకి రాని ప్రజాప్రతినిధులకు ఉరిశిక్ష వేస్తున్నట్టు ప్రకటించారు. ఎంపీ, ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను ఉరితీశారు. రాష్ట్ర విభజన చేస్తే రాష్ర్టం ఎడారిగా మారుతుందంటూ ఆకివీడులో వరినాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు తాను చేస్తున్న బస్సు యాత్రకు ఆత్మవంచన యాత్రగా పేరు పెట్టుకోవాలని చింతలపూడి మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్ ఎద్దేవా చేశారు. జంగారెడ్డిగూడెంలో రిలే దీక్షా శిబిరాలను సందర్శించిన ఆయన దీక్షధారులకు సంఘీభావం తెలిపారు. భీమవరం, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, పాలకొల్లు, నరసాపురం పట్టణాల్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నారుు. గురువారం 183 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
ఉద్యమంలోనే వైసీపీ
Published Fri, Aug 30 2013 1:03 AM | Last Updated on Sat, Jul 28 2018 6:26 PM
Advertisement