చంచల్గూడ జైలు వద్ద కోలాహలం | Happy atmosphere at Chanchalguda prison | Sakshi
Sakshi News home page

చంచల్గూడ జైలు వద్ద కోలాహలం

Published Mon, Sep 23 2013 8:18 PM | Last Updated on Wed, Aug 8 2018 5:51 PM

చంచల్గూడ జైలు వద్ద కోలాహలం - Sakshi

చంచల్గూడ జైలు వద్ద కోలాహలం

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్సభ సభ్యుడు జగన్మోహన రెడ్డికి బెయిలు మంజూరైందని తెలియడంతో అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చంచల్గూడా జైలు వద్దకు తరలివెళుతున్నారు. జైలు పరిసరాలు కోలాహలంగా మారాయి. ఆ చుట్టుపక్కల ప్రజలు కూడా సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి నేతలు, కార్యకర్తలు, అభిమానులు హైదరాబాద్ తరలి వస్తున్నారు.

తమ నాయకుడికి బెయిల్ రావడంతో జంట నగరాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో చేసుకున్నారు. స్వీట్లు పంచుతూ హర్షం వ్యక్తం చేశారు. బాణాసంచా కాల్చి సంతోషం వెలిబుచ్చారు. మహానేత వైఎస్ఆర్ విగ్రహాలకు దండలు వేసి నివాళి అర్పించారు. కుషాయిగూడలో సింగిరెడ్డి ధనపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement