హైదరాబాద్ :మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణకు సోమవారం సాయంత్రం చంచలగూడ జైలు నుంచి విడుదలయ్యారు. సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో17 నెలలగా జైలులో గడిపిన మోపిదేవి జైలు నుంచి విడుదలయ్యారు. కాగా, సీబీఐ కోర్టు రెండు లక్షలవి రెండు పూచికత్తులను కోర్టుకు సమర్పించాలని షరతు విధించింది. పాస్‌పోర్టుకు సంబంధించిన వివరాలను అఫిడవిట్ రూపంలో కోర్టుకు అందజేయాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
సాక్ష్యులను ప్రభావితం చేయరాదని. న్యాయస్థానం స్పష్టం చేసింది. మౌలిక సదుపాయాలు, నౌకాయనం శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఉన్న మోపిదేవి వెంకట రమణ నిబంధనలకు విరుధ్దంగా వాన్‌పిక్‌కు భూములు కేటాయించారని సీబీఐ అభియోగాలు మోపింది. మోపిదేవిని సీబీఐ గతేడాది మే 24న అరెస్ట్ చేసింది.
అంతకు ముందు సీబీఐ కోర్టు ...మోపిదేవి వెన్నునొప్పి శస్త్రచికిత్స కోసం 45 రోజుల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ గడువు ముగియటంతో ఆయన ఈనెల 25న కోర్టులో లొంగిపోయారు. ఈ నేపథ్యంలో మోపిదేవి కోర్టులో లొంగిపోయి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.