మోపిదేవికి బెయిల్ మంజూరు
మోపిదేవికి బెయిల్ మంజూరు
Published Mon, Oct 28 2013 11:55 AM | Last Updated on Sat, Jul 6 2019 12:52 PM
హైదరాబాద్ : మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణకు సీబీఐ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్‌ను విడిచి వెళ్లరాదని... రెండు లక్షలవి రెండు పూచికత్తులను కోర్టుకు సమర్పించాలని షరతు విధించింది. పాస్‌పోర్టుకు సంబంధించిన వివరాలను అఫిడవిట్ రూపంలో కోర్టుకు అందజేయాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
సాక్ష్యులను ప్రభావితం చేయరాదని... సాక్యలను తారుమారు చేయరాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. మౌలిక సదుపాయాలు, నౌకాయనం శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఉన్న మోపిదేవి వెంకట రమణ నిబంధనలకు విరుధ్దంగా వాన్‌పిక్‌కు భూములు కేటాయించారని సీబీఐ అభియోగాలు మోపింది. మోపిదేవిని సీబీఐ గతేడాది మే 24న అరెస్ట్ చేసింది. సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో 17 నెలల తర్వాత మోపిదేవి చంచల్ గూడ జైలు నుంచి విడుదల అవుతున్నారు.
అంతకు ముందు సీబీఐ కోర్టు ...మోపిదేవి వెన్నునొప్పి శస్త్రచికిత్స కోసం 45 రోజుల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ గడువు ముగియటంతో ఆయన ఈనెల 25న కోర్టులో లొంగిపోయారు. ఈ నేపథ్యంలో మోపిదేవి కోర్టులో లొంగిపోయి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
Advertisement
Advertisement