సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ ఇటీవల అరెస్టు చేసిన మాజీ సీజీఎస్టీ అధికారి బొల్లినేని శ్రీనివాసగాంధీ సీబీఐకి సహకరించడం లేదు. మే 1 నుంచి 4 వరకు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఇటీవల కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో సోమవారం కూడా బొల్లినేనిని అధికారులు చంచల్‌గూడ జైలు నుంచి కోఠిలోని సీబీఐ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఎన్ని విధాలా ప్రశ్నించినా.. తనకు అనారోగ్యం ఉందని సమాధానాలు దాటవేసినట్లు సమాచారం.
అదే విధంగా రెండు రాష్ట్రాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టిన విధానం, వాటి డాక్యుమెంట్లు ముందు పెట్టి ప్రశ్నలు సంధించినా నోరు తెరవలేదని తెలిసింది. చివరి రోజు అయిన మంగళవారం కస్టడీ ముగియనుంది. ఆఖరు రోజైనా సమాధానాలు రాబట్టాలన్న పట్టుదలతో ఉన్నారు సీబీఐ అధికారులు. విచారణ అనంతరం బొల్లినేని తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment