Bollineni Sreenivasa Gandhi
-
బొల్లినేని గాంధీపై క్రిమినల్ కేసు
సాక్షి, హైదరాబాద్: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)లో పనిచేసినప్పుడు తన అధికారాన్ని అడ్డంపెట్టుకుని, తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు ఆదేశాలు, సూచనల మేరకు నడుచుకున్న బొల్లినేని శ్రీనివాసగాంధీపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే ఈయనపై సీబీఐ, ఈడీల్లో మూడు కేసులు ఉన్నాయి. తాజాగా గాంధీతోపాటు జీఎస్టీ ప్రిన్సిపల్ కమిషనర్ ఎం.శ్రీనివాస్, అదనపు కమిషనర్ ఆనంద్ కుమార్, డిప్యూటీ కమిషనర్ చిల్కల సుధారాణి, సూపరింటెండెంట్ ఇస్బెల్లా బ్రిట్టోలపై గత శుక్రవారం క్రిమినల్ కేసు నమోదైంది. వివరాలివీ.. ►బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన జేఎస్ శ్రీధర్‌రెడ్డి హైదరాబాద్ స్టీల్స్ సంస్థను నిర్వహిస్తున్నారు. ఇందులో కొన్నాళ్లు ఆయన భార్య జె.రాఘవిరెడ్డి భాగస్వామిగా ఉన్నారు. తర్వాత తన భర్తకే ఆమె జీపీఏ ఇచ్చారు. అయితే 2019లో ఆ సంస్థపై జీఎస్టీ ఎగవేత ఆరోపణలు రావడంతో సంబంధిత అధికారులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో అదే ఏడాది ఫిబ్రవరి 27 సాయంత్రం 5.30 గంటలకు ఐదుగురు వ్యక్తులు శ్రీధర్‌రెడ్డి ఇంటికి వెళ్లి తాము జీఎస్టీ అధికారులమని, ఇంట్లో సోదాలు చేయాలని చెప్పారు. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు చూపించలేదు. వీరంతా తీవ్ర అభ్యంతరకరంగా, ఇంట్లోని వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ ప్రవర్తించారు. ►తన భర్త విదేశాల్లో ఉన్నారని, తిరిగి వచ్చాక వివరణ ఇస్తారని రాఘవిరెడ్డి చెప్పినా వారు వినిపించుకోలేదు. సోదాల సమయంలో బాధితురాలి ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులూ ధ్వంసమయ్యాయి. జీఎస్టీ అధికారుల తీరుతో బాధితురాలి కుటుంబీకులు భయభ్రాంతులకు లోనయ్యారు. ►కొన్ని గంటలపాటు జరిగిన సోదాల్లో శ్రీధర్‌రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో అధికారులు బాధితురాలిని బషీర్‌బాగ్‌లోని తమ కార్యాలయానికి తరలించి మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటల వరకు నిర్బంధించారు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో గాంధీతోపాటు సుధారాణి ఆ కార్యాలయానికి వచ్చారు. బాధితురాలిని బెదిరిస్తూ రూ.5 కోట్ల లంచం డిమాండ్ చేశారు. ►ఆ మొత్తం లంచం తమ కోసమేకాదని, ప్రిన్సిపల్ కమిషనర్ ఎం.శ్రీనివాస్, అదనపు కమిషనర్ ఆనంద్ కుమార్లకూ వాటా ఇవ్వాల్సి ఉంటుందని గాంధీ ఆమెతో చెప్పారు. తాను 2009లోనే భర్త పేరుతో జీపీఏ ఇచ్చానని చెప్పినా వాళ్లు వినిపించుకోలేదు. అయినప్పటికీ తాము పట్టించుకోబోమంటూ వారిద్దరూ బాధితురాలిపై తీవ్ర, అసభ్య పదజాలం వాడారు. ఆమె చూపిస్తున్న జీపీఏ కాపీలను గాంధీ చింపి నేలపై పడేశారు. తెల్లవారుజాము 4 గంటల వరకు ఈ తతంగం నడిచింది. ►అదేరోజు మధ్యాహ్నం మరోసారి కార్యాలయానికి రావాలంటూ రాఘవిరెడ్డిని బెదిరించి పంపారు. ఇస్బెల్లా బ్రిట్టో తన వాహనంలో ఆమెను ఇంటికి చేర్చారు. మధ్యాహ్నం మరోసారి ఆమెను బలవంతంగా జీఎస్టీ కార్యాలయానికి తరలించారు. అయితే ఆ సందర్భంలో ఆనంద్ కుమార్ అభ్యంతరంగా ప్రవర్తించారంటూ బాధితురాలు జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. కమిషన్ ఆదేశాల మేరకు గత శుక్రవారం ఐదుగురిపై ఐపీసీ 354, 341, 506 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ►గాంధీతోపాటు సుధారాణి 2021 ఫిబ్రవరి నుంచి సస్పెన్షన్‌లో ఉన్నారు. -
సీబీఐ ఎదుట బొల్లినేని మౌనవ్రతం
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ ఇటీవల అరెస్టు చేసిన మాజీ సీజీఎస్టీ అధికారి బొల్లినేని శ్రీనివాసగాంధీ సీబీఐకి సహకరించడం లేదు. మే 1 నుంచి 4 వరకు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఇటీవల కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో సోమవారం కూడా బొల్లినేనిని అధికారులు చంచల్‌గూడ జైలు నుంచి కోఠిలోని సీబీఐ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఎన్ని విధాలా ప్రశ్నించినా.. తనకు అనారోగ్యం ఉందని సమాధానాలు దాటవేసినట్లు సమాచారం. అదే విధంగా రెండు రాష్ట్రాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టిన విధానం, వాటి డాక్యుమెంట్లు ముందు పెట్టి ప్రశ్నలు సంధించినా నోరు తెరవలేదని తెలిసింది. చివరి రోజు అయిన మంగళవారం కస్టడీ ముగియనుంది. ఆఖరు రోజైనా సమాధానాలు రాబట్టాలన్న పట్టుదలతో ఉన్నారు సీబీఐ అధికారులు. విచారణ అనంతరం బొల్లినేని తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. చదవండి: బొల్లినేని అక్రమాలు ఇన్నిన్ని కాదయా! -
నోరు మెదపని బొల్లినేని శ్రీనివాసగాంధీ
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీబీఐ అరెస్టు చేసిన మాజీ సీజీఎస్టీ అధికారి బొల్లినేని శ్రీనివాసగాంధీ నోరు విప్పలేదని సమాచారం. మే 1 నుంచి 4వ తేదీ వర కు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు శుక్రవారం ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి సీబీఐ కార్యాలయానికి బొల్లినేనిని తీసుకొచ్చారు. కరోనా నేపథ్యంలో పీపీఈ కిట్లు వేసి విచారణకు తీసుకురావడం గమనార్హం. ఈ సందర్భంగా తొలిరోజు విచారణలో సీబీఐ అధికారులకు గాంధీ ఏమాత్రం సహకరించలేదని తెలిసింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో 2019 జూలైలో బొల్లినేనిపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని ఎన్నిసార్లు ఆదేశించినా సహకరించకపోవడంతో నాటకీయ పరిణామాల మధ్య ఏప్రిల్ 20న ఆయన్ని సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఆ రోజు కూడా అనేక అనారోగ్య కారణాలు చూపి అరెస్టు తప్పించుకుందామనుకున్న గాంధీని సీబీఐ ఎట్టకేలకు అరెస్టు చేసింది. శనివారం సీబీఐ అధికారుల ప్రశ్నలకు బొల్లినేని ఎలాంటి సమాధానాలు చెప్పలేదని సమాచారం. గతంలో ఇలాంటి కేసులు ఎన్నో విచారించిన బొల్లినేని ప్రస్తుతం తానే ముద్దాయి కావడంతో కావాలనే సమాధానం చెప్పడం లేదని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. చదవండి: బొల్లినేని అక్రమాలు ఇన్నిన్ని కాదయా! -
బొల్లినేని అక్రమాలు ఇన్నిన్ని కాదయా!
సాక్షి, హైదరాబాద్: సీజీఎస్టీ మాజీ అధికారి బొల్లినేని శ్రీనివాసగాంధీ అక్రమాలు బోలెడు. అవి ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఆదాయానికి మించి ఆస్తుల కేసుతోపాటు రూ.5 కోట్ల లంచం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాసగాంధీని మంగళవారం సీబీఐ నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేసింది. ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరుపొందిన గాంధీ దాదాపు రూ.200 కోట్ల ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన విధులు నిర్వహించిన చోటల్లా వివాదాలతో సావాసం చేసేవారన్న ఆరోపణలకు క్రమంగా బలం చేకూరుతోంది. ఆయన అనేక అక్రమాలకు పాల్పడ్డారని వివిధ కేంద్ర సంస్థలకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సీబీఐ అరెస్టు చేసే సందర్భంలో కూడా ఆయన తన కుటుంబసభ్యులకు కరోనా సోకిందంటూ దొంగపత్రాలు సృష్టించి అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. సీవీసీ, ఆర్థికశాఖ, సీజీఎస్టీ వద్ద.. పోస్టింగ్‌ల విషయంలో గాంధీకి తెరవెనుక అనేక శక్తులు సాయం చేశాయని విమర్శలున్నాయి, ఈ విషయంపై గతంలో ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. 2019లో శ్రీనివాసగాంధీ బేగంబజార్ జీఎస్టీ సూపరింటెండెంట్‌గా ఉన్న సమయంలో కూలింగ్ పీరియడ్‌లో ఉన్నారు. వాస్తవానికి కూలింగ్ పీరియడ్‌లో ఉన్నవారికి ఎలాంటి కేసులు అప్పగించరు. నిబంధనల ప్రకారం... కూలింగ్ పీరియడ్‌లో కనీసం రెండు సంవత్సరాలపాటు పనిచేయాలి. కానీ, ఆయన కూలింగ్ పీరియడ్‌లో మూడు నెలలు కూడా పనిచేయలేదని సొంత కార్యాలయం సిబ్బందే అంటున్నారు. కొందరు రాజకీయ నేతలు, సొంత శాఖలోని ఇద్దరు వివాదాస్పద ఉన్నతాధికారులు ఆయన్ను తాత్కాలిక డిప్యుటేషన్ పేరిట నిబంధనలకు విరుద్ధంగా బషీర్‌బాగ్‌లోని యాంటీ ఈవేషన్ వింగ్–జీఎస్టీకి బదిలీ చేశారు. సాధారణ ఉద్యోగులకు ఇలాంటి బదిలీలు దాదాపుగా అసాధ్యం. ఈ వివాదాస్పద బదిలీ వ్యవహారంపై కొందరు వ్యక్తులు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ), డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్–ఢిల్లీ, జీఎస్టీ చీఫ్ కమిషనర్ హైదరాబాద్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను కేంద్ర ఆర్థికమంత్రికి కూడా పంపారని సమాచారం. గాంధీ అక్రమాలకు సహకరించిన చిలుక సుధారాణి, ఇద్దరు జీఎస్టీ ఉన్నతాధికారులపై త్వరలోనే అధికారిక విచారణ ప్రారంభం కానుందని సమాచారం. హైదరాబాద్‌లోని ఓ వ్యాపారి నుంచి 2020లో రూ.5 కోట్ల లంచం డిమాండ్ చేసిన కేసు తెరపైకి రానుంది. ఈ కేసులోనూ సీబీఐ అధికారులు చురుగ్గా ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే రూ.10 లక్షల లంచం తీసుకున్నారని సీబీఐ అధికారులు నిర్ధారించారు. మిగిలిన సాంకేతిక, డాక్యుమెంటెడ్ ఆధారాలు కూడా సేకరించేపనిలో సీబీఐ నిమగ్నమైంది. మోకాలి, కడుపునొప్పి సాకుగా చూపి! సీబీఐ అధికారులు వచ్చిన సమయంలో గాంధీ బంధువునంటూ ఓ వృద్ధుడు ఆయన ఇంటికి వచ్చాడు. లోపల కొన్ని బట్టలు సర్దుకుని బైక్‌పై బయలుదేరడం అక్కడే వున్న అధికారులకు అనుమానం వచ్చింది. వెంటనే ఆ వృద్ధుడిని రహస్యంగా ఫాలో అయి పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న ఫోన్లో బొల్లినేని శ్రీనివాస్‌తో మరోఫోన్తో జరిపిన సందేశాలు లభించాయి. అలా అతని ఆచూకీ కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చిక్కింది. అక్కడికెళ్లిన తరువాత బొల్లినేని ఐసీయూలో మోకాలి, కడుపునొప్పులతో చికిత్స పొందుతుండటం చూసి సీబీఐ అధికారులు అవాక్కయ్యారు. అతని సమస్యలు తీవ్రమైనవి కావని, ఆసుపత్రి యాజమాన్యం చెప్పడంతో అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ ఇంట్లో ఆన్‌చేసి.. పరారీ సీబీఐ అరెస్టును తప్పించుకునేందుకు గాంధీ విఫలయత్నం చేశారు. ఈ క్రమంలో ఆయన వ్యవహారాలు చూసిన సీబీఐ అధికారులు ముక్కున వేలేసుకున్నారు. మంగళవారం సీబీఐ అధికారులు బొల్లినేనిని అరెస్టు చేసేందుకు అతని ఇంటికి వెళ్లగా.. అక్కడ తన తెలివితేటలు ప్రదర్శించారని తెలిసింది. తన ఫోన్ స్విచ్చాన్ చేసి (తన లొకేషన్ అక్కడే కనిపించేలా) ఇంటి నుంచి పరారయ్యారు. పట్టు వీడని అధికారులు గాంధీ ఇంటి దగ్గరే మకాం వేశారు. అయితే గాంధీ కుటుంబంలోని మహిళలంతా ఆయనను ఎలా అరెస్ట్ చేస్తారంటూ డ్రామా క్రియేట్ చేసి తమను దుర్భాషలాడారని సీబీఐ అధికారులు వాపోయారు. -
కోవిడ్ పేరుచెప్పి.. సీబీఐని ఏమార్చబోయిన బొల్లినేని
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ సీజీఎస్టీ అధికారి బొల్లినేని శ్రీనివాస గాంధీని సీబీఐ అరెస్టు చేసింది. ఆయనను మంగళవారమే అదుపులోకి తీసుకుని, పలు అంశాలపై ప్రశ్నించినా.. బుధవారం సాయంత్రం అధికారికంగా అరెస్టును ప్రకటించింది. తర్వాత సీబీఐ మేజిస్ట్రేటు ముందు ప్రవేశపెట్టింది. కోర్టు బొల్లినేని గాంధీకి వచ్చే నెల 7వ తేదీ వరకు రిమాండ్ విధించింది. కోవిడ్ పేరుతో డ్రామా తన అరెస్టును అడ్డుకోవడానికి బొల్లినేని శ్రీనివాసగాంధీ చివరి నిమిషం వరకు విశ్వప్రయత్నాలు చేసినట్లు సమాచారం. అరెస్టును ఆపాలంటూ తన ఆంతరంగికులకు ఫోన్లు చేసి ఒత్తిడి తెచ్చాడని తెలిసింది. సీబీఐ అధికారులు ఇంటికి వచ్చేసరికి.. తన కుటుంబ సభ్యులకు కోవిడ్–19 పాజిటివ్ వచ్చిందంటూ నకిలీ రిపోర్టులు సిద్ధం చేసి ఉంచినట్టు సమాచారం. అవి నకిలీవని తేల్చిన సీబీఐ అధికారులు..బొల్లినేని గాంధీని అదుపులోకి తీసుకున్నా రు. బొల్లినేని గాంధీపై గతేడాది సీబీఐ మరో కేసు ను నమోదు చేసింది. బొల్లినేని ఓ వ్యవహారంలో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి నుంచి రూ.5 కోట్లు లంచం డిమాండ్ చేశాడు. రూ.10 లక్షలు నగదు, మిగతా రూ.4.90 కోట్లకు సిటీ శివారులో భూములు గిఫ్ట్‌గా ఇవ్వాలని షరతు విధించాడు. ఈ క్రమంలో బాధితుడి ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. ఇలా లంచం కేసు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఉన్నప్పటికీ బొల్లినేనికి గత డిసెంబర్లో పదోన్నతి రావడం గమనార్హం. అయి తే వరుస ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఫిబ్రవరి 24న సెంట్రల్ జీఎస్టీ నుంచి బొల్లినేని గాంధీని సస్పెండ్ చేస్తూ..సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ట్యాక్సెస్ ఉత్తర్వులు ఇచ్చింది. నోటీసులకు స్పందనే లేదు! 2019 జూలై 8న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బొల్లినేని శ్రీనివాసగాంధీ, అతని భార్యపై సీబీఐ కేసు నమోదు చేసింది. తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసి.. రూ.3.74 కోట్ల ఆస్తులు గుర్తించింది. ఆ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ.200 కోట్ల కంటే ఎక్కువ కావడం గమనార్హం. సీబీఐ నమోదు చేసిన కేసు, ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. 2010 నుంచి 2019 మధ్య శ్రీనివాస గాంధీ ఆస్తులు ఏకంగా 288 శాతం పెరిగాయి. ఈ కేసుకు సంబంధించి పలుమార్లు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినా.. గాంధీ స్పందించలేదని, ఒక్కరోజు కూడా విచారణకు రాలేదని సీబీఐ అధికారులు తెలిపారు. అసలు సీబీఐ అడిగిన ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వివరించారు. ఈ కేసులో సాక్షులుగా ఉన్నవారిపై బెదిరింపులు, ప్రలోభాలకు దిగాడని, వారు విచారణకు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు. ఈ మేరకు బాధితులు సీబీఐ అధికారులకు మరోసారి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు అరెస్టు చేశారు. చదవండి: (బొల్లినేని శ్రీనివాస గాంధీ అరెస్ట్) -
బొల్లినేని శ్రీనివాస గాంధీ అరెస్ట్
-
బొల్లినేని శ్రీనివాస గాంధీ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ జీఎస్టీ అధికారి బొల్లినేని శ్రీనివాస గాంధీని సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసులో సీబీఐ వరుసగా ఇచ్చిన అనేక నోటీసులకు ఆయన స్పందించక పోవడం, విచారణకు హాజరు కాకపోవడంతో ఆయన్ను మంగళవారం హైదరాబాద్‌లో అరెస్టు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. 2019 జూలైలో గాంధీపై తొలిసారిగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసును సీబీఐ నమోదు చేసింది. అలాగే హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి నుంచి రూ.5 కోట్ల లంచం అడిగారన్న ఫిర్యాదుతో 2020 సెప్టెంబర్‌లో ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ ఆరోపణలు ఉన్నా ఆయన 2020 డిసెంబర్లో అసిస్టెంట్ కమిషనర్‌గా పదోన్నతి సాధించడం గమనార్హం. అయితే ఆ తరువాత 2021 ఫిబ్రవరి 24న ఆయన్ను సెంట్రల్ జీఎస్టీ నుంచి సస్పెండ్ చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) ఉత్తర్వులిచ్చింది. బదిలీలే లేవు..! సెంట్రల్ ఎక్సైజ్ విభాగంలో 1992లో ఇన్స్పెక్టర్గా చేరిన బొల్లినేని శ్రీనివాస గాంధీ 2002లో సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొందాడు. 2003లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌లోకి డెప్యుటేషన్‌పై వెళ్లి ఏడాదిపాటు అందులో పనిచేశాడు. 2004లో ఈడీకి బదిలీపై వెళ్లిన బొల్లినేని.. గతంలో ఎన్నడూ, ఎవరూ పనిచేయని స్థాయిలో 2017 వరకు ఎలాంటి బదిలీలు లేకుండా ఈడీ (ఇన్వెస్టిగేషన్)లోనే విధులు నిర్వర్తించాడు. ఇలాంటి పోస్టుల్లో సాధారణంగా ఎవరికైనా రెండేళ్లే అవకాశం ఇస్తారు. మరీ అత్యవసరం అనుకుంటే మరో ఏడాది డెప్యుటేషన్ కొనసాగిస్తారు. అంతే తప్ప 13 ఏళ్లపాటు ఒకేచోట కొనసాగించిన దాఖలాలు లేవని సొంత శాఖ అధికారులే విస్తుపోతున్నారు. పోస్టింగ్ వెనుక చంద్రబాబు హస్తం..! నిబంధనలకు విరుద్ధంగా బొల్లినేనికి కీలక పోస్టు లభించడం వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో హైదరాబాద్ జీఎస్టీ, బేగంబజార్ రేంజ్‌కి బొల్లినేనిని సూపరింటెండెంట్‌గా బదిలీ చేశారు. అక్కడ కూడా నిబంధనల ప్రకారం అతడికి దర్యాప్తు విభాగంలో పోస్టింగ్ ఇవ్వకూడదు. ఈ సమయాన్ని ‘కూలింగ్ పీరియడ్’ అంటారు. కానీ గాంధీ తనకున్న పరిచయాలతో కూలింగ్ పీరియడ్‌ను తప్పించుకొని యాంటీ ట్యాక్స్ ఎవేషన్ డిపార్ట్మెంట్ (బషీర్‌బాగ్)లో పోస్టింగ్ తెచ్చుకొని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిపై జీఎస్టీ ఎగవేత కేసులో బొల్లినేని వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలున్నాయి. రూ.65 లక్షల జీతం.. రూ.200 కోట్ల ఆస్తులు! 2010–2019 వరకు పదేళ్లలో రూ. 65 లక్షలు జీతంగా అందుకున్న బొల్లినేని తన కుమార్తె మెడికల్ సీటుకే రూ. 70 లక్షలు చెల్లించడం గమనార్హం. ఇక ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారమే రూ. 3.74 కోట్లు. కూకట్పల్లి హైదర్‌నగర్‌లో తన ఇంటిని రూ. 1.20 కోట్లతో నిర్మించాడు. 2019 జూలై 8న బొల్లినేనిపై అక్రమాస్తుల కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు.. ఆ మరుసటి రోజు హైదరాబాద్, విజయవాడల్లోని ఆస్తులపై ఏకకాలంలో దాడులు చేశారు. ఏపీలోని తుళ్లూరు, గుణదల, పెద్దపులిపాక, కన్నూరు, కంకిపాడు, ప్రొద్దుటూరుతోపాటు హైదరాబాద్‌లోని కొండాపూర్, మదీనాగూడ, కూకట్‌పల్లిలలో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో బొల్లినేని భారీగా స్థిరాస్తులు సంపాదించినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వాటి విలువ దాదాపు రూ. 200 కోట్లు ఉంటుందని లెక్కగట్టారు. సీబీఐ కేసుల ఆధారంగా ఈడీ కూడా గాంధీపై దర్యాప్తు మొదలుపెట్టింది. ఈడీ అధికారులు బొల్లినేనిపై ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) దాఖలు చేశారు. భారీ ఎత్తున మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్లు పేర్కొన్నారు. చదవండి: కరోనా టీకా.. జనాభాలో యవ్వనులే అధికం చదవండి: పక్కాగా తెలంగాణ అంతటా కర్ఫ్యూ -
బొల్లినేని శ్రీనివాసగాంధీపై సస్పెన్షన్ వేటు
సాక్షి, హైదరాబాద్: సెంట్రల్ జీఎస్టీలో అసి స్టెంట్ కమిషనర్‌గా ఉన్న బొల్లినేని శ్రీనివాసగాంధీపై ఎట్టకేలకు సస్పెన్షన్ వేటు పడింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు, రూ.5 కోట్ల లంచం డిమాండ్ చేసిన ఘటనల్లో సీబీఐ కేసులు నడుస్తున్న క్రమంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్, కస్టమ్స్ (సీబీఐసీ) శాఖ బొల్లినేనిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అతనితోపాటు డిప్యూటీ కమిషనర్ చిలుకా సుధారాణిపైనా వేటు వేసింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లకూడదంటూ ఆదేశించింది. అవినీతి, అక్రమాలు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బొల్లినేనిపై ఏడాది వ్యవధిలో రెండు సార్లు సీబీఐ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అనుచరుడిగా ఆయన రాజకీయ శత్రువులపై కేసులు పెట్టి వేధించారన్న ఆరోపణలు ఎదుర్కొన్న బొల్లినేని అక్రమాలు క్రమంగా వెలుగు చూస్తున్నాయి. బొల్లినేని వేధింపులకు తాళలేక గతేడాది ఓ బాధితుడు సీబీఐకి ఫిర్యాదు చేశారు. 2019 జూలైలో బొల్లినేనిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. 2020 సెప్టెంబర్‌లో మరో కేసు నమోదు చేసింది. అయితే ఇన్ని ఆరోపణలున్నా.. బొల్లినేనికి ఉన్నతాధికారులు క్లీన్ చిట్ ఇవ్వడంతో గతేడాది అసిస్టెంట్ కమిషనర్‌గా పదోన్నతి పొందడం గమనార్హం. సాధారణంగా పదోన్నతుల సమయంలో వ్యక్తిగత ప్రవర్తనపై సీబీఐసీ ఢిల్లీ అధికారులు రిపోర్టు కోరినప్పుడు తనపై సీబీఐ కేసులున్న సంగతి పైకి వెళ్లకుండా బొల్లినేని జాగ్రత్తపడ్డాడని సమాచారం. పకడ్బందీగా వేధింపులు.. రూ.కోట్లలో బేరాలు దర్యాప్తులో బొల్లినేని అక్రమాలు తెలుసుకుని సీబీఐ అధికారులు అవాక్కయ్యారు. విశ్వసనీయ సమా చారం ప్రకారం.. బొల్లినేని తన వద్దకు వచ్చిన జీఎస్టీ రిటర్నులను బాగా అధ్యయనం చేస్తాడు. లోపాలుంటే వాటిని దర్యాప్తు చేసి నిందితులపై కేసు నమోదు చేయాలి. కానీ, బొల్లినేని ఇక్కడే తన చాతుర్యాన్ని ప్రదర్శిస్తాడని తెలిసింది. ముందుగా తాను కేసు నమోదు చేయబోయే వ్యాపారి, ఉత్పత్తి దారులకు సన్నిహితంగా ఉండే సిబ్బంది, వ్యాపార భాగస్వాములను విచారణ పేరుతో పిలిపించి, కేసులు పెడతామని బెదిరిస్తాడు. వారు దారికి రాగానే.. ముందుగా రాసిన స్టేట్మెంట్పై సంత కాలు తీసుకుంటాడు. తర్వాత అసలు వ్యాపారిని పిలిపిస్తాడు. ‘మీ సిబ్బంది అంతా అప్రూవర్‌గా మారారు. మీరే మిగిలారు.. మా ఉన్నతాధికారులు మీపై కోపంగా ఉన్నారు. మేం అడిగిన్ని రూ.కోట్లు ఇవ్వకపోతే మీపై కేసులు పెడతాం. మీ ఇంట్లో ఆడవారు కూడా జైల్లోకి వెళ్లాల్సి వస్తుంది’అని బెదిరింపులకు దిగుతాడు. అడిగినంత ఇస్తే కేసే లేదు.. కానీ, ఇవ్వకపోతే వారిపై కేసులు నమోదు చేసేస్తాడు. డిమాండ్ చేసిన లంచాన్ని నగదు రూపంలో కూడా పూర్తిగా తీసుకోడు. 10 శాతం నగదు, మిగిలిన 90 శాతం బాధితుల భూములు బినామీల పేరిట రాయించుకుంటాడని తెలిసింది. బదిలీలు లేకుండా ఒకేచోట 13 ఏళ్లు.. 1992లో సెంట్రల్ ఎక్సైజ్ విభాగంలో ఇన్ స్పెక్టర్‌గా చేరిన బొల్లినేని శ్రీనివాస గాంధీ 2002లో సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొందాడు. 2003లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ లోకి డిప్యుటేషన్ పై వెళ్లిన ఆయన ఏడాది పాటు అందులో పనిచేశాడు. 2004లో ఈడీకి బదిలీపై వెళ్లిన బొల్లినేని.. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఎవరూ పని చేయని స్థాయిలో 2017 వరకు ఎలాంటి బదిలీలు లేకుండా ఈడీ (ఇన్వెస్టిగేషన్ ) లోనే విధులు నిర్వర్తించాడు. ఇలాంటి పోస్టుల్లో ఎవరికైనా రెండేళ్లే అవకాశమిస్తారు. మరీ అత్యవసరం అనుకుంటే మరో ఏడాది అదనంగా డిప్యుటేషన్ కొనసాగనిస్తారు. అంతే తప్ప 13 ఏళ్ల పాటు ఒకే చోట కొనసాగించిన దాఖలాలు లేనే లేవని సొంతశాఖ అధికారులే విస్తుపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బొల్లినేనికి కీలక పోస్టు లభించడం వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో హైదరాబాద్ జీఎస్టీ, బేగంబజార్ రేంజ్‌కి బొల్లినేనిని సూపరింటెండెంట్‌గా బదిలీ చేశారు. అక్కడ కూడా నిబంధనల ప్రకారం అతడికి దర్యాప్తు విభాగంలో పోస్టింగ్ ఇవ్వకూడదు. ఈ సమయాన్ని ‘కూలింగ్ పీరియడ్’అంటారు. కానీ, తనకున్న పరిచయాలతో కూలింగ్ పీరియడ్‌ను తప్పించుకుని యాంటీ ట్యాక్స్ ఎవేషన్ డిపార్ట్మెంట్, బషీర్‌బాగ్‌లో పోస్టింగ్ తెచ్చుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిపై జీఎస్టీ ఎగవేత కేసులో బొల్లినేని వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలున్నాయి. రూ.65 లక్షల జీతం.. రూ.200 కోట్ల ఆస్తులు! 2010–2019 వరకు పదేళ్లలో రూ.65 లక్షలు జీతంగా అందుకున్న బొల్లినేని.. కుమార్తె మెడికల్ సీటుకే రూ.70 లక్షలు చెల్లించడం గమనార్హం. ఇక ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తులు విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారమే రూ.3.74 కోట్లు.. కూకట్పల్లి హైదర్‌నగర్‌లో ఇంటిని రూ.1.20 కోట్లతో నిర్మించారు. 2019 జూలై 8న బొల్లినేనిపై అక్రమాస్తుల కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు.. ఆ మరుసటి రోజు హైదరాబాద్, విజయవాడల్లోని ఆస్తులపై ఏకకాలంలో దాడులు చేశారు. ఏపీలోని తుళ్లూరు, గుణదల, పెద్దపులిపాక, కన్నూరు, కంకిపాడు, ప్రొద్దుటూరు.. హైదరాబాద్‌లోని కొండాపూర్, మదీనాగూడ, కూకట్‌పల్లిలలో బొల్లినేని భారీగానే స్థిరాస్తులు కూడగట్టినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వాటి విలువ దాదాపు రూ.200 కోట్లు ఉంటుందని లెక్కగట్టారు. సీబీఐ కేసుల ఆధారంగా ఈడీ కూడా అతనిపై దర్యాప్తు మొదలుపెట్టింది. ఈడీ అధికారులు బొల్లినేనిపై ఇప్పటికే ఎన్ ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) దాఖలు చేశారు. భారీ ఎత్తున మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు పేర్కొన్నారు. -
‘బొల్లినేని’ కేసు: కీలక ఆధారాలు సేకరించిన సీబీఐ
-
‘బొల్లినేని’ కేసులో సీబీఐ దూకుడు!
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ అధికారి బొల్లినేని శ్రీనివాసగాంధీ అవినీతి కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి బొల్లినేని శ్రీనివాసగాంధీకి వ్యతిరేకంగా పలు కీలక సాక్ష్యాలను సేకరించింది. ఈ సాంకేతిక ఆధారాల సాయంతో కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది. జీఎస్టీ కమిషనర్ చిలుక సుధారాణి, సూపరింటెండెంట్ బొల్లినేని శ్రీనివాసగాంధీలు కలిసి ఓ వ్యాపారవేత్త వద్ద రూ.5 కోట్ల లంచం డిమాండ్ చేసిన ఫిర్యాదుపై సీబీఐ సెప్టెంబర్ 11న కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసి అత్యంత కీలకమైన ఆడియో రికార్డులు, పలు ఫొటోలు సంపాదించింది. ఇందులో బొల్లినేని శ్రీనివాసగాంధీ, చిలుక సుధారాణి, బాధితుడు సత్యశ్రీధర్‌రెడ్డిల సంభాషణల రికార్డులున్నాయని తెలిసింది. వీరు రూ.10 లక్షల లంచం తీసుకుంటుండగా తీసిన పలు ఫొటోలు కూడా సీబీఐ సేకరించిందని సమాచారం. ఈ కాల్స్‌లో లంచం డిమాండ్ చేయడం, వాటిని ఎప్పుడు ఇవ్వాలి? ఎలా ఇవ్వాలో సత్యశ్రీధర్‌రెడ్డికి సూచించిన వ్యవహారం మొత్తం రికార్డయింది. (చదవండి: స్వేచ్ఛ, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు) అసలేం జరిగిందంటే..? ఇన్ఫినిటీ మెటల్ ప్రొడక్ట్స్, దాని అనుబంధ కంపెనీలు అక్రమమార్గంలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను పొందాయంటూ జీఎస్టీలో కేసు నమోదైంది. కేసులో నింది తుడు జగన్నగారి సత్యశ్రీధర్‌రెడ్డి అరెస్టయి, మార్చి 29న విడుదలయ్యాడు. ఇదే కేసులో వ్యాపార భాగస్వామిగా ఉన్న అతని భార్య అరెస్టు కాకుండా, మొత్తం కేసును నీరుగార్చేందుకు హైదరాబాద్ జీఎస్టీ పన్ను ఎగవేత నిరోధక విభాగంలో డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న చిలుక సుధారాణి, అదే విభాగంలో సూపరింటెండెంట్‌గా ఉన్న బొల్లినేని శ్రీనివాసగాంధీలు రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందుకు బాధితుడు సత్యశ్రీధర్ కూడా అంగీకరించాడు. అడ్వాన్సుగా రూ.10 లక్షలు ఏప్రిల్ 15న చెల్లించాడు. మిగిలిన రూ.4.90 కోట్ల నగదుకు బదులుగా ఓపెన్ప్లాట్ల రూపంలో ఇవ్వాలని వారు షరతు విధించారు. ఈ లంచం వ్యవహారంలో సీబీఐకి ఉప్పందింది. దీంతో సుధారాణి, బొల్లినేని శ్రీనివాసగాంధీలతోపాటు లంచం విషయాన్ని తమకు చెప్పకుండా దాచినందుకు బాధితుడు సత్యశ్రీధర్‌రెడ్డిపైనా సీబీఐ కేసు నమోదు చేయడం గమనార్హం. ఏడాదికాలంలో బొల్లినేనిపై రెండో కేసు నమోదు కావడం గమనార్హం. గతేడాది బొల్లినేనిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైన విషయం తెలిసిందే. ఎంపీ సుజనా చౌదరికి సంబంధించిన జీఎస్టీ ట్యాక్స్ ఎగవేత కేసును దర్యాప్తు చేసింది సుధారాణి, బొల్లినేని శ్రీనివాసగాంధీలే. (చదవండి: చంద్రబాబు ఆప్తుడు బొల్లినేనిపై మరో సీబీఐ కేసు) -
బొల్లినేనిపై మరో సీబీఐ కేసు
-
చంద్రబాబు ఆప్తుడు బొల్లినేనిపై మరో సీబీఐ కేసు
సాక్షి, హైదరాబాద్ : జీఎస్టీ కమిషనరేట్‌లో ఉన్నతాధికారి బొల్లినేని శ్రీనివాసగాంధీపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శుక్రవారం మరో కేసు నమోదు చేసింది. ఇన్ పుట్ క్రెడిట్ మంజూరుకు సంబంధించి రూ.5 కోట్లు డిమాండ్ చేసిన కేసులో హైదరాబాద్ జీఎస్టీ కమిషరేట్ పన్ను ఎగ వేత నిరోధక విభాగం డిప్యూటీ కమిషనర్ చిలుక సుధారాణి, సూపరిం టెండెంట్ బొల్లినేని శ్రీనివాసగాంధీ, ఓ ప్రైవేట్ కంపెనీ డైరెక్టర్ సత్య శ్రీధర్‌రెడ్డిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు తవ్వుతున్న క్రమంలోనే బొల్లినేనిపై తాజా కేసు నమోదైందని సమాచారం. అసలేం జరిగిందంటే.?: హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ పన్ను ఎగవేత విభాగంలోని అధికారులు లంచం తీసుకున్నట్లుగా గతేడాది అక్టోబర్ 31న సీబీఐకి సమాచారంఅందింది. ఉన్నతాధికారుల నుంచి అనుమతి రాగానే దీనిపై సీబీఐ విచారణ మొదలుపెట్టింది. ఇన్ఫినిటీ మెటల్ ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్– దాని అనుబంధ సంస్థలు అక్రమంగా ఇన్ పుట్ క్రెడిట్ ట్యాక్స్ (ఐటీసీ) పొందాయన్న కేసును చిలుక సుధారాణి, బొల్లినేని శ్రీనివాసగాంధీ బృందం దర్యాప్తు చేసింది. కేసును నిందితులకు అనుకూలంగా మార్చేందుకు వీరు, మరికొందరు జీఎస్టీ అధికారులతో కలిసి రూ.5 కోట్లు లంచం డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా 2019, ఏప్రిల్ 15న రూ.10 లక్షల నగదు తీసుకున్నారు. మిగిలిన మొత్తానికి భూములను కొనివ్వాలన్న ఒప్పందం చేసుకున్నారు. అయితే ఈ విషయంపై సీబీఐకిగానీ, ఇతర దర్యాప్తు సంస్థలకు గానీ ఫిర్యాదు చేయనందుకుగాను సత్య శ్రీధర్‌రెడ్డి పేరును కూడా సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్చింది. కాగా, మాజీ సీఎం చంద్రబాబుకు అత్యంత ఆప్తుడిగా పేరొందిన శ్రీనివాసగాంధీపై గతేడాది ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదైన విషయం తెలిసిందే. అక్రమాస్తులు, మనీ ల్యాండరింగ్ ఆరోపణలు సాక్షి, హైదరాబాద్: గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌లో (ఈడీ) పనిచేసినప్పుడు తన పోస్టును అడ్డం పెట్టుకుని, టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలు, సూచనల మేరకు ఎదుటి వారిపై విరుచుకుపడినట్లు ఆరోపణలున్న బొల్లినేని శ్రీనివాసగాంధీపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే సీబీఐ గత ఏడాది ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. దీని ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసింది. గత ఏడాది జూలై 8న గాంధీపై అక్రమాస్తుల కేసు నమోదు చేసిన సీబీఐ హైదరాబాద్, విజయవాడల్లోని ఆయన ఆస్తులపై ఏకకాలంలో దాడులు చేసింది. ఈ నేపథ్యంలోనే బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.200 కోట్ల విలువచేసే అక్రమాస్తుల్ని గుర్తించింది. ఈ కేసు ఆధారంగా ముందుకు వెళ్లిన ఈడీ శ్రీనివాసగాంధీపై అదే నెల 23న ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) దాఖలు చేసింది. ఆయన భారీ ఎత్తున మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపించింది. సీబీఐ నమోదు చేసిన కేసు, చేపట్టిన ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. 2010 నుంచి 2019 మధ్య శ్రీనివాస గాంధీ ఆస్తులు ఏకంగా 288 శాతం పెరిగాయి. చంద్రబాబు ఆదేశాల మేరకు పనిచేస్తూ ఆయన చెప్పిన వారిని టార్గెట్ చేయడం, అనుకూలంగా వ్యవహరించమన్న వారిని విడిచిపెట్టడం చేస్తూ భారీగా ఆర్జించినట్లు గాంధీపై ఫిర్యాదులు ఉన్నాయి. ఇలాంటి వ్యవహారాలతో లబ్ధి పొందిన నేపథ్యంలోనే 2010లో రూ.21 లక్షలుగా ఉన్న ఆయన ఆస్తులు.. 2019, జూన్ 26 నాటి ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.3.74 కోట్లకు చేరాయి. బహిరంగ మార్కెట్లో వీటి విలువ దాదాపు రూ.200 కోట్ల పైమాటే. చంద్రబాబుకు సన్నిహితుడన్న పేరు... చంద్రబాబుకు సన్నిహితుడిగా ఉండి, ఆయన అండదండలతో గతంలో ఏ అధి కారి పని చేయని విధంగా 2004 నుంచి 2017 వరకు బొల్లినేని శ్రీనివాస గాంధీ ఈడీలోనే విధులు నిర్వర్తించారు. అప్పట్లో అనేక ఆరోపణలు వచ్చాయి. అయినా చంద్రబాబు పైరవీల ఫలితంగా ఆయన్ను బషీర్‌బాగ్ జీఎస్టీ భవన్లో జీఎస్టీ ఎగవేత నిరోధక విభాగం సూపరింటెండెంట్ ఆఫీ సర్గా నియమించారు. ఆ విభాగం కేంద్రం గా చేసిన అవినీతిపై తాజాగా సీబీఐ మరో కేసు నమోదు చేసింది. గతంలో ఎవరూ పని చేయని విధంగా బొల్లినేని గాంధీ ఈడీలో సుదీర్ఘకాలం పని చేశారు. 1992లో సెంట్రల్ ఎక్సైజ్ విభాగంలో ఇన్స్పెక్టర్గా చేరిన బొల్లినేని శ్రీనివాస గాంధీ.. 2002లో సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొందారు. 2003లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌లోకి డిప్యుటేషన్‌పై వెళ్లిన ఆయన ఏడాది పాటు పనిచేశారు. 2004లో ఈడీకి బదిలీపై వెళ్లిన గాంధీ గతంలో ఎన్నడూ లేని విధంగా 2017 వరకు ఎలాంటి బది లీలు లేకుండా ఈడీలోనే విధులు నిర్వర్తించారు. ఇలాంటి పోస్టుల్లో పని చేసి వచ్చిన వారికి జీఎస్టీలో ఫోకల్ పోస్టు ఇవ్వరు. అయితే దీనికి భిన్నంగా అందులోనూ గాంధీకి కీలక పోస్టు లభించడం వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిపై జీఎస్టీ ఎగవేత కేసును సైతం పర్యవేక్షించిన గాంధీ ఆయనకు పూర్తి అనుకూలంగా వ్యవహరించారని, దీనికి బదులుగా భారీగా లబ్ధి పొందారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ సుజనా చౌదరి అరెస్టు కాలేదని తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల్లో పెద్దమొత్తంలో ఆస్తులు... గడిచిన పదేళ్లలో రూ.65 లక్షలు జీతంగా అందుకున్న శ్రీనివాస గాంధీ ఆయన కుమార్తె మెడికల్ సీటుకే రూ.70 లక్షలు కట్టారు. కూకట్పల్లి హైదర్‌నగర్‌లో ఇంటిని రూ.1.20 కోట్లతో నిర్మించారు. ఏపీలోని తుళ్లూరు, గుణదల, పెద్దపులిపాక, కన్నూరు, కంకిపాడు, పొద్దుటూరు, హైదరాబాద్‌లోని కొండాపూర్, మదీనాగూడ, కూకట్‌పల్లిలలో, స్థిరాస్తులు కూడగట్టిన గాంధీ భారీగా మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ గత ఏడాది నమోదు చేసిన తన ఈసీఐఆర్‌లో ఆరోపించింది. త్వరలో ఈ కేసుకు సంబంధించి గాంధీ ఆస్తులు స్వాధీనం చేసుకోవడానికి సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉండగా, శ్రీనివాసగాంధీపై సీబీఐ రెండు రోజుల క్రితం మరో కేసు నమోదు చేసింది. ఇన్ పుట్ క్రెడిట్ మంజూరుకు సంబంధించి రూ.5 కోట్లు డిమాండ్ చేసిన కేసులో బొల్లినేనితో పాటు మరో ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. -
బొల్లినేని శ్రీనివాస గాంధీపై సీబీఐ కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ కమిషనరేట్‌లో అవినీతి అధికారులను సీబీఐ పట్టుకుంది. ఓ ప్రైవేట్ కంపెనీకి సంబధించి జీఎస్టీ అవకతవకలను సరి చేయడానికి తెలంగాణ జీఎస్టీ కమిషనరేట్ ఉద్యోగులు సీహెచ్ సుధారాణి, అసిస్టెంట్ డైరెక్టర్ బొల్లినేని శ్రీనివాస గాంధీ 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు కీలకమైన ఆధారాలు లభ్యమయ్యాయి. అందుకు సంబంధించిన పలు డాక్యుమెంట్లను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా.. బొల్లినేని శ్రీనివాస గాంధీ.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు. 1992 ఏప్రిల్ 27న సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో బొల్లినేని శ్రీనివాస గాంధీ ఇన్స్పెక్టర్గా చేరారు. 2002లో సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొంది హైదరాబాద్ కమిషనరేట్‌లో పోస్టింగ్ పొందారు. 2003లో డిప్యుటేషన్‌పై డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్)కి వెళ్లారు. 2004లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి వెళ్లి, 2017 వరకు అక్కడే ఉన్నారు. ఆ తరువాత 2017లో జీఎస్టీకి బదిలీ అయ్యారు. గాంధీ దాదాపు 13ఏళ్ల పాటు ఈడీలో పనిచేశారు. ఈ సమయంలో ఆయన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా మారారు. (ఎల్లో మీడియా దుష్ప్రచారంపై రజత్ భార్గవ్ స్పష్టత) తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం గాంధీ పూర్తిస్థాయిలో పని చేశారు. కేంద్ర మాజీమంత్రి, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సుజనాచౌదరికి చెందిన గ్రూపు కంపెనీల మనీలాండరింగ్‌పై వచ్చిన ఫిర్యాదులను గాంధీ ఉద్దేశ్యపూర్వకంగా బుట్ట దాఖలు చేశారు. పూర్తి ఆధారాలున్నా కూడా సుజనా కంపెనీలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని.. ఫైళ్లను తారుమారు చేశారని కేంద్ర ఆర్థిక శాఖకు గతంలోనే పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలను కాపాడిన నేపథ్యంలోనే గాంధీ ఇంత భారీస్థాయిలో అక్రమాస్తులను కూడబెట్టినట్లు సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. బాబుకు అనుకూలంగా వ్యవహరించడంతో అమరావతి ప్రాంతంలో భూమిని కూడా కట్టబెట్టినట్లు సీబీఐ వర్గాలు భావిస్తున్నాయి. -
బొల్లినేని గాంధీపై ఈడీ కేసు
సాక్షి, హైదరాబాద్: ‘కత్తి పట్టుకుని వీరంగం చేసినోడు అదే కత్తికి బలవుతాడు’ అన్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)లో తన పోస్టును అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆదేశాలు, సూచనల మేరకు ఎదుటివారిపై విరుచుకుపడిన ఈడీ మాజీ అధికారి బొల్లినేని శ్రీనివాసగాంధీపై ఆ విభాగమే కన్నేసింది. ఆయనపై మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ మేరకు మంగళవారం శ్రీనివాస గాంధీపై ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) దాఖలైంది. గాంధీ భారీ ఎత్తున మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు అందులో పేర్కొన్నారు. ఈనెల 8న గాంధీపై అక్రమాస్తుల కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు ఆ మరుసటి రోజు హైదరాబాద్, విజయవాడల్లోని ఆయన ఆస్తులపై ఏక కాలంలో దాడులు చేశారు. ఈ నేపథ్యంలోనే దాదాపు రూ.200 కోట్ల విలువైన అక్రమాస్తుల్ని గుర్తించారు. సీబీఐ కేసు ఆధారంగా ముందుకెళ్లిన ఈడీ అధికారులు.. గాంధీపై ఈ మేరకు కేసు నమోదు చేశారు. 288 శాతం మేర పెరిగిన ఆస్తులు సీబీఐ ప్రాథమిక దర్యాప్తు ప్రకారం 2010 నుంచి 2019 మధ్య శ్రీనివాస గాంధీ ఆస్తులు ఏకంగా 288 శాతం మేర పెరిగాయి. ఆయన ఆస్తులు అనూహ్యంగా పెరిగాయని, ఈడీలో బాధ్యతాయుతమైన పోస్టులో ఉంటూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించాడని గాంధీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. చంద్రబాబు ఆదేశాల మేరకు పనిచేస్తూ ఆయన చెప్పిన వారిని టార్గెట్ చేయడం, అనుకూలంగా వ్యవహరించాలని కోరిన వారిని విడిచిపెడుతూ భారీగా ఆర్జించినట్లు ఆయనపై ఫిర్యాదులు ఉన్నాయి. ఇలాంటి వ్యవహారాలతో లబ్ధి పొందిన నేపథ్యంలోనే 2010లో రూ.21 లక్షలుగా ఉన్న ఆయన ఆస్తులు 2019 జూన్ 26 నాటికి ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఏకంగా రూ.3.74 కోట్లకు చేరాయి. బహిరంగ మార్కెట్లో వీటి విలువ దాదాపు రూ.200 కోట్ల పైమాటే. చంద్రబాబుకు సన్నిహితుడిగా ఉండి, ఆయన అండదండలతో గతంలో ఏ అధికారి పని చేయని విధంగా 2004 నుంచి 2017 వరకు బొల్లినేని శ్రీనివాస గాంధీ ఈడీలోనే విధులు నిర్వర్తించారు. కొన్ని నెలల క్రితమే ఆయన్ను బషీర్‌బాగ్‌లోని జీఎస్టీ భవన్లో జీఎస్టీ ఎగవేత నిరోధక విభాగం సూపరింటెండెంట్ ఆఫీసర్‌గా నియమించారు. ఇలా వరుసగా కీలక పోస్టింగులు పొందడం వెనుకా చంద్రబాబు సహకారం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. బొల్లినేని గాంధీపై కొంతకాలంగా వరుస ఫిర్యాదులు అందుకున్న సీబీఐ హైదరాబాద్ విభాగం.. విజయవాడతోపాటు హైదరాబాద్‌లోని హైదర్‌నగర్, కూకట్‌పల్లిలోని ఆయన నివాసాల్లో దాడులు చేసింది. ఈ దాడుల్లో పలు బ్యాంకు ఖాతాల్లో నగదు నిల్వ ఉన్నట్లు, ఆయన పేరిట హెదరాబాద్లో ప్లాట్లు, స్థిరాస్తులు, కుటుంబసభ్యుల పేరిట ఆస్తులు, విలువైన ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. -
బొల్లినేని గాంధీపై ఈడీ కేసు
సాక్షి, హైదరాబాద్ : ‘కత్తి పట్టుకుని వీరంగం చేసినోడు అదే కత్తికి బలవుతాడు’అన్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)లో తన పోస్టును అడ్డం పెట్టుకుని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆదేశాలు, సూచనల మేరకు ఎదుటివారిపై విరుచుకుపడిన ఈడీ మాజీ అధికారి బొల్లినేని శ్రీనివాసగాంధీపై ఆ విభాగమే కన్నేసింది. ఆయనపై మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ మేరకు మంగళవారం శ్రీనివాస గాంధీపై ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఈసీఐఆర్) దాఖలైంది. గాంధీ భారీ ఎత్తున మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు అందులో పేర్కొన్నారు. ఈనెల 8న గాంధీపై అక్రమాస్తుల కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు ఆ మరుసటి రోజు హైదరాబాద్, విజయవాడల్లోని ఆయన ఆస్తులపై ఏక కాలంలో దాడులు చేశారు. ఈ నేపథ్యంలోనే దాదాపు రూ.200 కోట్ల విలువైన అక్ర మా స్తుల్ని గుర్తించారు. సీబీఐ కేసు ఆధారంగా ముందుకెళ్లిన ఈడీ అధికారులు.. గాంధీపై కేసు నమోదు చేశారు. 288 శాతం పెరిగిన ఆస్తులు సీబీఐ ప్రాథమిక దర్యాప్తు ప్రకారం 2010 నుంచి 2019 మధ్య శ్రీనివాస గాంధీ ఆస్తులు ఏకంగా 288 శాతం మేర పెరిగాయి. ఆయన ఆస్తులు అనూహ్యంగా పెరిగాయని, ఈడీలో బాధ్యతాయుతమైన పోస్టులో ఉంటూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని గాంధీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. చంద్రబాబు ఆదేశాల మేరకు పనిచేస్తూ ఆయన చెప్పిన వారిని టార్గెట్ చేయడం, అనుకూలంగా వ్యవహరించమన్నవారిని విడిచిపెట్టడం చేస్తూ భారీగా ఆర్జించినట్లు ఆయనపై ఫిర్యాదులు ఉన్నాయి. ఇలాంటి వ్యవహారాలతో లబ్ధి పొందిన నేపథ్యంలోనే 2010లో రూ.21 లక్షలుగా ఉన్న ఆయన ఆస్తులు 2019 జూన్ 26 నాటికి ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఏకంగా రూ.3.74 కోట్లకు చేరాయి. బహిరంగ మార్కెట్లో వీటి విలువ దాదాపు రూ.200 కోట్ల పైమాటే. చంద్రబాబుకు సన్నిహితుడిగా ఉండి, ఆయన అండదండలతో గతంలో ఏ అధికారి పని చేయని విధంగా 2004 నుంచి 2017 వరకు బొల్లినేని శ్రీనివాస గాంధీ ఈడీలోనే విధులు నిర్వర్తించారు. కొన్ని నెలల క్రితమే ఆయన్ను బషీర్‌బాగ్‌లోని జీఎస్టీ భవన్లో జీఎస్టీ ఎగవేత నిరోధక విభాగం సూపరింటెండెంట్ ఆఫీసర్‌గా నియమించారు. ఇలా వరుసగా కీలక పోస్టింగులు పొందడం వెనుకా చంద్రబాబు సహకారం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. బొల్లినేని గాంధీపై కొంతకాలంగా వరుస ఫిర్యాదులు అందుకున్న సీబీఐ హైదరాబాద్ విభాగం.. విజయవాడతోపాటు హైదరాబాద్‌లోని హైదర్‌నగర్, కూకట్‌పల్లిలోని ఆయన నివాసాల్లో దాడులు చేసింది. ఈ దాడుల్లో పలు బ్యాంకు ఖాతాల్లో నగదు నిల్వ ఉన్నట్లు, ఆయన పేరిట హెదరాబాద్లో ప్లాట్లు, స్థిరాస్తులు, కుటుంబసభ్యుల పేరిట ఆస్తులు, విలువైన ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. సుజనా కేసులో భారీగా లబ్ధి? 1992లో సెంట్రల్ ఎక్సైజ్ విభాగంలో ఇన్స్పెక్టర్గా చేరిన బొల్లినేని శ్రీనివాస గాంధీ 2002లో సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొందారు. 2003లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌లోకి డిప్యుటేషన్‌పై వెళ్లిన ఆయన ఏడాది పాటు అందులో పనిచేశారు. 2004లో ఈడీకి బదిలీపై వెళ్లి రాజకీయ అండదండలతో 2017 వరకు ఎలాంటి బదిలీలు లేకుండా అక్కడే విధులు నిర్వర్తించారు. ఇలాంటి పోస్టుల్లో పనిచేసి వచ్చినవారికి జీఎస్టీలో కీలక పోస్టు ఇవ్వరు. అయితే అందుకు భిన్నంగా అందులోనూ గాంధీకి కీలక పోస్టు లభించడం వెనుక చంద్రబాబు హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిపై జీఎస్టీ ఎగవేత కేసును సైతం పర్యవేక్షించిన గాంధీ ఆయనకు పూర్తి అనుకూలంగా వ్యవహరించారని, ఇందులో భారీగా లబ్ధి పొందారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ సుజనా చౌదరి అరెస్టు కాలేదని తెలుస్తోంది. గత పదేళ్లలో రూ.65 లక్షలు జీతంగా అందుకున్న శ్రీనివాస గాంధీ ఆయన కుమార్తె మెడికల్ సీటుకే రూ.70 లక్షలు చెల్లించారు. ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తులు విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారమే 3.74 కోట్లుగా ఉంది. కూకట్పల్లి హైదర్‌నగర్‌లో ఇంటిని రూ.1.20 కోట్లతో నిర్మించారు. ఏపీలోని తుళ్లూరు, గుణదల, పెద్దపులిపాక, కన్నూరు, కంకిపాడు, పొద్దుటూరు, నగరంలోని కొండాపూర్, మదీనాగూడ, కూకట్‌పల్లిల్లో స్థిరాస్తులు కూడగట్టిన గాంధీ భారీగా మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ తన ఈసీఐఆర్‌లో ఆరోపించింది. దీన్ని దర్యాప్తు చేస్తున్న ఈడీ హైదరాబాద్ యూనిట్ అధికారులు.. గాంధీ ఆస్తుల్ని ఎటాచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఆయనకు సమన్లు జారీ చేసి విచారించాలని నిర్ణయించారని తెలిసింది. -
బొల్లినేని గాంధీకి సీబీఐ నోటీసులు
సాక్షి, హైదరాబాద్ : ఆదాయానికిమించి ఆస్తులు ఆరోపణలతో అడ్డంగా దొరికిపోయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాజీ అధికారి, జీఎస్టీ సూపరింటెండెంట్ బొల్లినేని శ్రీనివాస గాంధీకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఆయన ఆదాయానికి మించి విచ్చలవిడిగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించిన సీబీఐ అధికారులు నిన్న ఏకకాలంలో దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. కాగా జీఎస్టీ పన్ను ఎగవేత విభాగం సూపరింటెండెంట్‌గా కూడా ఆయన పలు కంపెనీలను ఇబ్బందులకు గురిచేశారన్న ఆరోపణలతో వీటిపై కూడా సీబీఐ దర్యాప్తు చేపట్టింది. అలాగే హై ప్రొఫైల్ కేసులను డీల్ చేయడంలో పాటు, సీరియస్ కేసులను... చిన్న కేసులుగా మార్చి ఆ కేసులను మూసివేయడంలో ఘనాపాటీ అని ఆరోపణలు వెల్లువెత్తాయి. చదవండి: సీబీఐకి బుక్కయిన బొల్లినేని గాంధీ భారీ బ్యాంక్ ఫ్రాడ్ కేసులైన ఫోనిక్స్ గ్రూప్, ముసద్దీలాల్ జువెల్లరీ, లాంకో గ్రూప్, సుజనా గ్రూప్, క్యూ సిటీ గ్రూప్ కేసులను డీల్ చేసి... నిందితులకు సహకరించారని బొల్లినేని గాంధీపై ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఆయన డీల్ చేసిన ఏ కేసు కూడా ఓ కొలిక్కి రానివ్వరంటూ ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాగే పూర్తి ఆధారాలున్నా కూడా సుజనా కంపెనీలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న ఫిర్యాదులు గాంధీపై వెల్లువెత్తాయి. ఇదే రీతిలో పలు కంపెనీల విషయంలోనూ గాంధీ చూసీచూడనట్లు వ్యవహరించారని.. ఫైళ్లను తారుమారు చేశారని కేంద్ర ఆర్థిక శాఖకు గతంలోనే పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలను కాపాడిన నేపథ్యంలోనే గాంధీ ఇంత భారీస్థాయిలో అక్రమాస్తులను కూడబెట్టినట్లు సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు.