చంచల్గూడ జైలు నుంచి విడుదలైన జగన్ లోటస్పాండ్లోని తన నివాసానికి బయలుదేరారు. అభిమానులు అధికంగా రో్డ్లపైకి రావడంతో కాన్యాయ్ నెమ్మదిగా కదులుతోంది. ప్రస్తుతానికి ఆరు కిలో మీటర్లు ప్రయాణించిన జగన్ కు అభిమానుల తాకిడితో రెండు గంటల సమయం పట్టింది. దీంతో తన నివాసం లోటస్ పాండ్ కు చేరడానికి మరింత సమయం పట్టే ఆస్కారం ఉంది.