హైదరాబాద్: చంచల్‌గూడ జైల్లో ఉన్న ఐఎస్‌ఐ తీవ్రవాదులు మంగళవారం నిరాహార దీక్ష చేపట్టారు. ఇటీవల ఇన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఐఎస్‌ఐ తీవ్రవాది వికారుద్దీన్‌కు మద్దతుగా ఈ దీక్ష చేపడుతున్నట్లు తీవ్రవాదులు రాతపూర్వకంగా లేఖ ఇచ్చారని జైలు సూపరింటెండెంట్ సైదయ్య తెలిపారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఐదుగురు ఉగ్రవాదులు జాహిద్, ఖలీమ్, ఆబిద్ హుస్సేన్(అలీభాయ్), బిశ్వాక్, షకీల్‌లు ఉన్నారు. కాగా ప్రతిరోజులాగే వారికి ఆహారం అందజేసిన ట్లు అధికారులు తెలిపారు.
వీరు దీక్ష చేపట్టడం వెనుక ఎవరి ఆదేశాలైనా ఉన్నాయా లేక జైలు నుంచి కోర్టుకు తరలించే క్రమంలో వీరికి ఎవరైనా సమాచారం ఇచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాదులను ఆఖరుసారిగా ఈ నెల 9న విచారణ నిమిత్తం నాంపల్లి కోర్టుకు తరలించారు.