isi terrorists
-
సామాన్యుడి ముసుగులో ఉగ్రదందా!
మనం రోజూ పండ్లు కొనే వ్యక్తి పచి్చనెత్తురు తాగే ఉగ్రవాదని, మనకు రోజూ ఎదురయ్యే ఎంబీఏ నిరుద్యోగి ఎంతకైనా తెగించే టెర్రరిస్టని ఎవరైనా ఊహించగలరా! సరిగ్గా ఈ పాయింటును పట్టుకొని పాక్ ఐఎస్ఐ కుటిల కుట్రకు పాల్పడింది. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి భారతీయ సమాజంలో సాధారణ జీవనం గడపమని పంపింది, అవకాశం చూసి విధ్వంసాలకు పాల్పడేలా ప్లాన్ చేసింది. ఇంటెలిజెన్స్ వర్గాలు, పోలీసుల పుణ్యమా అని ఈ ఉగ్ర కుట్ర భగ్నమైంది. నవరాత్రి, రామ్‌లీలా ఉత్సవాల సందర్భంగా భారీ విధ్వంసాలకు ప్రణాళిక రచించిన ఉగ్రవాదులను అరెస్టు చేసిన పోలీసులకు దర్యాప్తులో విస్తుపోయే అంశాలు తెలుస్తున్నాయి. అరెస్టయిన వారంతా కరడు కట్టిన టెర్రరిస్టులమని వారి ఇరుగుపొరుగు కూడా తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందుకోసం సాధారణ జీవనం గడుపుతూ సమాజంలో కలిసిపోయారు. అదును చూసి పెట్రేగాలని ఆలోచించారు కానీ చివరకు దొరికిపోయారు. వీరిలో యూపీకి చెందిన జీషన్ ఖమర్ ఎంబీఏ గ్రాడ్యుయేట్. దుబాయ్‌లో అకౌంటెంట్‌గా పనిచేశాడు. కరోనా లాక్డౌన్ సందర్భంగా భారత్‌కు తిరిగివచ్చి ఖర్జూరాలమ్మే వ్యాపారం ఆరంభించాడు. లక్నోకు చెందిన మొహ్మద్ అమీర్ జావెద్, జీషన్‌కు దగ్గర చుట్టం. జెడ్డాలో చాలా సంవత్సరాలు గడిపాడు. భారత్‌కు వచ్చాక మతబోధకుడి అవతారం ఎత్తాడు. అబూ బకర్ సైతం జెడ్డా నుంచి భారత్‌కు వచ్చి స్థిరపడ్డాడు. దీయోబంద్లోని ఒక మదర్సాలో చదువుకున్నాడు. కుట్రలో కీలకమైన మూల్‌చంద్ అలియాస్ లాలాకు డీ కంపెనీ (దావూద్ ఇబ్రహీం దందా)తో దగ్గర సంబంధాలున్నాయి. కానీ బయటకు మాత్రం రైతుగా కనిపించేవాడు. ఇక ఒసామా సమీ కుటుంబం డ్రైఫ్రూట్ బిజినెస్‌లో ఉంది. ఇతను చాలాసార్లు మధ్యాసియా దేశాలకు వెళ్లి వచ్చాడు. మస్కట్ నుంచి పాకిస్తాన్‌కు జలమార్గంలో చేరుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన జాన్ మహ్మద్ షేక్ అలియాస్ సమీర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సెంట్రల్ ముంబైలో నివశిస్తున్న ఇతనికి ఇద్దరు కూతుర్లున్నారు. పోలీసులు అరెస్టు చేసేవరకు వీరి గురించి పక్కింటివారికి కూడా తెలియదంటే ఎంత పకడ్బందిగా వ్యవహరించారో అర్ధం అవుతోంది. డీ కంపెనీతో లింకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నిర్వహించే ముఠాతో అరెస్టయిన వారికి దగ్గర సంబంధాలున్నాయి. వీరిలో ఒసామా, ఖమర్‌లు ఐఎస్ఐ వద్ద శిక్షణ పొందిన ఉగ్రవాదులు కాగా, దావూద్ ఇబ్రహీం సోదరుడు అనీస్ ఇబ్రహీంకు సమీర్ దగ్గరవాడు. అంటే వీరికి డీ కంపెనీతో పాటు పాక్ అండదండలు కూడా ఉన్నట్లు అర్థమవుతోందని పోలీసులు చెప్పారు. పాక్‌లో ఉంటున్న అనీస్ ఆదేశాల ప్రకారం సమీర్ పేలుడు పదార్ధాలను, ఆధునిక ఆయుధాలను, గ్రెనేడ్లను భారత్‌లోని వివిధ ప్రాంతాల్లోని టెర్రరిస్టులకు అందించాలని ప్లాన్ చేశారు. గతేడాది ముంబై పోలీసులు ఫజుల్ రహమన్ ఖాన్ అలియాస్ ముజ్జుతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ ముంబైలోని ఒక వ్యాపారవేత్తను చంపమని వీరికి అనీస్ ఆదేశాలిచ్చాడు. దావూద్ అనుచరుడు ఫహీమ్ మాచ్మచ్కు ముజ్జు సన్నిహితుడు. అతనితో పనిచేసేవారు, కిరాయి హంతకుల గురించిన సమాచారాన్ని పోలీసులు మజ్జు నుంచి రాబట్టారు. ఇతని విచారణలోనే జాన్ మహ్మద్ పేరు బయటపడింది. అప్పటినుంచి ఇతని కదలికలపై పోలీసులు కన్నేసి ఉంచారు. కానీ జాన్ సాధారణ డ్రైవర్‌గా గడుపుతున్నట్లు నటించడంతో ఎలాంటి ఉగ్రకుట్ర గురించి తొలుత బయటపడలేదు. గతనెల ఫహీమ్ మరణించిన తర్వాత అనీస్ ఇతనికి నేరుగా ఆదేశాలు ఇవ్వడం ఆరంభించాడు. దీంతో ఇతని గుట్టు రట్టయింది, అప్పటివరకు ముంబైలో స్లీపర్ సెల్‌గా జాన్ పనిచేస్తున్నాడని, గ్యాంగుకు ఆయుధాలు సరఫరా చేసేవాడని తెలిసింది. దీంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో మొత్తం ఉగ్ర కుట్ర బయటపడింది. యూపీపై కన్ను యూపీలో వరుస పేలుళ్లను జరిపాలని ప్లాన్ చేశారు. ప్రయాగ్ రాజ్‌లో ఒక ఐఈడీ(పేలుడు పదార్ధం)ని టెర్రరిస్టులు అమర్చారని పోలీసులకు తెలిసింది. కచ్చితంగా ఎక్కడ ఈ బాంబు పెట్టారో తెలియకపోవడంతో ఆందోళన అధికమైంది. దీనికితోడు యూపీలో వీఐపీల రాకపోకలు అధికంగా ఉండడంతో సోదాలు నిర్వహించడం, దర్యాప్తు చేయడం ఎంతో కష్టమయ్యాయని పోలీసులు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల వేడితో రాష్ట్రంలో హడావుడి పెరిగింది. ఈ నేపథ్యంలో బాంబున్న ప్రదేశాన్ని కనుగొనడం సముద్రంలో సూదిని వెతికినట్లయింది. దీనికితోడు టెర్రరిస్టులు తప్పించుకోవడానికి అనువుగా నేపాల్ బోర్డర్‌ను ఆనుకొనే యూపీ ఉంది. కానీ ముమ్మర సోదాలు, లోతైన విచారణతో ఎట్టకేలకు బాంబు లొకేషన్ కనుగొని దాన్ని నిర్వీర్యం చేశారు. ఆపరేషన్ తొలిదశలోనే ఉగ్రవాదులు పట్టుబడడంతో ఎంతో ప్రాణనష్టాన్ని నివారించినట్లయింది. అయితే పాక్ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం ఇదే చివరిసారి కాదని, అప్రమత్తతే దేశానికి రక్ష అని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. –నేషనల్ డెస్క్, సాక్షి -
జైలులో భత్కల్ బృందంపై విచారణ ప్రారంభం
హైదరాబాద్: దిల్సుఖ్ నగర్ బాంబుపేలుళ్ల నిందితులు, ఐఎస్ఐ తీవ్రవాదులు భత్కల్, అతడి అనుచరుల నేర విచారణ సోమవారం ప్రారంభమైంది. చర్లపల్లి జైలు ఆవరణలోని నూతన కోర్టు హాల్లో ఈ విచారణ నిర్వహిస్తున్నారు. ఎన్ఐఏ హెచ్చరికల నేపథ్యంలో భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా జైలు అధికారులు ఈ చర్యలకు పూనుకున్నారు. మూడు రోజులపాటుగా విచారణ ట్రయల్ నడుస్తుందని జైలు పర్యవేక్షాధికారి కొలన్ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. -
జైల్లో 'ఉగ్ర' నిరశన
హైదరాబాద్: చంచల్‌గూడ జైల్లో ఉన్న ఐఎస్ఐ తీవ్రవాదులు మంగళవారం నిరాహార దీక్ష చేపట్టారు. ఇటీవల ఇన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఐఎస్ఐ తీవ్రవాది వికారుద్దీన్‌కు మద్దతుగా ఈ దీక్ష చేపడుతున్నట్లు తీవ్రవాదులు రాతపూర్వకంగా లేఖ ఇచ్చారని జైలు సూపరింటెండెంట్ సైదయ్య తెలిపారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఐదుగురు ఉగ్రవాదులు జాహిద్, ఖలీమ్, ఆబిద్ హుస్సేన్(అలీభాయ్), బిశ్వాక్, షకీల్‌లు ఉన్నారు. కాగా ప్రతిరోజులాగే వారికి ఆహారం అందజేసిన ట్లు అధికారులు తెలిపారు. వీరు దీక్ష చేపట్టడం వెనుక ఎవరి ఆదేశాలైనా ఉన్నాయా లేక జైలు నుంచి కోర్టుకు తరలించే క్రమంలో వీరికి ఎవరైనా సమాచారం ఇచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాదులను ఆఖరుసారిగా ఈ నెల 9న విచారణ నిమిత్తం నాంపల్లి కోర్టుకు తరలించారు. -
నిఘా నేత్రంపై నిర్లక్ష్యం
శంషాబాద్, న్యూస్‌లైన్: నిందితుల కంటికి కనిపించని ఆ నాలుగో సింహమే సీసీ కెమెరా. వీటి ద్వారా పలు సంచలనాత్మక కేసుల గుట్టును ఇట్టే విప్పారు మన పోలీసులు. సాధారణ, రద్దీ ప్రాంతాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, చౌరస్తాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి.. మంచి ఫలితాలు సాధించిన మన పోలీసులు అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఆర్జీఐ ఎయిర్‌పోర్టు ప్రధాన రహదారిపై మాత్రం ఒక్క సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో ఈ మార్గంలో దొంగలు, ఉగ్రవాదులు రాకపోకలు సాగించినా కనిపెట్టలేని పరిస్థితి నెలకొంది. బెంగళూరు జాతీయ రహదారి (శంషాబాద్) నుంచి రాజీవ్‌గాంధీ అంత ర్జాతీయ విమానాశ్రయం వరకు 8 కి లో మీటర్లు గల ఈ రహదారి మీదుగా వీవీఐపీ, వీఐపీలు, దేశవిదేశాల నుంచి వచ్చే వేలాది మంది ప్రయాణికులు నిత్యం ప్రయాణం చేస్తుంటారు. ఇంతటి ప్రధాన్యత గల ఈ మార్గంలో ఒక్క సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేయకపోవడం విడ్డూరంగా ఉంది. ఐఎస్ఐ ఉగ్రవాదులు ఎయిర్‌పోర్టులోకి చొరబడి విమానాలను హైజాక్ చేసే ప్రమాదం ఉందని కేంద్ర నిఘా వర్గాలు పలుమార్లు హెచ్చరించిన విషయం తెలిసిందే. ముష్కరుల టార్గెట్‌లో ఉన్న ఈ ప్రాంతంపై ప్రత్యేక నిఘా పెట్టాల్సిన పోలీసులు నిర్లక్ష్య చేస్తున్నారు. జీఎంఆర్‌ఐ, సైబరాబాద్ పోలీసుల సమన్వయ లోపమే దీనికి కారణమని తెలుస్తోంది. శుక్రవారం రాత్రి ఓ క్యాబ్ డ్రైవర్ ఎయిర్‌పోర్టు బయట నిలబడి ఉన్న మహిళను కిడ్నాప్ చేసి, జాతీయ రహదారి వరకూ తీసుకెళ్లి పారిపోయిన విషయం తెలిసిందే. పోలీసులు ఇప్పటి వరకు ఆ క్యాబ్ ఆచూకీ, కనీసం దాని రిజిస్ట్రేషన్ నెంబర్‌ను కూడా కనిపెట్టలేకపోయారు. దీనికి ప్రధాన కారణం ఈ మార్గంలో సీసీ కెమెరాలు లేకపోవడమే. సీసీ కెమెరా ఉండి ఉంటే దాని ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుడి కనిపెట్టి.. కటకటాల్లోకి నెట్టి ఉండేవారు. -
ఫనా.. 2013!
సాక్షి, సిటీబ్యూరో బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ కథానాయకుడిగా 2006లో విడుదలైన ఫనా చిత్రం గుర్తుందా..? పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐకు ఏజెంట్‌గా పని చేస్తున్న రెహాన్ ఖాన్ (అమీర్‌ఖాన్) ‘న్యూక్లియర్ ఆపరేషన్’ కోసం భారత్‌కు వచ్చి ఢిల్లీలో గైడ్‌గా స్థిరపడతాడు. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాది, దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న తెహసీన్ అక్తర్ అలియాస్ మోను కూడా సరిగ్గా ఇదే తరహాలో వ్యవహరించాడు. యాసీన్ భత్కల్ అరెస్టు తరవాత పూర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయి వివిధ ప్రాంతాల్లో తలదాచుకున్న మోను... కొన్నాళ్ల పాటు రాజస్థాన్‌లో గైడ్‌గా పని చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అదే ఈ ‘ఫనా... 2013’ కథాకమామిషు... ఎవరీ మోను? బీహార్‌లోని సమిస్తీపూర్ సమీపంలో ఉన్న మణియార్‌పూర్‌కు చెందిన కెమిస్ట్ కుమారుడే ఈ మోను. 23 ఏళ్ల ఈ యువ టైస్ట్ ఐఎంలో ఉన్న వాంటెడ్ ఉగ్రవాదుల్లోనే చిన్న వయస్కుడని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. తెహసీన్ అక్తర్ తలపై రూ.10 లక్షల రివార్డు సైతం ఉంది. నిషిద్ధ సూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ద్వారా ఉగ్రవాదం వైపు మళ్లి... ఐఎం కో-ఫౌండర్ యాసీన్ భత్కల్‌కు కుడి భుజంగా మారాడు. ఏఏ విధ్వంసాల్లో పాత్ర? ఇతడిని తొలినాళ్లలో బీహార్‌లో యువతను ఐఎంలో రిక్రూట్ చేయడానికి వినియోగించిన యాసీన్... ఆ తరవాత విధ్వంసాల్లో పాల్గొనే అవకాశం ఇచ్చాడు. 2010లో వారణాసి, 2011లో ముంబై, 2012లో పుణే, 2013లో హైదరాబాద్, బుద్ధగయల్లో జరిగిన పేలుళ్లలో ఇతడి పాత్ర ఉంది. యాసీన్ భత్కల్ విచారణలోనే ఇదే విషయం బయటపడింది. ఎక్కడెక్కడ ఎస్కేప్? గత ఏడాది ఆగస్టులో యాసీన్ భత్కల్, హడ్డీల్నీ నిఘా వర్గాలు నేపాల్‌లోని పోఖారా ప్రాంతంలో పట్టుకున్నాయి. అక్కడి ‘ఐఎం-కంట్రోల్డ్’ బేస్‌కు తరచు వచ్చే మోను ఆ రోజు రాకపోవడంతో తప్పించుకున్నాడు. కర్ణాటక రాష్ర్టం మంగుళూరులోని హంపన్‌కట్ట ప్రాంతంలో జఫైర్ హైట్స్ అపార్ట్మెంట్ మూడో అంతస్తు 301 ఫ్లాట్‌లో వీరి డెన్ ఉంది. యాసీన్ అరెస్టు నేపథ్యంలో ఈ డెన్‌పై పోలీసులు దాడి చేశారు. దీనికి కొన్ని గంటల ముందే మోను, మరో ఉగ్రవాది వకాస్ అక్కడి నుంచి జారుకున్నారు. రాజస్థాన్‌లో ఏ ముసుగులో? జఫైర్ హైట్స్ డెన్ కూడా వెలుగులోకి వచ్చేయడం, వేట ముమ్మరం కావడంతో మోను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అనేక సాంకేతిక ఆధారాలు, క్షేత్రస్థాయి పరిణామాలను పరిశీలించిన నిఘా వర్గాలు మోను రాజస్థాన్‌కు చేరుకున్నట్లు గుర్తించాయి. అక్కడున్న పుష్కర్ ప్రాంతంలో టూరిస్ట్ గైడ్ అవతారం ఎత్తాడని తెలుసుకుని గత ఏడాది నవంబర్‌లో వల పన్నాయి. ఈ విషయం పసిగట్టిన మోను మరోసారి తప్పించుకున్నాడు. దీంతో నిఘా వర్గాలు తమ వేటను కొనసాగిస్తున్నాయి. సిటీతో సంబంధమేంటి? కిందటేడాది ఫిబ్రవరిలో దిల్‌సుఖ్‌నగర్‌లో పేలుళ్ల కోసం వచ్చిన ఐఎం ఉగ్రవాదుల్లో మోను కూడా ఉన్నాడు. విద్యార్థుల ముసుగులో అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఇల్లు అద్దెకు తీసుకున్నది ఇతనే. కిందటేడాది ఫిబ్రవరి 21 (పేలుళ్లు జరిగిన రోజు) సాయంత్రం మిగిలిన ఇద్దరు ఉగ్రవాదులతో కలిసి రంగంలోకి దిగాడు. పేలుళ్లలో వాడిన సైకిళ్లను మలక్‌పేట్, జుమ్మేరాత్ బజార్లలో ఖరీదు చేశాడు. ఏ-1 మిర్చ్ సెంటర్ వద్ద సైకిల్‌ను పార్క్ చేసి వెళ్లిపోయింది మోనునే.