హైదరాబాద్: చంచల్‌గూడ కారాగారంలో ఒక రిమాండ్ ఖైదీ మృతిచెందాడు. తిరుమలగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ నెల 17వ తేదీన జరిగిన దొంగతనం ఘటనపై డబీర్‌పురా పోలీసులు శ్రీనివాస్(35)ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌లో ఉంచారు. జైలులో ఉండగానే ఇతడు ఆదివారం అర్థరాత్రి అకస్మాత్తుగా చనిపోయాడు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇతని మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది.