prisoner died
-
అనారోగ్యంతో ఖైదీ మృతి
సాక్షి, గుంటూరు : రేపల్లె కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న శంకర్ర్రావు అనే ఖైదీ అనారోగ్యంతో మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు ... మృతుడు గత నేలలో జరిగిన మహీవర్ధన్ హత్య కేసులో శంకర్రావు మూడోవ ముద్దాయి ఉన్నాడని పోలీసులు తెలిపారు. అనారోగ్యంతో ఉన్న శంకర్రావును దగ్గరలోని జీజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తుండగా, శంకర్రావు మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. -
చంచల్గూడ జైలులో ఖైదీ మృతి
హైదరాబాద్: చంచల్గూడ కారాగారంలో ఒక రిమాండ్ ఖైదీ మృతిచెందాడు. తిరుమలగిరి పోలీస్స్టేషన్ పరిధిలో ఈ నెల 17వ తేదీన జరిగిన దొంగతనం ఘటనపై డబీర్పురా పోలీసులు శ్రీనివాస్(35)ను అదుపులోకి తీసుకుని రిమాండ్లో ఉంచారు. జైలులో ఉండగానే ఇతడు ఆదివారం అర్థరాత్రి అకస్మాత్తుగా చనిపోయాడు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇతని మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. -
అనారోగ్యంతో ఖైదీ మృతి
తిరుపతి : ఓ హత్యకేసులో నెల్లూరు జైల్లో జీవితఖైదు అనుభవిస్తున్న వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందిన సంఘటన శుక్రవారం జరిగింది. అలిపిరి ఎస్ఐ గణేష్ తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లాలోని కాల్వాయ్ గ్రామంలో నివాసముండే ప్రభాకర్(36) నెల్లూరులో ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో జీవితఖైదీగా శిక్ష అనుభిస్తున్నాడు. కాగా ఇతను గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నయం కాకపోవడంతో శుక్రవారం తిరుపతిలో రుయాకు తీసుకువచ్చారు. రుయాలో చికిత్స పొందుతూ మధ్యాహ్న సమయంలో మృతిచెందాడు. -
ఉస్మానియాలో చికిత్స పొందుతూ ఖైదీ మృతి
అఫ్జ్జల్గంజ్ (హైదరాబాద్) : ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ ఖైదీ చనిపోయాడు. అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హత్య కేసులో శిక్ష పడి వరంగల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న కర్నాటి బాబూరావు(29) అనే వ్యక్తి కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. కాగా గత నెల 29వ తేదీన వరంగల్ జైలు నుంచి అతడిని చికిత్స నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆస్పత్రిలోని ఖైదీల వార్డులో చికిత్స పొందుతున్న బాబూరావు పరిస్థితి విషమించి సోమవారం అర్థరాత్రి మృతి చెందాడు. అతనిది ఖమ్మం జిల్లా చింతూరు. మంగళవారం పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. -
ఖైదీని సజీవదహనం చేసిన జైలు అధికారి
బీహార్ జైల్లో ఘోరం జరిగింది. ఓ విచారణ ఖైదీపై జైలు అధికారి కిరోసిన్ పోసి నిప్పంటించడంతో అతడు పాట్నా వైద్యకళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. రూపేష్ పాశ్వాన్ అనే వ్యక్తిని ఆయుధాల చట్టం కింద గత నాలుగేళ్లుగా నవాడా జైల్లో విచారణ ఖైదీగా ఉంచారు. జైలర్ లాల్ బాబూ సింగ్, అతడి సహచరులు గోపీ యాదవ్, బ్రహ్మదేవ్ యాదవ్ కలిసి తనపై కిరోసిన్ పోసి తగలబెట్టేశారని పాశ్వాన్ తన వాంగ్మూలంలో తెలిపాడు. అతడికి 80 శాతం కాలిన గాయాలు కావడంతో పాట్నా వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స సొందుతూ అతడు మరణించాడు. అయితే.. జైలు అధికారులు మాత్రం పాశ్వాన్ తనకు తానే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేశాడని జైలు అధికారులు అంటున్నారు.