తిరుపతి : ఓ హత్యకేసులో నెల్లూరు జైల్లో జీవితఖైదు అనుభవిస్తున్న వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందిన సంఘటన శుక్రవారం జరిగింది. అలిపిరి ఎస్‌ఐ గణేష్ తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లాలోని కాల్వాయ్ గ్రామంలో నివాసముండే ప్రభాకర్(36) నెల్లూరులో ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో జీవితఖైదీగా శిక్ష అనుభిస్తున్నాడు. కాగా ఇతను గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నయం కాకపోవడంతో శుక్రవారం తిరుపతిలో రుయాకు తీసుకువచ్చారు. రుయాలో చికిత్స పొందుతూ మధ్యాహ్న సమయంలో మృతిచెందాడు.