సాక్షి, అన్నమయ్య: ఏపీలో కూటమి సర్కార్ భయానక వాతావరణం సృష్టిస్తోంది. వైఎస్ జగన్ తిరుమల దర్శనాన్ని చంద్రబాబు సర్కార్ రాజకీయం చేస్తోంది. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేస్తూ వారిని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. దీంతో, పోలీసుల వైఖరిపై వైఎస్సార్‌సీపీ నేతలు, శ్రేణులు మండిపడుతున్నారు.
అన్నమయ్య జిల్లాలో పోలీసులు ఓవరాక్షన్‌కు దిగారు. రాజంపేట వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. ఆయన తిరుమలకు వెళ్లడానికి వీలు లేదంటూ నోటీసులు ఇచ్చారు. ఆయనను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆకేపాటి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పార్టీ నేతలు ఆయన ఇంటి వద్దకు చేరుకుంటున్నారు.
ఈ సందర్బంగా ఆకేపాటి మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా సెక్షన్-30 పెట్టలేదు. ఇంతటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. చంద్రబాబుది నియంతృత్వ పాలన. చంద్రబాబు ప్రభుత్వానిది కక్ష సాధింపు చర్య. తిరుమలను రాజకీయానికి వాడుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: వాడని నెయ్యి.. తయారు కాని లడ్డూ.. జరగని తప్పుపై ‘పచ్చ’గోల
Comments
Please login to add a commentAdd a comment