
వైఎస్ఆర్ జిల్లా: రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి చాలా అధ్వాన్నంగా తయారయిందని రాజంపేట వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథరెడ్డి అన్నారు. దిక్కుతోచని పరిస్థితిలో రైతు ఉన్నారని తెలిపారు. పడకేసిన ప్రాజెక్టు పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతాంగం సాగు, తాగునీరు లేక విలవిలలాడిపోయే పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతాంగం కోసం 90 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తే, మిగిలిన 10% పనులు పూర్తి చేయలేని స్థితిలో సీఎం చంద్రబాబు నాయడు పాలన కొనసాగుతుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment