రైతు ఆత్మహత్యలంటే బాబుకు లెక్కలేదు | ysrcp district president akepati amarnadh reddy about Cm | Sakshi
Sakshi News home page

రైతు ఆత్మహత్యలంటే బాబుకు లెక్కలేదు

Published Fri, May 8 2015 3:16 AM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM

ysrcp district president akepati amarnadh reddy about Cm

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాధరెడ్డి

రాజంపేట : రైతుల ఆత్మహత్యలంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు లెక్కేలేదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి విమర్శించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం సమీపంలో జరిగిన ముఖ్యమంత్రి బహిరంగ సభలో గుణుపూరు రాము అనే రైతు ఆత్మహత్యకు యత్నించినా చంద్రబాబు లెక్కచేయకుండా వ్యవ హరించడాన్ని బట్టే రైతులంటే ఆయనకు చిన్నచూపని అర్థమవుతోందన్నారు.

గురువారం ఆకేపాటి భవన్‌లో ఆ యన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి చెందిన రైతు అప్పుల భారం తట్టుకోలేక..లేఖను సీఎంవైపు విసిరివేశార న్నారు. లేఖ విషయం, రైతు ఆత్మహత్యయత్నం సంఘటనను పోలీసులు, టీడీపీ నాయకు లు బయటికిరాకుండా కప్పిపుచ్చే యత్నం చేశారన్నారు. రైతుల గోడు టీడీపీ సర్కారుకు తగలక తప్పదన్నారు. రైతులను, మహిళలను, నిరుద్యోగులను బూటకపు మాటలతో బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను గాలికి వదిలేశారన్నారు. చంద్రబాబు పాలన యేడాదిలో అభాసుపాలైందన్నారు.

అధికారంలోకి వచ్చా క జనానికి మొండిచెయ్యి చూపడం చంద్రబాబుకు కొత్తేమీ కాదన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో విదేశాలలో పర్యటిస్తూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శిం చారు. సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్ విదేశీ పర్యటనలో ప్రభుత్వ ఉన్నతాధికారులను వెంట బెట్టుకొని తిరిగారన్నారు. లోకేశ్ ప్రజాప్రతినిధి కాకపోయినా..అధికారికహోదాలో ఐఏఎస్‌లతో కలిసి విదేశీ పర్యటన చేయడం చూస్తుంటే అధికారం దుర్వినియోగం ఎలా జరుగుతుం దో తెలుస్తోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement