
కార్యకర్తల్లో నైతిక స్థైర్యం పెంచాలి
కడప కార్పొరేషన్:
పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో నైతిక స్థైర్యం పెంపొందించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక వైఎస్ గెస్ట్‌హౌస్‌లో పార్టీ ైరె తు విభాగం మండల కన్వీనర్ల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుకు గౌరవం పెరిగినప్పుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బలంగా నమ్మారని తెలిపారు. ఆ మేరకే సంక్షేమ పథకాలను ప్రజలకు ఉపయోగపడేలా రూపొందించారని పేర్కొన్నారు.
గత ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు ఇబ్బడిముబ్బడిగా అబద్దపు హామీలు ఇచ్చారన్నారు. వాటిని నమ్మి ఓట్లేసిన ప్రజలు మోసపోయారన్నారు. నాలుగు నెలలైనా సీఎం ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఇన్నాళ్లు కంతులు చెల్లించనందున రైతులు, డ్వాక్రా మహిళల రుణాలకు వడ్డీలు పెరిగాయని, చాలాచోట్ల మహిళల పొదుపు డబ్బుజమ చేసుకొంటున్నారని తెలిపారు. ఇంతమందిని మోసం చేసిన చంద్రబాబుపై ఏ కేసు పెట్టాలని ఆయన ప్రశ్నించారు. ఆంక్షలు లేకుండా పూర్తి రుణమాఫీ చేయాలని కోరుతూ ఈనెల 16న మండల కేంద్రాలలో నిర్వహించే ధర్నాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ ప్రభుత్వం ఐదేళ్లు
ఉంటుందన్న నమ్మకం లేదు
నాలుగునెలల్లోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఈ ప్రభుత్వం ఐదేళ్లు ఉంటుందన్న నమ్మకం లేదని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను నిలువునా మోసగించారన్నారు. రాజధాని కమిటీలో నిపుణులను నియమించకుండా తన చుట్టూ ఉండే కోట రీలోని కార్పొరేట్ వ్యక్తులను నియమించార న్నారు. వారు ముందుగానే 8 వేల ఎకరాలు సేకరించి వేలకోట్లు ఆర్జిస్తున్నారని ఆరోపించారు.
వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పింఛన్లను ఇంత దారుణంగా తొలగించిన ప్రభుత్వం ఇదేనన్నారు. రోజు రోజుకూ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందన్నారు. జెడ్పీ ైఛె ర్మన్ గూడూరు రవి మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. కలెక్టర్ మొదలుకొని అధికారులెవ్వరూ ప్రొటోకాల్ పాటించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రైతు విభాగం జిల్లా కన్వీనర్ సంబటూరు ప్రసాద్‌రెడ్డి మాట్లాడారు.