వర్జీనియా : జనరంజక పాలనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి థ్యేయమని ఆ పార్టీ సీనియర్ నేత ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆరాచక పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్న రోజుల్లో ఒక మానవత్వం ప్రజల గుండెలను పాదయాత్ర రూపంలో తాకిందన్నారు. అమెరికాలోని వర్జీనియాలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ, వృద్దాప్య పెన్షన్, ఫీజు రీయింబర్స్‌మెంట్, పేద ప్రజలకు పక్కా ఇళ్ళు, జలయజ్ఞం లాంటి ప్రజాధరణ పొందిన పథకాలకు రాజన్న పాలనలోనే అంకురార్పణ జరిగిందన్నారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి.. ఆంధ్ర ప్రజలు ఎన్నటికీ మరువలేని మానవత్వపు జ్ఞాపకమని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. తనకు వైఎస్సార్ కుటుంబంతో మూడు తరములుగా ఉన్న అనుబంధాన్ని ఈ సభలో గుర్తు చేసుకున్నారు. ప్రజా సంక్షేమమే ఊపిరిగా ప్రజల మనస్సులో నిలిచిన నేత వైఎస్సార్ అని, నిన్నటి రాజన్న పరిపాలనలో అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలు, కాంచిన పేదవారి చిరునవ్వులు రేపు మళ్లీ విరబూయాలంటే వైఎస్ జగన్ లాంటి నాయకుడు రాష్ట్రానికి రథ సారథిగా రావాలని పునరుధ్ఘాటించారు. ఈ 2019 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంటుందని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమన్న ధీమాను వ్యక్తంచేశారు.
వైఎస్సార్ సీపీ సభ్యులు రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. తరాలు మారినా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి లాంటి గొప్ప రాజకీయవేత్త, పేదలపాలిటి పెన్నిధి మనకు కానరారని అన్నారు. కులమత ప్రాంతాలకు అతీతంగా ఆజన్మాంతం సామాన్యుడి మదిలో నిలిచిపోయారన్నారు. అలాంటి మహనీయుని ఆశయాలకు వారసుడిగా ఆశయ సాధనలో ధీరుడిగా పాలక పక్షం గుండెల్లో రైల్లు పరిగెత్తిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి నాయకులుగా ఈ ఎన్నికల్లో గెలుపొందేవిధంగా కష్టపడిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. వైఎస్ జగన్‌లాంటి నిజాయిలీ పరుడి పాలన వస్తే కష్టాలు దూరమై సంతోషం చేరువ ఆవుతుందని, మంచిరోజులు రాబోతున్నాయని వైఎస్ జగన్ పాలనకై ఆంధ్ర ప్రజలు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారని అన్నారు.
స్థానిక వైఎస్సార్ సీపీ సభ్యులు శ్రీనివాస్ మాట్లాడుతూ.. పెద్దాయన ఏర్పరచిన దారిలో నడుస్తున్న నేటి తరము యువ నేత వైఎస్ జగన్‌కు మన సంపూర్ణ సహకారం అందించాలని పిలుపునిచ్చారు. అనంతరం వైఎస్సార్ సీపీ సభ్యులు ఆంజనేయ రెడ్డి మాట్లాడుతూ.. మారిన కాలానికి అనుగుణంగా మన దేశ ఆర్థిక పరిస్థితులు మారాలని, యువతరం ముందుకు రావాలని, ఇప్పుడున్న ప్రభుత్వం ఏ మాత్రం మన సామాన్య ప్రజల కనీస అవసరాలు తీరుస్తున్నారో అందరూ చూస్తున్నారని అన్నారు.
వైఎస్సార్ సీపీ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను, ప్రవేశపెట్టిన పథకాలను కొనియాడారు. ప్రస్తుత ప్రభుత్వ తీరు తెన్నులను తూర్పారబట్టారు.
వైఎస్సార్ సీపీ సభ్యులు సురేంద్ర బత్తినపట్ల మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వం కోసం తెలుగు ప్రజలంతా ఎదురుచూస్తున్నారని తెలిపారు.
వైఎస్సార్ సీపీ సభ్యులు జయ్ జొన్నల మాట్లాడుతూ.. నిజమైన పరిపాలనకు నిలువుటద్దం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు. నవరత్నం గ్రామ సచివాలయం అన్నారు.
ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటి సభ్యులు సురేన్ బత్తినపట్ల, వెంకట్ కొండపోలు, రామ్ రెడ్డి, సత్య పాటిల్ రెడ్డి, ఆంజనేయ రెడ్డి దొందేటి, నినాద్‌రెడ్డి అన్నవరం, జీపీ నరసింహ రెడ్డి, కమలాకర్ రెడ్డి, స్పాస్కి రెడ్డి, ఏబీ శ్రీనివాస్, ఏబీ నగేష్, సతీష్ రెడ్డి నరాల, శ్రీనివాస్ సోమవారపు, జయ్ జొన్నల, నరసా రెడ్డి పేరం, శివ రెడ్డి, చిన్నిక్రిష్ణా రెడ్డి, డాక్టర్ మధుసూదన్ రెడ్డి, శ్రీధర్ నాగిరెడ్డి, రాజశేఖర్ బసవరాజు, అమర్ బొజ్జ, ఈశ్వర్ బండా, సుజీత్, వినీత్ లోక, కిరణ్ కుమార్ రెడ్డి, గంగి రెడ్డి ఎద్దుల, వేణుగోపాల్ రెడ్డి, విజయ భాస్కర్ ఏటూరు, శశి, రఘునాథ్ రెడ్డి, సురేష్ రెడ్డి, మరియు అనేకులు పాల్గొన్నారు. ఇండియా నుంచి రఘురామి రెడ్డి రంపా, ఉమాకాంత్, రామలింగ రెడ్డి గజ్జల, రమేష్ రెడ్డి లోక తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment