భూటకపు హామీలతో చంద్రబాబు మోసం: అమర్నాథరెడ్డి
Published Tue, Oct 28 2014 6:57 PM | Last Updated on Sat, Sep 2 2017 3:30 PM
కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మండిపడ్డారు. భూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు.
టీడీపీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 5 తేదిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ నెల 30 తేదిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి సమావేశం జరుగుతుందని, ఆ కార్యక్రమానికి రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు హాజరవుతున్నారని అమర్నాథ్ రెడ్డి మీడియాకు తెలిపారు.
Advertisement
Advertisement