![Akepati Amarnath Reddy Slams Chandrababu Over False Campaign - Sakshi](/styles/webp/s3/article_images/2019/01/18/Akepati-Amarnath-Reddy.jpg.webp?itok=WzRU_MAq)
సాక్షి, వైఎస్సార్: వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల భేటీపై టీడీపీ అస్యత ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫెడరల్ ఫ్రంట్‌పై టీడీపీ అసత్య ప్రచాలు చేస్తూ.. ఎల్లో మీడియా ద్వారా వైఎస్ జగన్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నందమూరి హరికృష్ణ పార్థీవదేశం సాక్షిగా శవ రాజకీయాలు చేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోవడానికి కారణమైన కాంగ్రెస్‌తో సిగ్గులేకుండా చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment