93 మందితో వైఎస్సార్‌సీపీ జిల్లా కమిటీ
ఆదర్శంగా ఉండాలి : జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి జిల్లా కార్యవర్గం రాష్ట్రానికి ఆదర్శంగా పనిచేయాలని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి అన్నారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కార్యవర్గాన్ని ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్తులో పార్టీ ఏ పిలుపు ఇచ్చినా కార్యవర్గసభ్యులంతా సమష్టిగా పనిచేసి విజయవంతం చేయాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు పోరాడుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలన్నారు.
కడప కార్పొరేషన్: 93 మంది సభ్యులతో కూడిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ప్రకటించారు. పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారి పదిమంది ప్రధాన కార్యదర్శులు, పన్నెండు మంది కార్యదర్శులు, పద్దెనిమిది మంది సంయుక్త కార్యదర్శులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, కోశాధికారి, క్రమశిక్షణ కమిటీ సభ్యులు ఇద్దరు, 44 మంది కార్యనిర్వాహక సభ్యులతో భారీ కార్యవర్గాన్ని ప్రకటించారు.
స్థానిక వైఎస్ గెస్ట్‌హౌస్‌లో బుధవారం నగర మేయర్ కె.సురేష్‌బాబు, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి సమక్షంలో ఈ జాబితాను విడుదల చేశారు. కమిటీ వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రధాన కార్యదర్శులు:
ఎండీ అల్ఫోన్స్(కడప), ఎ. వేణుగోపాల్‌రెడ్డి(రాజంపేట), పి. సుకుమార్ రెడ్డి(కోడూరు), జి. వీరప్రవీణ్ కుమార్ రెడ్డి(కమలాపురం), ఎ.రామక్రిష్ణారెడ్డి(బద్వేల్), ఒ.రసూల్(పులివెందుల), ఎం. దేవనాథరెడ్డి(రాయచోటి), ఎం. దస్తగిరి(మైదుకూరు), ఎల్. సుబ్బయ్య యాదవ్, కె. నాగేంద్రారెడ్డి(ప్రొద్దుటూరు).
కార్యదర్శులు:
ఎస్. కరీం జిలానీ(కడప), సి. శ్రీనివాసులురెడ్డి(కోడూరు), కొండారెడ్డి(రాజంపేట), ఎస్. శివశంకర్‌రెడ్డి(కమలాపురం), కె. పెద్ద నరసింహ గౌడ్(పులివెందుల), అఫ్జల్ అలీఖాన్(రాయచోటి), పి. రఘురామిరెడ్డి(మైదుకూరు), టి. శ్రీనివాసులురెడ్డి, జి. భాస్కర్‌రెడ్డి(ప్రొద్డుటూరు), సి. జానకీ రామ్‌రెడ్డి, ఎన్. జగదేక రెడ్డి(జమ్మలమడుగు), పి. నాగార్జున రెడ్డి(బద్వేల్).
అధికార ప్రతినిధులు: రాజేంద్ర ప్రసాద్‌రెడ్డి(కమలాపురం), టీకే అఫ్జల్ ఖాన్(కడప), పి. విశ్వనాథ్‌రెడ్డి(రాజంపేట), ప్రసాద్‌రెడ్డి, మహబూబ్ హుస్సేన్(ప్రొద్దుటూరు), సుబ్బారావు(కోడూరు).
కోశాధికారి: ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి(మైదుకూరు),
క్రమశిక్షణ కమిటీ: జి. విజయభాస్కర్‌రెడ్డి(రాజంపేట), ఆర్.వెంకటసుబ్బారెడ్డి (మాసీమ బాబు)(కమలాపురం).
సంయుక్త కార్యదర్శులు:
ఆయిల్ మిల్ ఖాజా, రామ్మోహన్‌రెడ్డి(ప్రొద్దుటూరు), బి. ఫ్రాన్సిస్, సి. వీర వెంకట స్వామి(మైదుకూరు), వెంకట్‌రెడ్డి, సయ్యద్ అమీర్(రాయచోటి), చాంద్‌బాషా, ఎ. మల్లికార్జున కిరణ్(కడప), సీహెచ్ రమేష్, ఎం. రఫీ(కోడూరు), టి. బాల మల్లారెడ్డి, టి. అమర్‌నాథ్‌రెడ్డి(కమలాపురం), ఎస్. శివయ్య, కె. చంద్రశేఖర్‌రెడ్డి(బద్వేల్), ఎం. శివశంకర్‌రెడ్డి, పి. వీరభద్రారెడ్డి(పులివెందుల), జి. సుబ్బారెడ్డి, ఆరమ్‌రెడ్డి(రాజంపేట).