The new Executive Committee
-
అప్రెడా నూతన కార్యవర్గం ఎన్నిక
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (అప్రెడా) రెండేళ్ల నూతన కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్షుడిగా జీ హరిబాబు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లుగా చుక్కాపల్లి రమేష్, చావ రమేష్ బాబు, వైస్ ప్రెసిడెంట్లుగా లింగమూర్తి, బీ రవీంద్రనాథ్ ఠాగూర్, ఎం ఎం కొండయ్య ఎన్నికయ్యారు. వీరితో పాటు ఎంవీ నరేంద్రనాథ్ రెడ్డి సెక్రటరీ జనరల్‌గా, బీఎల్ నరసారెడ్డి, ఎంవీ చౌదరి సెక్రటరీలుగా, ఆర్ వెంకటేశ్వర రావు ట్రెజరర్‌గా నియమితులైనట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. -
ట్రెడాకు కొత్త కార్యవర్గం
హైదరాబాద్: తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) కొత్త కార్యవర్గం ఎన్నికైంది. గురువారమిక్కడ జరిగిన 19వ వార్షిక జనరల్ బాడీ సమావేశంలో ట్రెడా అధ్యక్షుడిగా పీ దశరథ్ రెడ్డి ఎంపికైనట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఈయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. అలాగే చలపతిరావు, సునీల్ చంద్రారెడ్డిలు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్స్‌గా, విజయసాయి రెడ్డి సెక్రటరీ జనరల్‌గా, కే గోపాలకృష్ణ ట్రెజరర్‌గా నియమితులయ్యారు. -
93 మందితో వైఎస్సార్సీపీ జిల్లా కమిటీ
ఆదర్శంగా ఉండాలి : జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి జిల్లా కార్యవర్గం రాష్ట్రానికి ఆదర్శంగా పనిచేయాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి అన్నారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కార్యవర్గాన్ని ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్తులో పార్టీ ఏ పిలుపు ఇచ్చినా కార్యవర్గసభ్యులంతా సమష్టిగా పనిచేసి విజయవంతం చేయాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు పోరాడుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలన్నారు. కడప కార్పొరేషన్: 93 మంది సభ్యులతో కూడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ప్రకటించారు. పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారి పదిమంది ప్రధాన కార్యదర్శులు, పన్నెండు మంది కార్యదర్శులు, పద్దెనిమిది మంది సంయుక్త కార్యదర్శులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, కోశాధికారి, క్రమశిక్షణ కమిటీ సభ్యులు ఇద్దరు, 44 మంది కార్యనిర్వాహక సభ్యులతో భారీ కార్యవర్గాన్ని ప్రకటించారు. స్థానిక వైఎస్ గెస్ట్‌హౌస్‌లో బుధవారం నగర మేయర్ కె.సురేష్‌బాబు, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి సమక్షంలో ఈ జాబితాను విడుదల చేశారు. కమిటీ వివరాలు ఇలా ఉన్నాయి. ప్రధాన కార్యదర్శులు: ఎండీ అల్ఫోన్స్(కడప), ఎ. వేణుగోపాల్‌రెడ్డి(రాజంపేట), పి. సుకుమార్ రెడ్డి(కోడూరు), జి. వీరప్రవీణ్ కుమార్ రెడ్డి(కమలాపురం), ఎ.రామక్రిష్ణారెడ్డి(బద్వేల్), ఒ.రసూల్(పులివెందుల), ఎం. దేవనాథరెడ్డి(రాయచోటి), ఎం. దస్తగిరి(మైదుకూరు), ఎల్. సుబ్బయ్య యాదవ్, కె. నాగేంద్రారెడ్డి(ప్రొద్దుటూరు). కార్యదర్శులు: ఎస్. కరీం జిలానీ(కడప), సి. శ్రీనివాసులురెడ్డి(కోడూరు), కొండారెడ్డి(రాజంపేట), ఎస్. శివశంకర్‌రెడ్డి(కమలాపురం), కె. పెద్ద నరసింహ గౌడ్(పులివెందుల), అఫ్జల్ అలీఖాన్(రాయచోటి), పి. రఘురామిరెడ్డి(మైదుకూరు), టి. శ్రీనివాసులురెడ్డి, జి. భాస్కర్‌రెడ్డి(ప్రొద్డుటూరు), సి. జానకీ రామ్‌రెడ్డి, ఎన్. జగదేక రెడ్డి(జమ్మలమడుగు), పి. నాగార్జున రెడ్డి(బద్వేల్). అధికార ప్రతినిధులు: రాజేంద్ర ప్రసాద్‌రెడ్డి(కమలాపురం), టీకే అఫ్జల్ ఖాన్(కడప), పి. విశ్వనాథ్‌రెడ్డి(రాజంపేట), ప్రసాద్‌రెడ్డి, మహబూబ్ హుస్సేన్(ప్రొద్దుటూరు), సుబ్బారావు(కోడూరు). కోశాధికారి: ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి(మైదుకూరు), క్రమశిక్షణ కమిటీ: జి. విజయభాస్కర్‌రెడ్డి(రాజంపేట), ఆర్.వెంకటసుబ్బారెడ్డి (మాసీమ బాబు)(కమలాపురం). సంయుక్త కార్యదర్శులు: ఆయిల్ మిల్ ఖాజా, రామ్మోహన్‌రెడ్డి(ప్రొద్దుటూరు), బి. ఫ్రాన్సిస్, సి. వీర వెంకట స్వామి(మైదుకూరు), వెంకట్‌రెడ్డి, సయ్యద్ అమీర్(రాయచోటి), చాంద్‌బాషా, ఎ. మల్లికార్జున కిరణ్(కడప), సీహెచ్ రమేష్, ఎం. రఫీ(కోడూరు), టి. బాల మల్లారెడ్డి, టి. అమర్నాథ్రెడ్డి(కమలాపురం), ఎస్. శివయ్య, కె. చంద్రశేఖర్‌రెడ్డి(బద్వేల్), ఎం. శివశంకర్‌రెడ్డి, పి. వీరభద్రారెడ్డి(పులివెందుల), జి. సుబ్బారెడ్డి, ఆరమ్రెడ్డి(రాజంపేట). -
వారం రోజుల్లో బీజేపీకి కొత్త కార్యవర్గం
కిషన్‌రెడ్డినే అధ్యక్షుడిగా కొనసాగించాలనుకుంటున్న అధిష్టానం మార్చాలంటున్న సీనియర్ నాయకులు హైదరాబాద్: తెలంగాణ బీజేపీకి కొత్త రక్తం ఎక్కించేందుకు పార్టీ జాతీయ నాయకత్వం సిద్ధమైంది. మహారాష్ట్రలో ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే తెలంగాణకు కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. అప్పటి వరకు ఉమ్మడి రాష్ర్ట అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డిని రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణకు అధ్యక్షుడిగా తాత్కాలికంగా నియమించారు. దీంతో ఆయనను అలాగే కొనసాగిస్తూ మిగతా కార్యవర్గాన్ని నియమించాలనేది ఇప్పటివరకు ఉన్న వ్యూహం. అయితే... గత ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోదీ హవా కనిపించినా తెలంగాణలో మచ్చుకైనా లేకపోవటం, కనీసం మూడు ఎంపీ స్థానాల్లో విజయం సాధించాలని స్వయంగా మోదీ లక్ష్యం నిర్ధారించినా ఒక్క సికింద్రాబాద్‌లో మాత్రమే గెలవటం.. ప్రత్యేకంగా తీరిక చేసుకుని మోదీ నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించినా ప్రభావం కనిపించకపోవటం.. తదితరాల నేపథ్యంలో తెలంగాణలో పార్టీ చాలాబల హీనంగా ఉందని పార్టీ నిర్ధారణకు వచ్చింది. వచ్చే ఎన్నికల్లో దక్షిణాదిలో కర్ణాటకతోపాటు తెలంగాణలో కూడా పార్టీ అధికారంలోకి రావాలనే టార్గెట్ విధించుకున్న నేపథ్యంలో పార్టీని సమాయత్తం చేయాలంటే భారీ ప్రక్షాళన అవసరమనే వాదన తాజాగా పార్టీ జాతీయ నాయకత్వం దృష్టికి వచ్చింది. ఫలితంగా తెలంగాణ శాఖను పూర్తిగా మార్చాలనే అభిప్రాయంలో ఉన్నట్టు సమాచారం. కొంతకాలంగా పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో ఏమాత్రం పొసగని స్థానిక సీనియర్ నేతలు ఆయనను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలని జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు పలు సందర్భాల్లో విన్నవిం చారు. కొంతకాలం కిషన్‌రెడ్డినే కొనసాగిస్తే బా గుంటుందని అమిత్ షా అన్నట్టు తెలిసింది. ఇటీవలే పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్గా పీకే కృష్ణదాస్‌ను నియమించారు. ఆయనతో కిషన్‌రెడ్డికి సాన్నిహిత్యం ఉంది. ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డినే అధ్యక్షుడిగా కొనసాగించాలనే అభిప్రాయం అధిష్టానంలో ఉంది. అయితే, మరో వారం రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది. బీజేపీ రైతు పోరు దీక్ష వాయిదా రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు కరీంనగర్లో సోమవారం నిర్వహించ తలపెట్టిన రైతుల పోరు దీక్షను వాయిదా వేసినట్టు భారతీయ జనతా పార్టీ ఆదివారం ప్రకటించింది. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది సోమవారం ప్రకటించనున్నట్టు పేర్కొంది. రాష్ట్రంలో కరెంటు సమస్యలు తీవ్రంగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కొంతకాలంగా వరుసగా విలేఖరుల సమావేశాల్లో ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్న బీజేపీ ప్రజాక్షేత్రంలో పోరాటానికి శ్రీకారం చుట్టాలనుకుంది. అయితే, వాన రూపంలో అవాంతరం ఎదురైంది. నీలోఫర్ తుపాను ప్రభావంతో విస్తారంగా వానలు కురుస్తుండడంతో రైతుపోరు దీక్షను వాయిదా వేసుకుంది.