వైఎస్ జగన్‌కు రాష్ట్రంలో అడ్డుకట్ట వేయాలనేదే కాంగ్రెస్ దురాలోచనతోనే రాష్ట్ర విభజనకు పూనుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి ఆరోపించారు. ఈ రోజు రాష్ట్రం అగ్నిగుండంగా మారడానికి కారణం సోనియా గాంధీయేనని ఆయన విమర్శించారు. తన కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్న ఆలోచనతోనే విభజనకు సోనియా మొగ్గు చూపారని ఆయన దుయ్యబట్టారు.
బీజేపీతో పొత్తు కోసం టీడీపీ ప్రయత్నిస్తోందని అమరనాథ్‌రెడ్డి నిన్న ఆరోపించారు. 1995, 98 మధ్య కాలంలో బీజేపీని మతతత్వ పార్టీ అంటూ తిట్టి, అంటరానిదిగా పరిగణించి వామపక్షాలతో దోస్తీ చేసిన చంద్రబాబు 1999 సంవత్సరం వచ్చే నాటికి బీజేపీ గాలి వీస్తోందని తెలుసుకుని అటు వెళ్లారని విమర్శించారు. తనపై కేసులు పెడతారని, సీబీఐ దర్యాప్తు జరుగుతుందని భీతిల్లిన చంద్రబాబు కొంత కాలంగా కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నారని.. కేంద్రంలో బీజేపీ వస్తుందేమోనన్న అంచనాతో వారికి దగ్గరయ్యే ప్రయత్నాలు ప్రారంభించారని విమర్శించారు.
కాంగ్రెస్ దురాలోచనతోనే విభజన: అమరనాథ్ రెడ్డి
Published Tue, Aug 13 2013 8:50 PM | Last Updated on Sat, Jun 2 2018 4:41 PM
Advertisement
Advertisement