!['చంద్రబాబుపై కేసు నమోదు చేయాలి' - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/81454831650_625x300.jpg.webp?itok=ujIYikaG)
'చంద్రబాబుపై కేసు నమోదు చేయాలి'
రాజంపేట : రుణమాఫీ కాలేదనే బాధతో రైతు సుబ్రమణ్యంరెడ్డి ఆత్మచేసుకున్న కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కేసులు నమోదు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. రైతు ఆత్మహత్య ఘటనపై రాజంపేటలో వైఎస్ఆర్ సీపీ నేతలు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు ఆందోళనకు దిగారు. రైతు మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. రుణమాఫీ కాలేదన్న బెంగతో ఆత్మహత్య చేసుకున్న రైతు సూసైడ్ నోట్ లో 'తన చావుకు చంద్రబాబే కారణమని' పేర్కొన్నడన్న విషయాన్ని ప్రస్తావించారు.
చట్ట ప్రకారం చంద్రబాబుపై కేసు నమోదు చేయాలన్నారు. బాధిత రైతు కుటుంబానికి రూ.20 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయానని, ఈ నేపథ్యంలో తన అప్పు పెరిగిపోయిందని, అది తీర్చే మార్గం కానరాక ఆత్మహత్య చేసుకుంటున్నానని రైతు తన సూసైడ్ నోట్ లో పేర్కొన్న విషయం అందరికీ తెలిసిందే.