క్రాప్ హాలిడే ఆయన పుణ్యమే
కరువు కారణంగా రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నా, మరణించిన రైతు కుటుంబాలకు దమ్మిడీ సాయం కూడా అందడం లేదని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. వరి రైతులు దాదాపు 50 శాతం వరకు క్రాప్ హాలిడే ప్రకటించారని, అందుకు ప్రకృతి ఒక కారణమైతే మరోవైపు చంద్రబాబు నాయుడు పుణ్యం కూడా ఉందని ఆయన మండిపడ్డారు.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నాలుగో రోజైన గురువారం నాడు కరువు, రైతు ఆత్మహత్యలు తదితర అంశాలపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. జగన్ మోహన్ రెడ్డి పూర్తి ప్రసంగం వీడియో ఇక్కడ చూడండి...