Crop Holiday
-
క్రాప్ హాలిడేకు సిద్ధమవ్వాలి
సాక్షి, భీమవరం/పాలకొల్లు సెంట్రల్: ఆక్వా రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు అవసరమైతే క్రాప్ హాలీడేకు రైతులు సిద్ధం కావాలని ఆక్వా రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. అప్పుడే హేచరీలు, ప్రాసెసింగ్, ఫీడ్ కంపెనీలు దిగివస్తాయన్నారు. జైభారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం పశ్చిమగోదావరి జిల్లా పూలపల్లిలో ఆక్వా రైతు మహాసభ నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ.. ‘హేచరీలు, ప్రాసెసింగ్, ఫీడ్ కంపెనీలు లాభాపేక్షతో వ్యవహరిస్తూ ఆక్వా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. చాలా కంపెనీలు ఫీడ్, మందులు రెండింటినీ తయారు చేస్తున్నాయి. నాసిరకం ఫీడ్ వల్ల తెగుళ్లు వస్తున్నాయి. వాటిని తగ్గించే మందులను కూడా ఆ కంపెనీలే విక్రయిస్తున్నాయి. అందువల్ల ఎప్పటికప్పుడు సీడ్, ఫీడ్ నాణ్యతలను పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టేందుకు ఎంపెడా పటిష్ట చర్యలు తీసుకోవాలి. ఏ ఒక్క రైతుకు సమస్య వ చ్చినా రాజకీయాలతో సంబంధం లేకుండా అందరూ పోరాడాలి. అడ్డగోలుగా వ్యవహరిస్తున్న హేచరీలు, ప్రాసెసింగ్, ఫీడ్ కంపెనీల వద్ద ఆందోళనలు చేపట్టాలి. పరిస్థితి మరింతగా దిగజారితే ఆక్వా రంగాన్ని కాపాడుకునేందుకు క్రాప్ హాలీడేకు సిద్ధమవ్వాలి. రాష్ట్రవ్యాప్తంగా క్రాప్ హాలీడేను విజయవంతం చేసేందుకు అన్ని సంఘాలను ఏకతాటిపైకి తీసుకువద్దాం’ అని అన్నారు. గత ప్రభుత్వంలో సమస్యల పరిష్కారం ఆక్వా రైతు సంఘం నాయకుడు యాళ్ల వెంకటానందం మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వంలో రొయ్య ధరలు ఒడిదుడుకులకు గురికాకుండా ప్రాసెసింగ్ కంపెనీల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేసి ధరల స్థిరీకరణకు అప్సడా కృషి చేసింది. అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్ రైతు సమస్యల పరిష్కారానికి పాటుపడ్డారు. వీరవాసరంలో ఆక్వా చెరువులకు విద్యుత్ సమస్య ఉందని రైతులు చెప్పగా.. వెంటనే నిరంతర విద్యుత్‌ను అందించారు’ అని చెప్పారు. జోన్‌తో సంబంధం లేకుండా విద్యుత్ సబ్సిడీ అమలు చేస్తామని, గిట్టుబాటు ధరలు కల్పిస్తామని, విద్యుత్ సమస్య పరిష్కరిస్తామని, నాణ్యమైన సీడ్, ఫీడ్ అందిస్తామని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఇచ్చిన హామీలపైనా సమావేశంలో చర్చించారు. వాటి అమలుకు మంత్రులను కలవాలని నిర్ణయించారు. ఆక్వా రైతు సంఘాల నాయకులు బోణం వెంకట నరసయ్య, యాళ్ల వెంకటానందం, గాదిరాజు సుబ్బరాజు, పి.నాగభూషణం, వీరవల్లి చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు. -
Fact Check: రామోజీ రాతల్లోనే ‘కోతలు’.. బాబు పాలనలోనే ‘చీకట్లు’
సాక్షి, అమరావతి : ‘‘పరిశ్రమలకు వారంలో రెండు రోజుల పాటు పవర్ హాలిడే అమలు చేస్తున్నాం. వారంతపు సెలవుతో కలిపి వారంలో మూడు రోజులు పరిశ్రమలకు విద్యుత్ ఉండదు.’’ ‘‘గ్రామాల్లో ఎనిమిది గంటలు..పట్టణాల్లో ఆరు గంటలు..నగరాల్లో నాలుగు గంటలు ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ విధిస్తున్నాం.’’‘‘వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్ ఇవ్వడం కష్టం..నాలుగు గంటలు రెండు విడతల్లో ఇస్తాం..క్రాప్ హాలిడే తీసుకుంటే ఇంకా మంచిది.’’ ...ఇదీ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితి..బాబు హయాంలో రాష్ట్రాన్ని చీకటి మయం చేశారు. రైతులు అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా విద్యుత్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియక పొలాల్లోనే పడిగాపులు కాసేవారు. ఆ సమయంలో పాముల బారినపడి ప్రాణాల మీదకు తెచ్చుకునేవారు. గ్రామాల్లో పగలూ రాత్రీ గంటల తరబడి కోతలు విధించేవారు. కొన్ని సీజన్ల పంటలకు విద్యుత్ సరఫరా లేక రైతులు క్రాప్ హాలిడే పేరుతో పంటలు వేయకుండా చేలను బీడు భూములుగా వదిలేసేలా అప్పటి పాలకులు ప్రోత్సహించారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల నుంచి వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసింది. రైతులకు ఉచితంగా పగటి పూటే 9 గంటల విద్యుత్‌ను అందిస్తోంది. భారీ విద్యుత్ డిమాండ్, తీవ్ర విద్యుత్ కొరత ఉండే వేసవిలోనూ ఎలాంటి కోతలు లేకుండా, లోడ్ రిలీఫ్ అవసరం రాకుండా, క్రాప్ హాలిడే విధించకుండా, పవర్ హాలిడే పెట్టకుండా అన్ని వర్గాల ప్రజలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా అందిస్తోంది. కానీ దీనిని చూసి బాబు తోక పత్రికైన ఈనాడు కుళ్లుకుంటోంది. ఇలాంటి పాలనకు ప్రజలు ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టనున్నారని గ్రహించి, తప్పుడు రాతలతో జనాన్ని నమ్మించాలని చూస్తోంది. అందులో భాగంగానే ‘కంటి మీద కునుకు లేకుండా చేస్తారా జగన్?’ అంటూ ఈనాడు మంగళవారం ఓ అబద్దాన్ని అచ్చేసింది. రామోజీ రాస్తున్న రాతల్లో అన్నీ కోతలేనని, వాస్తవాలను పరిశీలిస్తే ఎవరికైనా అర్ధమవుతుంది. ♦ శ్రీకాకుళం జిల్లా గార మండలం జల్లువలస, జఫ్రా బాద్, రాఘవాపురం, వాదాడ, తోనంగి శాలి హుండం గ్రామాల పరిధిలో సోమవారం ఉదయం 05:34 నుండి సాయంత్రం 04:15 గంటల వరకు కరెంటు లేదు అన్నది వాస్తవం కాదు. ఎందుకంటే ఆ రోజు బలమైన ఈదురు గాలులు వచ్చిన కారణంగా కళింగపట్నం, చల్లపేట, అతులుగు సబ్ స్టేషన్ పరిధిలోని 11కేవీ ఫీడర్స్పై చెట్టు కొమ్మలు పడి ట్రిప్ అయి కొంత విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ♦ రాజమహేంద్రవరం జిల్లా గండేపల్లి మండలం, కె. సూరపాలెం గ్రామీణ ఇండస్ట్రియల్ ఫీడర్ పరిధిలో సోమవారం ఉదయం 07:15 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచింది. రాజమహేంద్రవరం తాడితోట సబ్ స్టేషన్ పరిధిలో ఉదయం 8.55 నుంచి సాయంత్రం 04:15 గంటల వరకు సరఫరా నిలిచింది అన్నది కూడా వాస్తవం కాదు. ఈదురు గాలుల వల్ల 33/11 కేవీ గండేపల్లి సబ్ స్టేషన్లో 11కేవీ సూరంపాలెం ఇండస్ట్రియల్ పరిధిలో చెట్లు కొమ్మలు, వెదురు చెట్లు లైన్ మీద పడి బ్రేక్ డౌన్ అయ్యింది. కొమ్మలు, చెట్లు తొలగించి మధ్యాహ్నం 1 గంటకు సరఫరా పునరుద్ధరించారు. అలాగే 33/11కేవీ తాడితోట సబ్ స్టేషన్ పరిధిలోగల 11కేవీ ఇన్నిస్ పేట ఫీడర్ పైన నక్కలగూడెం వద్ద గల వీటి కాలేజ్ దగ్గర చెట్టు కొమ్మలు పడటంతో సరఫరాలో అంతరాయం కలిగింది. తెగిన విద్యుత్ లైన్ పున రుద్ధరించి 09:59 గంటలకు సరఫరా ఇచ్చారు. ♦పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం, అలవద్ద, కురుపాం, మండలం భర్తంగి గ్రామాల పరిధిలో ఉదయం 09:24 గంటలకు 33/11కేవీ గుమ్మలక్ష్మీపురంలోని 11కేవీ గుమ్మలక్ష్మీపురం–ఆర్కే బాయ్ ఫీడర్ పరిధిలో అల్లవరం గ్రామం వద్ద చెట్లు కొమ్మలు లైను మీద పడి విద్యుత్ అంతరాయం కలిగింది. వాటిని తొలగించి 09:48 గంటలకు సరఫరా యధావిధిగా కొనసాగించారు. ♦ కడపలోని 220 కెవి సబ్‌స్టేషన్‌లో బ్యాటరీల మరమ్మతుకు గురై సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యుత్తు సరఫరా పునరుద్ధరించారు. ♦ కర్నూలు సర్కిల్ పరిధిలోని గుండ్లకొండ సబ్‌స్టేషన్, అనంతపురం సర్కిల్ పరిధిలోని రాయదుర్గం, తిరుపతి సర్కిల్ పరిధిలోని పూతలపట్టు సబ్ స్టేషన్లలో బ్రేక్‌డౌన్ కారణంగా సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అయినప్పటికీ ఆయా సబ్స్టేషన్ల పరిధిలో లైటింగ్ సప్లైలో మాత్రం ఎటువంటి అంతరాయం లేదు. -
సాగర్ కింద సాగు వద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత యాసంగి (రబీ) సీజన్లో నాగార్జునసాగర్‌తోపాటు కల్వకుర్తి, భీమా, పాలేరు, వైరా, మల్లూరు, లంకాసాగర్, గొల్లవాగు ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు క్రాప్ హాలిడే ప్రకటించాలని రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ (స్కివం) కమిటీ ప్రతిపాదించింది. ప్రస్తుత నీటి లభ్యత ఆధారంగా పెద్ద చిన్న ప్రాజెక్టులన్నింటి కింద కలిపి 28.95 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటిని సరఫరా చేయగలమని తేల్చింది. ఈ ఏడాది వర్షాభావంతో ఎగువ నుంచి ఆశించిన వరద రాక కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్, ఇతర ప్రాజెక్టుల్లో నిల్వలు అడుగంటిపోయాయి. దీంతో కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల కింద ఖరీఫ్ (వానాకాలం) పంటల సాగే కష్టంగా కొనసాగింది. కొంత మేర ఉన్న నీళ్లూ దీనికే సరిపోయే పరిస్థితి. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్ ఆయకట్టుకు యాసంగిలో క్రాప్ హాలిడే ప్రకటించక తప్పదని స్కివం కమిటీ స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, ఆయకట్టు విస్తీర్ణం, తాగునీటి అవసరాలను పరిగణనలోకి తీసుకుని యాసంగి సీజన్లో ఏ ప్రాజెక్టు కింద ఎంత ఆయకట్టుకు సాగునీరు అందించాలనే అంశంపై రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ నేతృత్వంలో బుధవారం జలసౌధలో స్కివం కమిటీ సమావేశమై ప్రతిపాదనలను సిద్ధం చేసింది. 2023–24 యాసంగిలో 28.95 లక్షల ఎకరాలకు 215 టీఎంసీల సాగునీటిని సరఫరా చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. గత ఏడాది యాసంగి లక్ష్యం 33.46 లక్షల ఎకరాలకన్నా ఇది తక్కువ కావడం గమనార్హం. సాగర్ ఎడమ కాల్వ పరిధిలో కరువు నాగార్జున సాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 157.61 టీఎంసీలు ఉన్నాయి. ఇందులో డెడ్ స్టోరేజీకిపైన వినియోగించుకోగలిగిన నీరు చాలా తక్కువ. దీనితో సాగర్ ఎడమ కాల్వ కింద ఆయకట్టుకు నీరివ్వలేమని అధికార యంత్రాంగం తేల్చింది. ఎడమ కాల్వ కింద మొత్తంగా 6.40లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టులోనూ 57 టీఎంసీలే నీళ్లు ఉండటంతో.. ఏఎమ్మార్పి, కల్వకుర్తి ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగునీరివ్వలేని పరిస్థితి. కేవలం నెట్టెంపాడు కింద 5వేల ఎకరాలకు, మూసీ ప్రాజెక్టు కింద 30వేల ఎకరాలకే సాగునీరు ఇవ్వగలమని అధికారులు పేర్కొన్నారు. గోదావరి బేసిన్లో కాస్త మెరుగ్గా.. గోదావరి బేసిన్ పరిధిలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద దాదాపు 11.55లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఎస్సారెస్పీ నిల్వ సామర్థ్యం 90టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 78.66 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. 6.50 టీఎంసీలను తాగునీటికి, మిగతా నీటిని యాసంగి పంటల కోసం కేటాయించారు. ఎస్సారెస్పీ స్టేజ్–1 కింద మొత్తంగా 9,65,013 ఎకరాలు ఉన్నా.. 8,28,297 ఎకరాలకే సాగునీరివ్వాలని లక్ష్యంగా పేర్కొన్నారు. ఇందులో 3.87 లక్షల ఎకరాలు ఆరుతడి పంటలకు, 4.41 లక్షల ఎకరాలు తరి పంటలకు నీళ్లు ఇవ్వనున్నారు. ఆన్ ఆఫ్ పద్ధతిలో సాగునీరు: స్కివం కమిటీ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన వెంటనే ప్రాజెక్టుల వారీగా నీటి విడుదల తేదీలను ఖరారు చేసేందుకు నీటిపారుదల శాఖ కసరత్తు చేస్తోంది. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో.. అంటే 8 రోజులు నీటి విడుదల చేస్తూ, 7 రోజులు ఆపుతూ ఇస్తారు. ఇప్పటికే ఈ దిశగా రైతులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. -
వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుతో ఇంటర్వ్యూ
-
‘పంట విరామం’తోనే నాణ్యతకు భరోసా
పొగాకు పంటను స్థిరీకరించడంలో, రైతుకు మంచి లాభాలను అందించడంలో విశేషంగా తోడ్పడిన క్రాప్ హాలిడేను ఇతర వాణిజ్య పంటలకు కూడా వర్తింపచేయాల్సిన అవసరముంది. పొలం నుంచి ఓడరేవుకు చేరుకునేంతవరకు పంటల ఎగుమతి ప్రక్రియలో తప్పనిసరిగా అవసరమైన పంటల నాణ్యతను క్రాప్ హాలిడే ఎంతగానో మెరుగుపరుస్తుంది. పండ్లు, కూరగాయల పెంపకంలో భారత్ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ వీటిలో 40 శాతం ఇప్పటికీ వినియోగం లేక వృథాగా మిగిలి పోతున్నాయి. ఈ వృథాను అరికట్టడానికి గ్రామీణ ప్రాంతంలో శీతల గిడ్డంగులను విస్తృత స్థాయిలో ఏర్పాటు చేయడం ఎంతైనా అవసరం. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సదుపాయాల కల్పనను సమర్థంగా అమలు చేస్తే పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు జనం తిరిగి వలస పోవడానికి వీలు కల్పించినట్లవుతుంది. ఇరవై ఏళ్ల క్రితం అంటే 2000 సంవత్సరంలో పొగాకు పంటకు క్రాప్ హాలిడే (పంట విరామం) భావనను నేనే పరిచయం చేశాను. పంట దిగుబడిని క్రమబద్ధీకరించడం, పురుగులు తెగుళ్లను నియంత్రించడం దీని లక్ష్యం. ఏదైనా నిర్దిష్టమైన పంటను ఒక సంవత్సరం పాటు పండించకుండా ఉండటమే క్రాప్ హాలిడే అంటే. పంటను స్థిరీకరించడంలో, రైతులకు మంచి లాభాలను అందించడంలో క్రాప్ హాలిడే విశేషంగా తోడ్పడింది. క్రాప్ హాలిడే విధించిన తదనంతర సంవత్సరాల్లో పంట నాణ్యత కూడా మెరుగైంది. దేశంలో పెరుగుతున్న ఇతర వాణిజ్య పంటలకు కూడా క్రాప్ హాలిడే భావనను వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ అమలు చేసి అధికపంటను పొందవచ్చు లేక పురుగులు, తెగుళ్ల కారణంగా పంట దెబ్బతినిపోవడాన్ని నిరోధించవచ్చు. దేశానికి అవసరమైన పంటల గురించి సమగ్ర సర్వేని ప్రారంభించడం ద్వారా క్రాప్ హాలిడే భావనను వర్తింపచేయవచ్చు. పలురకాల పంటల ఉత్పత్తిలో భారత్ ప్రాధాన్య స్థానంలో ఉన్నప్పటికీ, ఆ పంటల ఎగుమతులు మాత్రం నిరుత్సాహకరంగా ఉన్నాయి. అధిక విలువ గల పంటలను పెంచడంలో భారత్ సామ ర్థ్యాన్ని పెంపొందించడానికి వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించే విధంగా ఒక సమగ్ర పథకం తీసుకునివస్తే అది రైతులకు ప్రయోజనకరంగా ఉండటమే కాదు.. విదేశీ ద్రవ్యమారకం ఆర్జించడంలో దేశానికి కూడా ఉపయోగపడుతుంది. పంటలను గుర్తించి వాటిపై విశేషంగా శ్రద్ధ పెట్టే క్రమంలో ఉత్తమ వ్యవసాయ విధానాల ద్వారా పంటల పరిమాణాన్ని, నాణ్యతను కూడా మెరుగుపర్చవచ్చు. పంట ఎగుమతికి నాణ్యతే కొలమానం ఎగుమతి కోసం ఓడరేవుకు చేరుకునేంత వరకు పంటల పరిమాణం లేక నాణ్యత ఏమాత్రం దెబ్బతినకుండా పంటను నిర్వహించుకోవడానికి అవసరమైనంత శిక్షణను ఈ పంటల ఉత్పత్తిదారులకు అందించాల్సి ఉంది. విధానాలను సరళీకరించి, సబ్సిడీ ధరలకే నాణ్యతా పరీక్షలను కల్పిస్తే ఎగుమతుల పెరుగుదలకు అది తోడ్పడుతుంది. పొలం నుంచి ఓడ రేవు వరకు పంటను తీసుకుపోవడానికి రైతు భరించిన ఖర్చులన్నింటినీ ఓడ రేవుకు పంట చేరుకున్న వెంటనే రైతుకు తిరిగి చెల్లిస్తే మరింత ముందడుగు వేసినట్లవుతుంది. దిగుమతిదారు చెల్లించే సేల్ ప్రోసీడింగ్స్ నుంచి తీసివేసి వాటిని రైతులకు చెల్లించవచ్చు. దిగుమతిదారు నుంచి క్రెడిట్ పొందడానికి వేచి చూస్తున్న రైతుకు దీంతో ఉపశమనం లభిస్తుంది కూడా. అంతేకాకుండా తమ ఉత్పత్తిని ఎగుమతి చేయడానికి పలువురు రైతులకు ఇది ఊతం కల్పిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారులందరికీ సింగిల్ విండో సదుపాయాన్ని కల్పిస్తే అవసరమైన డాక్యుమెంటేషన్, లాంఛనాలను రికార్డు సమయంలో పూర్తి చేసుకోవడానికి వీలవుతుంది. రైతు తమ పంటను నిల్వచేయగానే రాష్ట్ర ప్రభుత్వ ఎగుమతుల శాఖ ద్వారా ఆ పంటల ఎగుమతి క్రమాన్ని పూర్తి చేయాలి. ఇప్పుడైతే తమ పంటల ఎగుమతికి సంబంధించి రైతులు ఒక చోటి నుంచి మరొక చోటికి పరుగుతీయాల్సి వస్తోంది. దీంతో సమయం, డబ్బు వృథా అవుతున్నాయి. కాంట్రాక్ట్ వ్యవసాయానికి సంబంధించి కొత్త వ్యవసాయ బిల్లుల నేపథ్యంలో, కాంట్రాక్టర్, రైతు కుదుర్చుకున్న ఒప్పందాలకు కట్టుబడి ఉండేందుకు ఒక యంత్రాంగం అవసరం. రైతు లేక స్పాన్సర్ ఎవరో ఒకరు కుదిరిన ఒప్పందాలను అతిక్రమిస్తున్నట్లు అనేక ఉదంతాలు బయటపడ్డాయి. మార్కెట్లో ధరలు చుక్కలంటినప్పుడు, రైతు తమ ఉత్పత్తిని కాంట్రాక్టుకు భిన్నంగా తన ఉత్పత్తిని బయట అమ్ముకుం టాడు. అలాగే తాము కుదుర్చుకున్న ధరకంటే తక్కువ ధరకు లభించే చోటనే వ్యవసాయ ఉత్పత్తులను కొనడానికి కాంట్రాక్టర్ కూడా పూనుకుంటాడు. ఈ క్రమరాహిత్యాన్ని అడ్డుకోవడానికి, కాంట్రాక్టు కంపెనీ/ వ్యక్తి ముందుగానే రైతుకు చెల్లిస్తామని చెప్పిన మొత్తంలో 50 శాతం మొత్తాన్ని రైతుకు చెల్లించివేయాల్సి ఉంది. కాంట్రాక్టు ప్రకారం తన పంటలో సగం భాగాన్ని రైతు సరఫరా చేసిన వెంటనే ఈ మొత్తాన్ని చెల్లించాలి. దీంతో తమ మధ్య కుదిరిన ఒప్పందానికి ఇరుపక్షాలూ కట్టుబడటం సాధ్యపడుతుంది. అక్రమ నిల్వలను అరికట్టడం ఎలా? అత్యవసర సరుకుల చట్టాన్ని రద్దు చేసిన కొత్త బిల్లుకు సంబంధించి చూస్తే పంటల కొనుగోలుదారు తన వద్ద ఉన్న నిల్వ సామర్థ్యం పరిమితులను దాటి తాను కొన్న పంటను నిల్వ చేసుకునే అవకాశం అన్ని వేళలా ఉంటుంది. మరిన్ని గోడౌన్లను లీజుకు తీసుకుని పంటను అధికంగా నిల్వ చేయవచ్చు. దీనిద్వారా అతడు సరుకుల కొరతను సృష్టించి తద్వారా ఆ పంటకు అధిక ధర పొందగలడు. ఇలాంటి పరిస్థితిని నిరోధించడానికి, తమ వద్ద ఉన్న నిల్వ సామర్థ్యం గురించి కొనుగోలుదారులు తప్పనిసరిగా ప్రకటించాలని ఆదేశించాలి. ఇలా అయితే అక్రమ నిల్వలను అరికట్టవచ్చు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే కొనుగోలుదారు అదనపు నిల్వ సామర్థ్యానికి దరఖాస్తు చేసుకుని పంట ఉత్పత్తులను సేకరించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ సేకరణ కార్యకలాపాలన్నీ ఏపీఎమ్‌సీ ప్రాంగణంలో మాత్రమే జరగాలి. అప్పుడు మాత్రమే పంటల రాక, ధరలు, విక్రేతల గుర్తింపును నజావుగా నిర్వహించవచ్చు. దీనివల్ల ప్రస్తుత మార్కెటింగ్ మౌలిక వ్యవస్థను, మానవ శక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. సరఫరా స్థాయిలను ప్రభావితం చేసేటటువంటి వాణిజ్యపరంగా ప్రాధాన్యత గల పంటలు, అవి పండే అవకాశమున్న ప్రాంతాలకు సంబంధించి సరుకు పరిస్థితిపై నివేదికలను సిద్ధం చేయాలి. ఈ నివేదికలను నిజ సమయ డేటాతో నవీకరించాలి. ఇది ఒక సరుకు కొరతను, లేక అధిక సరఫరాను గుర్తించడంలో ముందుగానే అవగాహనను కల్పించడమే కాకుండా అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలోనూ తోడ్పడుతుంది. సరుకు సరఫరా తక్కువగా ఉన్నప్పుడు లేక అధిక సరఫరా జరిగినప్పుడు దిగుమతి చేసుకోవడం లేక సేకరించడంపై ప్రభుత్వం తగు చర్య తీసుకోవచ్చు. ఇప్పుడయితే ఈ రెండు చర్యలను ప్రభుత్వం చాలా ఆలస్యంగా చేపడుతుండటంతో రైతుల్లో నిస్పృహ ఏర్పడుతోంది. అపరిమిత స్థాయిలో పంటల వృథా! పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో దేశానికి ఉన్న సామర్థ్యాన్ని పరిశీలిస్తే, వీటి ఎగుమతుల నుంచి మరింత ప్రయోజనం పొందవచ్చు. తగిన పరిమాణంలో నాణ్యమైన ఉత్పత్తి సాధ్యపడే ప్రాంతాల్లో ఉత్పత్తి సంస్థలకు తగిన పెట్టుబడి, శిక్షణ, సబ్సిడీ మద్దతును కల్పించి మెరుగైన చెల్లింపులు చేసే దేశాలకు ఆ ఎగుమతులను పంపించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పండ్లు, కూరగాయల పెంపకంలో భారత్ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ వీటిలో 40 శాతం ఇప్పటికీ విని యోగం లేక వృధా అవుతున్నాయి. భారత్‌లో ఇలాంటి వృథా ఏ స్థాయిలో ఉంటోందంటే అది ఆస్ట్లేలియా మొత్తం ఉత్పత్తికి సమానంగా ఉంటోంది. ఇలాంటి పంటల వృథాను అరికట్టడానికి గ్రామీణ ప్రాంతం మొత్తంగా శీతల గిడ్డంగులు, కోల్ట్ చైన్స్‌ని విస్తృత స్థాయిలో ఏర్పాటు చేయడం ఎంతైనా అవసరం. రైతుల సంక్షేమానికి, గ్రామీణాభివృద్ధి కోసం ప్రతి ఏటా కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నాయి. దీన్నుంచి ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయి అని మదించాల్సిన సమయం ఆసన్నమైంది. దీనికోసం నీతి ఆయోగ్, జాతీయ గణాంకాల సంస్థ, ప్రధాన ఆర్థిక సలహాదారు వంటి వారిని పురమాయించాలి. ఆ విధంగానే ప్రభుత్వం సరైన రీతిలో సంక్షేమ నిధుల ఖర్చు వ్యవహారాలను మదించి ఉత్తమ ఫిలితాలను సాధించవచ్చు. రివర్స్ వలసకు అదే కీలకం గత కొన్ని దశాబ్దాలుగా ఉన్నత వృత్తివిద్యా కోర్సులను చదివే అవకాశాలను గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు పొందలేకపోతున్నారు. కాబట్టి దేశంలోని అన్ని వృత్తి విద్యా కళాశాలల్లో కనీసం 15 శాతం సీట్లను గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కేటాయించాలని నేను సూచిస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలల్లో, కాలేజీల్లో అయిదేళ్లు చదివిన వారు ఈ సీట్లను పొందడానికి పరీక్షలో అర్హత సాధించాలి. పీయూఆర్‌ఏ (గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సదుపాయాలు కల్పన) భావనను ముఖ్యంగా విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టితో అమలు చేయాలి. దీనివల్ల పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు ప్రజలు పెద్ద ఎత్తున తిరిగి వలస పోవడానికి వీలు కల్పించినట్లవుతుంది. (2021–22 బడ్జెట్ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక శాఖామంత్రికి పంపిన సూచనల సారాంశం) వ్యాసకర్త: డాక్టర్ యలమంచిలి శివాజీ, రాజ్యసభ మాజీ ఎంపీ, కిసాన్ ఫౌండేషన్ గౌరవాధ్యక్షుడు మొబైల్: 98663 76735 -
‘క్రాప్ హాలిడే’ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఏపీ గవర్నర్
సాక్షి, విజయవాడ : వ్యవసాయం సరిగా లేకపోతే మనిషి మనుగడ సరైన దారిలో ఉండదని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. డాక్టర్ యలమంచిలి శివాజీ రచించిన ‘క్రాప్ హాలిడే’ పుస్తకాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అధికార భాష సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, పొగాకు బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాథ్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశమని, రైతు దేశానికే వెన్నుముక అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు రైతు భరోసా పథకం ప్రవేశ పెట్టిందని, రైతు భరోసా, పీఎం కిసాన్ పథకాలు ప్రవేశపెట్టడం సంతోషకరమన్నారు. క్రాప్ హాలిడే పుస్తకం భగవద్గీత వంటిది క్రాప్ హాలిడే అనేది రైతుల్లో ఒక మేలు కొలుపులా పని చేసిందని అధికార భాష సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. శివాజీ లాంటి మనిషి మనకు దొరకడం అదృష్టమన్నారు. రైతు సమస్యలపై పార్లమెంటులో అనేక పోరాటాలు చేశారని, రైతు సమస్యలపై అన్ని పార్టీల వారిని ఏకం చేసేవారని ప్రస్తవించారు. వ్యాపారవేత్తల చేతిలో పొగాకు రైతులు ఎలా మోసపోయారనే విషయాన్ని పుస్తకంలో స్పష్టం చేశారన్నారు. పొగాకు రైతులు తమ సమస్యలు నుంచి ఎలా బయట పడలనే విషయాన్ని కూడా వివరించారని, రైతు సమస్యలపై ప్రభుత్వాలకు అనేక సలహాలు ఇచ్చారని పేర్కొన్నారు. రైతులకు సంబంధించినంత వరకు క్రాప్ హాలిడే పుస్తకం అనేది భగవద్గీత వంటిదన్నారు. రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలి: యలమంచిలి పది కోట్ల మందికి పైగా రైతులు వ్యవసాయ చేస్తుంటే అందులో పొగాకు పండించేవారు లక్షల్లోనే ఉన్నారని యలమంచిలి శివాజీ తెలిపారు. పొగాకు కోసం పార్లమెంటులో పోరాటం చేస్తే అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలిపేవని, గతంలో ఎన్నడూ పొగాకు రైతు క్రాప్ హాలిడే చేసిన సందర్భాలు లేవని గుర్తు చేశారు. పొగాకు రైతులు సరైన ధర లేక ఇబ్బంది పడుతున్నాదని, పారిశ్రామిక వేత్తలకు ఇబ్బందులు తలెత్తితే దేశంలో అందరూ స్పందిస్తున్నారని, అదే రైతులకు నష్టం వస్తే మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను ప్రభుత్వాలు మరింతగా ఆదుకోవాలని సూచించారు. -
తనను బతకనిస్తే మనకు బతుకు
పెట్టుబడి పెట్టి, చెమట–రక్తం కలగలిసే శరీరకష్టంతో పండించిన పంటను పారబోసుకోవడానికి రైతు సిద్ధమవడం నిజంగా దయనీయ పరిస్థితే. అదే రైతు ధర్మాగ్రహం ఇంకా హెచ్చి, పంట బంద్ ప్రకటిస్తే పరిస్థితేమిటి? ఎకరం, రెండెకరాల నుంచి... ఎంత పెద్ద రైతయినా, కుటుంబ జరుగుబాటుకు సరిపడే పంట సాగుకే పరిమితమౌ తాడు. పరిమిత సాగుతో కనాకష్టంగా బతకడానికి సిద్ధపడతాడు. మిగతా భూమి బీడు వదిలితే... దేశంలో పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించగలమా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ‘పంట విరామం’ ప్రకటించి గోదావరి జిల్లా రైతాంగం అప్పట్లో సంచలనమే సృష్టించింది. ఉద్యమంగా ఇది దేశవ్యాప్తమైతే ప్రభుత్వాలు తట్టుకోగలవా? ‘అజాతశత్రుండె అలిగిన నాడు....’ అంటూ కౌరవస భలో హెచ్చరిస్తాడు రాయ బారానికి వచ్చిన శ్రీకృష్ణుడు. శాంత స్వభావి, శత్రువేలేని ధర్మరాజుకే కోపం వస్తే... మీకిక పుట్ట గతులుండవని చెప్పడమే ఆయన ఉద్దేశం. నేడు దీనా వస్థలో కొట్టు మిట్టాడుతున్న ‘దేశపు వెన్నెముక’ రైతు గురించి, రేపు రైతే ఆగ్రహిస్తే రాగల దుష్పరిణామాల గురించీ పాలకులతో రాయబారం చేసే వాళ్లు లేకుండా పోయారీ దేశాన! వారం రోజులుగా ప్రధాన రాష్ట్రాల్లో రైతులు జరుపుతున్న ‘గ్రామ బంద్’ నిరసనను ఆయా ప్రభుత్వాలు పట్టించు కోవడం లేదు. ఆ మాటకొస్తే, రైతునే పట్టించుకో వడం లేదు పాలకులు. కానీ, ఏ దారీ కానక దశా బ్దాలుగా అలమటిస్తున్న ఈ దేశ రైతాంగానికి ఇప్పు డిప్పుడే దారులు తెరచుకుంటున్నాయి. అదే పోరు బాట! సందర్భాన్ని బట్టి సంఘటితమవుతున్నారు. మొన్న మధ్యప్రదేశ్, నిన్న మహారాష్ట్ర... నిజాయి తీతో జరిపే రైతాంగ పోరాటాలు ప్రభుత్వాలపై ప్రభావం చూపుతున్నాయి. సంఘటితమై రైతాంగం ఉద్యమాల్ని ఉదృతం చేసిన చోట ప్రభుత్వాలు విధి లేక దిగివస్తున్నాయి. పరిస్థితిని ముందే పసిగట్టిన కొందరు ముఖ్యమంత్రులు విజ్ఞతతో రైతు హితంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు చేపట్టిన తెలంగాణ రాష్ట్రం అందుకొక ప్రత్యక్ష సాక్ష్యం. వ్యవసాయ రంగాన్ని ఖాతరు చేయని గుడ్డి పాలకులున్న చోట, చైతన్యపు యువనేతలు రైతుకు భరోసా కల్పించే విస్పష్ట హామీలతో ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. అందుకు, ‘రాబోయేది రైతు ప్రభుత్వమే’ అని విపక్ష నేత విస్పష్ట ప్రకటన చేసిన ఆంధ్రప్రదేశ్ నిలువెత్తు ఉదాహరణ! ఉత్తరాదిని అట్టుడికిస్తున్న ‘గ్రామ బంద్’ రైతుపోరు ఎక్కడికి దారితీస్తుందో చూడాలి. రైతు సంఘాల మధ్య విబేధాలు సృష్టించో, మరో ఎత్తుగడతోనో... సంఘటిత పోరాటాల్ని దెబ్బతీసే పాలకుల కుయత్నాలూ సాగుతున్నాయి. పంజాబ్ అందుకు వేదికవుతోందిప్పుడు. అటువంటి విద్రోహ చర్యల పట్ల రైతులు, రైతు సంఘాలు, పౌర సంస్థలు అప్రమత్తంగా ఉండటమే తక్షణ కర్తవ్యం అంటు న్నారు ఉద్యమకారులు. రైతాంగం మనోధైర్యం వీడకుండా, ఆధునిక సాంకేతికతను వాడుకుంటూ సంఘటిత పోరాటాలు చేస్తే రాజకీయ వ్యవస్థ దిగి రాక తప్పదని భరోసా కల్పిస్తున్నారు. కడుపు మంట నుంచే ఆగ్రహజ్వాల పది రోజులని ప్రారంభించిన ఈ సమ్మె వారం దాటింది. తమ డిమాండ్లు పరిష్కరించకుంటే ఈనెల 10న ‘భారత్‌బంద్’ జరుపుతామనీ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్ (ఆర్కేఎమ్) హెచ్చరించింది. మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, రాజస్తాన్, పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాల్లో ఇది ఉదృతంగా సాగుతోంది. పాలు, పండ్లు, కూరగాయలు, తదితర వ్యవసాయోత్ప త్తుల్ని పట్టణాలు, నగరాలకు నిలిపివేశారు. ‘పోతే పోయింది, ఇట్లానన్నా పాలకులకు తెలిసి వస్తుంద’ని రైతులు మనసు చంపుకొని తమ ఉత్పత్తుల్ని పేద లకు పంచుతున్నారు. కాదంటే రోడ్ల మీద పార బోస్తున్నారు నిరసనగా! పట్టణాలు, నగరాలకు చేర నీయడం లేదు. అక్కడ ఈ నిత్యావసరాల ధరలు చుక్కలనంటాయి. పట్టణాలు–నగరాల నుంచి రైతాంగం ఈ పదిరోజులు ఏమీ కొనుగోలు చేయొ ద్దనీ నిర్ణయించుకున్నారు. 30 జాతీయ రహదారు లపై నిరసన బైఠాయింపులు చేస్తున్నారు. రోజు రోజుకు పరిస్థితి గంభీరంగా మారుతోంది. ఒక్కసారి వ్యవసాయ రుణాల్ని మాఫీ చేయాలి, వ్యవసాయో త్పత్తులకు తగిన ధర నిర్ణయించాలనే రెండే డిమాం డ్లను ముందుకు తెస్తూ ఈ నిరసన చేపట్టారు. సరిగ్గా ఏడాది కిందట మధ్యప్రదేశ్ మందసౌర్‌లో ఇలాగే ఆందోళన చేస్తున్న రైతులపై కాల్పులు జరిపి, ఆరుగురిని పొట్టనపెట్టుకున్న ఉదంతం కేంద్రకంగా ఈ ఆందోళన షెడ్యూల్ ఖరారు చేశారు. దేశ వ్యాప్తంగా దిగజారుతున్న రైతు దీనావస్థే ప్రస్తుత పోరుకు ప్రేరణ! 130కి పైగా రైతు సంఘాలు ‘రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్’ సమాఖ్యగా ఏర్ప డ్డాయి. రైతులు తమ నిరసనకు ఈ ‘మార్కెట్ బాయ్ కాట్’ పద్దతి ఎంచుకోవడం సరికాదని, దీనివల్ల వినియోగదారుడి, ఉత్పత్తిదారుడి ఆర్థికస్థితీ భంగపో తోందని కొందరు వ్యవసాయ నిపుణుల అభి ప్రాయం. పైగా, రోడ్లపై పారబోయటం వల్ల ఆహార పదార్థాలు వ్యర్థమవుతున్నాయన్నది వారి ఆందోళన. ప్రత్యామ్నాయ నిరసనలు పనిచేయకే ఈ పద్ధతికి రావాల్సి వచ్చిందని రైతు నాయకులంటున్నారు. రేపు ‘పంట బంద్’ ప్రకటిస్తే! అన్నం పెట్టే రైతుకు ఆగ్రహం తెప్పించకూడదనే మాట మన పురాణ కాలం నుంచీ ఉంది. ప్రకృతి వైపరీ త్యాలకు, పాలకుల నిర్లక్ష్యానికి కుదేలయిన వ్యవ సాయ రంగాన్ని మాయల మార్కెట్ మరింత దిగ జార్చింది. వాన చినుక్కి, విత్తనానికీ ఆరాటపడటం నుంచి... ఎరువులు, పురుగుమందులు, దిగుబడి, మార్కెట్, పంటకు ధర ఇలా ప్రతిదశ ఒక యుద్ధమే! ఆదుకునే వ్యవస్థ లేక ఈ యుద్ధంలో రైతు చేష్టలుడిగి నేలకొరుగుతున్నాడు. వలసలు, ఆత్మహత్యలు మామూ లయ్యాయి. ఉత్పత్తి వ్యయం కూడా రానపుడు వ్యవ సాయం చేసి ఎట్లా బతగ్గలం అని అడుగుతున్నారు. పెట్టుబడి పెట్టి, చెమట–రక్తం కలగలిసే శరీరకష్టంతో పండించిన పంటను పారబోసుకోవడానికి రైతు సిద్ధ మవడం నిజంగా దయనీయ పరిస్థితే. అదే రైతు ధర్మాగ్రహం ఇంకా హెచ్చి, పంట బంద్ ప్రకటిస్తే పరి స్థితేమిటి? ఎకరం, రెండెకరాల నుంచి... ఎంత పెద్ద రైతయినా, కుటుంబ జరుగుబాటుకు సరిపడే పంట సాగుకే పరిమితమౌతాడు. పరిమిత సాగుతో కనా కష్టంగా బతకడానికి సిద్ధపడతాడు. మిగతా భూమి బీడువదిలితే... దేశంలో పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించగలమా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ‘పంట విరామం’ ప్రకటించి గోదావరి జిల్లా రైతాంగం అప్పట్లో సంచలనమే సృష్టించింది. ఉద్యమంగా ఇది దేశవ్యాప్తమైతే... ఆహారోత్పత్తి మీద, ఆర్థిక రంగం పైనా విపరీత ప్రభావం పడుతుంది. ఇతరేతర సమ స్యలు కూడా ముప్పిరిగొంటాయి. వినియోగదారులు అల్లాడుతారు. రైతులే కాక వ్యవసాయంపై ప్రత్య క్షంగా, పరోక్షంగా ఆధారపడ్డ కోట్ల కుటుంబాలు రోడ్డున పడతాయి. ఇంతటి అత్యయిక పరిస్థితిని ప్రభు త్వాలు తట్టుకోగలవా? ఇప్పుడే సామరస్యంగా సమ స్యను పరిష్కరించి రైతును ఆదుకోవాల్సిన అవసరం, అంతకు మించిన బాధ్యత ప్రభుత్వాల పైనుంది. సకాలంలో మేల్కొంటేనే.... రైతాంగాన్ని ఆదుకుంటామని, వ్యవసాయాన్ని లాభ సాటి చేస్తామని ప్రభుత్వాలు హామీ ఇస్తున్నా వాస్త వంలో జరగటం లేదు. పంటలన్నింటీకీ కనీస మద్దతు ధర వెంటనే లభింపజేస్తామని, 2022 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ, ఆ దిశలో అడుగులు పడటం లేదు. ఉద్యమిస్తున్న రైతాంగం కోరే రుణమాఫీ, మద్దతు ధర ఈ రెండంశాలు కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనివే! రైతాంగాన్ని అదుకునే క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పటిష్టమైన రెండ డుగులు వేశారు. ఎకరానికి రూ. 8,000ల పంట పెట్టుబడి సహాయం ప్రకటించి, అందులో సగం ఒక పంటకోసం ఇప్పటికే రైతుకు అందజేశారు. రూపాయి ప్రీమియం చెల్లించ నవసరం లేకుండా 5 లక్షల రూపాయల జీవితభీమాను ప్రతి రైతు కుటుం బానికీ కల్పించే ప్రక్రియ చేపట్టారు. ఏపీలో విపక్షనేత వై.ఎస్. జగన్ తన విధాన ప్రకటన ‘నవరత్నాల్లో’ భాగంగా రైతాంగానికి దన్ను ఇచ్చే ఎన్నో చర్యల్ని వెల్లడించారు. వాటికి తోడు ప్రస్తుత పాదయాత్ర సందర్భంగా తనను కలుస్తున్న రైతాంగానికి నిర్దిష్ట మైన మాటలు చెబుతూ భరోసా కల్పిస్తున్నారు. పంట పెట్టుబడి కోసం మే నెలలోనే ప్రతి రైతుకూ రూ. 12.500 (వైఎస్సార్ భరోసా పథకం), రైతులకు ఉచితంగా బోర్లు, రైతు ట్రాక్టర్‌కు రోడ్డు పన్ను రద్దు, పంటవేసే ముందే మద్దతు ధర ప్రకటన, రూ. 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, పాడి రైతుకు లీటరు పాలపై రూ.4 ప్రోత్సాహకం, రూ. 4,000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి... ఇలా ఎన్నెన్నో సానుకూలాంశాల్ని ప్రకటించారు. వ్యవసాయం పట్ల మంచి దృక్పథం ఉన్న నాయకత్వం ప్రస్తుత ఊబి లోంచి రైతుల్ని బయటకు తీసే చర్యలు స్వచ్ఛం దంగా చేపట్టాలి. మరోవైపు ఉద్యమాలు, పోరాటాల ద్వారా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే చర్యలు ఎలాగూ సాగుతున్నాయి. ధర, రుణమాఫీ అడగరు ద్రవ్యోల్బనం ఆధారంగా సవరించిన జీడీపీ లెక్కల్ని కేంద్ర ఆర్థిక గణాంక శాఖ గత వారం వెల్లడించింది. వ్యవసాయ రంగంలో పెట్టుబడి–సేవల వ్యయం పెరు గుదల రేటు స్థాయిలో ఆదాయ పెరుగుదల లేదని స్పష్టమైంది. అంటే, క్రమంగా రైతుల ఆర్థిక పరిస్థితి ఇంకా దిగజారుతోందని మరోమారు రుజువైంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. పర్యావరణంతో అను సంధానం చేసిన పంటల సమగ్ర విధానం ఉండాలి. ఎప్పుడు, ఎక్కడ, ఏ పంట, ఎంత విస్తీర్ణంతో వేయాలో ఖరారు చేసే నిపుణుల కమిటీలుండాలి. ప్రతి పంటకు తగినంత ముందుగానే మద్దతు ధర ప్రకటించాలి. ఎమ్మెస్ స్వామినాథన్ కమిషన్ సిఫా రసు చేసినట్టు సమగ్ర వ్యయం (సీ–2) పై 50 శాతం అధికంగా ఎమ్మెస్పీ ఖరారు చేయాలి. ధాన్యం రైతు చేతి నుంచి దళారులకు చేరాక కాకుండా, ముందే సర్కారు ధాన్యం సేకరణ జరపాలి. ఎమ్మెస్పీ లభిస్త లేనపుడు, ప్రభుత్వాలే మార్కెట్ జోక్యంతో కొనుగోలు చేయాలి. అందుకు ధరల స్థిరీకరణ నిధి ఉండాలి. ‘మా ఉత్పత్తికి తగిన ధర ఇప్పించండి చాలు, రుణం మాఫీ చేయమని మేమేం అడగం’ అని రైతులు, రైతు సంఘాలే చెబుతున్నాయి. దళారీ వ్యవస్థను తగ్గించి ఉత్పత్తిదారు– వినియోగదారుడికి మధ్య ఒక ప్రత్యక్ష మార్కెట్ వ్యవస్థను పటిష్టపరచాలి. అనేక ఆటు పోట్లెదుర్కొంటూ, ఏడాది కష్టపడి రైతు పొందే ప్రయో జనానికి అయిదారు రెట్ల అధిక లాభాన్ని రెండు, మూడంచెల దళారులు కొన్ని రోజుల్లోనే గడించడం దుర్మార్గం. దీన్ని పరిహరించాలి. ఏం చేసైనా రైతు కన్నీరు తుడవాలి. అది రాకుండా, రైతే అసలు ఆగ్ర హించకుండా జాతి జాగ్రత్తపడాలి. ఇది రైతు కోసం కాదు, మనందరి కోసం! వ్యాసకర్త: దిలీప్ రెడ్డి, ఈ-మెయిల్ :dileepreddy@sakshi.com -
పంట విరామ ప్రాంతాల పరిశీలన
నేడు వైఎస్సార్ సీపీ రైతు నేత నాగిరెడ్డి పర్యటన సాక్షి ప్రతినిధి, కాకినాడ : కోనసీమ ప్రాంతం లో ఖరీఫ్ సీజ¯ŒSలో పంట విరామం ప్రకటించిన పొలాలను శుక్రవారం వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి పరిశీలించనున్నారు. కోనసీమలో సుమారు 70 వేల ఎకరాల్లో పంట విరామాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.. శివకోడు నుంచి సఖినేటిపల్లి రేవు, గొంది, మూడుతూములు, అంతర్వేది రోడ్డు, కేశవదాసుపాలెం, చింతలమెరక, ప్రకాశనగర్, బట్టేలంక, లక్కవ రం, చింతలపల్లి, కడలి, తాటిపాక సెంటర్, మామిడికుదురు తదితర ప్రాంతాల్లో పరిశీలిస్తారని పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు గురువారం విలేకర్లకు చెప్పారు. నాగిరెడ్డి వెంట పార్టీ రైతు విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల ఇ¯ŒSఛార్జి కొవ్వూరి త్రినాధ్‌రెడ్డి, నియోజకవర్గాల నాయకులు ఉంటారని చెప్పారు. -
ఆయుకట్టుకు గండం
హెచెఎల్సీ కింద తొలిసారి ‘క్రాప్ హాలిడే’ సూచనలు టీబీ డ్యాంకు ఆశించిన స్థాయిలో చేరని నీరు హంద్రీ–నీవాకు పుష్కలంగా నీరొస్తేనే ఊరట జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న తుంగభద్ర జలాశయానికి (టీబీ డ్యాం) ఈ ఏడాది ఆశించిన స్థాయిలో నీరు చేరడం లేదు. నది పరీవాహక ప్రాంతంలో వర్షాభావానికి తోడు ఎగువన నిర్మించిన ప్రాజెక్టులతో డ్యాంలోకి ఇన్‌ఫ్లో గణనీయంగా తగ్గిపోయింది. దీనివల్ల ఈ ఏడాది తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) కింద ఆయకట్టుకు నీటి విడుదల ప్రశ్నార్థకంగా మారింది. తొలిసారిగా ‘క్రాప్ హాలిడే’ సూచనలు కన్పిస్తున్నాయి. అనంతపురం సెంట్రల్ : తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) పరిధిలో మొత్తం 2.84 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అనంతపురం, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో విస్తరించి ఉన్న ఈ ఆయకట్టులో ప్రతియేటా దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. ఈ ఏడాది మాత్రం నీలినీడలు కమ్ముకున్నాయి. టీబీ డ్యాంలో ఆశించిన మేర నీరు చేరకపోవడమే ఇందుకు కారణం. గత ఏడాది ఇదే సమయానికి డ్యాంలో 74 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. ఈ ఏడాది 51 టీఎంసీలు మాత్రమే ఉంది. ముఖ్యంగా డ్యాంలోకి నీటి చేరిక (ఇన్‌ఫ్లో) మందకొడిగా ఉంది. గత ఏడాది ఈ సమయంలో 22,971 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ఈ సారి మాత్రం 14,667 క్యూసెక్కులే వస్తోంది. అది కూడా వారం నుంచి పెరిగింది. పదిరోజుల క్రితం నాలుగు వేల క్యూసెక్కులే ఉండేది. దీనివల్ల ఆయకట్టుకు నీటి విడుదల ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలోనే అత్యధిక ఆయకట్టు హైలెవల్ మెయిన్ కెనాల్(హెచ్‌ఎల్‌ఎంసీ) పరిధిలోని కణేకల్లు, బొమ్మనహాల్ మండలాల్లో ఉంది. ఇక్కడ ప్రతి ఏటా వేలాది ఎకరాల్లో వరి, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. ఎప్పుడూ ఈ సమయానికి మెయిన్ కెనాల్ పరిధిలో పంటలకు నీరు వదిలేవారు. ఈ సారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. మెయిన్ కెనాల్ పరిధిలోనే ఇలా ఉంటే.. ఇక ఉపకాలువల పరిధిలో ఆయకట్టుకు నీరివ్వడం అసాధ్యమేనని రైతులు అంటున్నారు. నీరివ్వకపోతే మెయిన్ కెనాల్ పరిధిలోని ఆయకట్టుదారుల నుంచి ఎక్కడ వ్యతిరేకత వస్తుందేమోనని అధికారులు, ప్రజాప్రతినిధులు ముందే ఆ ప్రాంత రైతులతో సమావేశాలు నిర్వహించారు. రెండేళ్లుగా ఇబ్బందులే గత ఏడాది హెచ్‌ఎల్‌ఎంసీ, గుంతకల్లు బ్రాంచ్‌కెనాల్ (జీబీసీ) కింద పంటలకు అరకొరగా నీరొదిలారు. మిడ్‌పెన్నార్ సౌత్, నార్త్ కెనాల్స్æ, తాడిపత్రి బ్రాంచ్ కెనాల్ (టీబీసీ) తదితర వాటికి చుక్కనీరు కూడా వదలలేదు. ఈ సారైనా ఇస్తారనే ఆశతో ఉన్న రైతులకు తీవ్ర నిరాశే ఎదురవుతోంది. ప్రస్తుతం టీబీ డ్యాంలో ఉన్న నీటి నిల్వను పరిగణనలోకి తీసుకుంటే హెచ్చెల్సీ వాటా మరో నెల రోజుల్లో ముగిసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది దామాషా ప్రకారం హెచ్చెల్సీకి 22 టీఎంసీల నీరు వస్తుందని అంచనా వేశారు. గత నెల 25 నుంచి రోజూ 1,200 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. ఇప్పటికి మూడున్నర టీఎంసీలు వచ్చాయి. మన కోటా మరో నెల రోజుల్లో ముగిస్తే 15 టీఎంసీలకు మించి వచ్చే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. హంద్రీ–నీవా ఆదుకునేనా? ఈ ఏడాది టీబీ డ్యాం నిరుత్సాహ పరిచినా శ్రీశైలం డ్యాం మాత్రం తొణికిసలాడుతోంది. దాని నుంచి హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు జిల్లాకు వస్తున్నాయి. ప్రస్తుతం జీడిపల్లి జలాశయంలో నీటిని నిల్వ చేస్తున్నారు. త్వరలో అక్కడి నుంచి పీఏబీఆర్, మిడ్‌పెన్నార్ రిజర్వాయర్‌కు విడుదల చేయనున్నారు. హంద్రీనీవాకు పుష్కలంగా నీరొస్తే మిడ్‌పెన్నార్ సౌత్, నార్త్ కెనాల్ కింద ఉన్న ఆయకట్టు కింద ఆరుతడి పంటలకైనా ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. నీరు తీసుకురావడంలో విఫలం అయితే ఈ ఏడాది కూడా క్రాప్‌హాలిడే ప్రకటించాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
మమ అనిపించారు..
‘పంట విరామం’పై రైతులతో సర్కారు చర్చలు సమస్యలకు శాశ్వత పరిష్కారం కోరిన అన్నదాతలు అన్నింటినీ పరిష్కరిస్తామన్న ఉప ముఖ్యమంత్రి రాజప్ప ప్రధాన డిమాండ్లపై నిర్దిష్టమైన హామీలు ఇవ్వని సర్కారు 15 రోజులు చూసి ఉద్యమ కార్యాచరణ : రైతు సంఘాలు అమలాపురం : పంట విరామానికి ఉద్యుక్తులైన కోనసీమ రైతులతో చర్చలు జరిపిన ప్రభుత్వం.. వారి ప్రధాన డిమాండ్లకు సంబంధించి నిర్దిష్టమైన హామీలివ్వలేదు. చర్చలు మొక్కుబడి తంతుగా జరిగాయని అన్నదాతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చర్చలకు వచ్చిన రైతు సంఘం ప్రతినిధుల్లో ఎక్కువ మంది అధికారపార్టీలో పదవులున్నవారు కావడంతో చర్చలు ఏకపక్షంగా సాగిపోయాయంటున్నారు. ఇచ్చిన హామీల అమలుకు 15 రోజులు చూసి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని రైతు సంఘాల ప్రతినిధులు అంటున్నారు. కోనసీమ రైతులతో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లాస్థాయి అధికారులతో సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో చర్చలు జరిపారు. రైతులు స్వచ్ఛందంగా పంట విరామం ప్రకటించి, తమ సమస్యలపై ప్రభుత్వం చర్చలు జరపకుంటే ఈనెల 30న అమలాపురంలో రైతు సభ నిర్వహించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్న నేపథ్యంలో ప్రభుత్వం చర్చలకు వచ్చింది. అయితే చర్చల్లో ప్రభుత్వం తరపున రాజప్ప చెప్పాల్సింది చెప్పారేకాని మాట్లాడేందుకు రైతులకు పెద్దగా అవకాశం ఇవ్వలేదు. తొలుత ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం తీసుకున్న చర్యల్ని వివరించిన రాజప్ప ఎన్ని సమస్యలనైనా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సాగు జరగకుండా కావాలని ఇబ్బందులు పెడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించే ధోరణిలో మాట్లాడడంతో రైతు సంఘం ప్రతినిధులు నొచ్చుకున్నారు. మే 15కల్లా నీరిచ్చేది కల్లే..! రైతు సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ అధ్వానంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ, మే 15 నాటికి సాగునీరు విడుదల చేయకపోవడం, ఇన్పుట్ సబ్సిడీ, పెట్టుబడులకు తగ్గ మద్దతు ధర లేకపోవడం, యూంత్రీకరణ, ధాన్యం కొనుగోలులో నిబంధనల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను లేవనెత్తారు. వీటిలో ఒక్కదానిపైనా నిర్దిష్టమెన హామీ రాలేదు. ముఖ్యంగా మే 15 నాటికి నీరు విడుదల చేయాలన్న మధ్యడెల్టా రైతుల డిమాండ్‌పై వచ్చే ఏడాది ఇస్తామనే హామీ కూడా రాలేదు సరికదా, జూన్ 15 నాటికే ఇస్తామని రాజప్ప పదేపదే చెప్పడం గమనార్హం. రైతులు నాట్లు వేసేటప్పుడు, కోతల సమయంలో ఉపాధి హామీ పథకం పనులు నిలిపివేసేందుకు చర్యలు తీసుకుంటామని, కూనవరం, రామేశ్వరం మొగల వద్ద డ్రెడ్జింగ్ చేయడం ద్వారా ముంపు సమస్యను పరిష్కరిస్తామని, యాంత్రీకరణకు రూ.2.20 కోట్లు కేటాయించామని చెప్పిన ఆయన కనీస మద్దతు ధర పెంపు, కేంద్రం పెంచకుంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి బోనస్, డెల్టా ఆధునికీకరణ, ధాన్యం కొనుగోలు నిబంధనల సడలింపులకు సంబంధించి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. అవుట్‌ఫాల్ స్లూయిజ్‌లను రూ.45 లక్షలతో ఆధునీకరిస్తామని ఎస్ఈ ఎస్.సుగుణాకరరావు చెప్పారు. ఆగ్రహంతో ఊగిపోయిన రాజప్ప.. రైతు పరిరక్షణ సమితి మాజీ అధ్యక్షుడు రంబాల బోస్ మాట్లాడుతూ రైతు సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న ఉద్యమాన్ని రాజకీయ కోణంతో చూడవద్దనగా రాజప్ప ఆగ్రహంతో ఊగిపోయారు. ‘మీరే రాజకీయాలు చేస్తున్నా’రంటూ విరుచుకుపడడంతో రైతులు అవాక్కయ్యారు. దాంతో బోస్ ‘కోప్పడకండి. మీ నాన్నగారు, మా నాన్నగారు సాగు చేసిన సమయంలో బస్తా ధాన్యాన్ని 20 మంది కూలీలకు పంచేవారు. ఇప్పుడు బస్తా ధాన్యానికి ముగ్గురు కూలీలు వస్తున్నారా?’అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం దేశానికి ఆహార భద్రతను చూస్తోందే తప్ప రైతుకు ఆర్థిక భద్రతను చూడడం లేదని నిరసించారు. జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి, ఏఎంసీ చైర్మన్ గునిశెట్టి చినబాబు, రైతు సంఘం నాయకులు వా సంశెట్టి సత్యం, జున్నూరి బాబి, రాయపురెడ్డి జానకిరామయ్య, ముత్యాల జమ్మి, ఉప్పుగంటి భాస్కరరా వు, దొంగ నాగేశ్వరరా వు, ఆర్డీవో జి.గణేష్‌కుమార్, వ్యవసాయశాఖ జేడీ ప్రసాద్ చర్చల్లో పాల్గొన్నారు. నేటికీ వీడని నాటి సమస్యలు.. 2011లో సాగుసమ్మెకు కారణమైన సమస్యల్ని రైతులు ఇప్పటికీ ఎదుర్కొంటున్నారని రైతు సంఘం నాయకులు స్పష్టం చేశారు. భారతీయ కిసాన్‌సంఘ్ జాతీయ కార్యవర్గసభ్యుడు జలగం కుమారస్వామి మాట్లాడుతూ డ్రైన్లు సముద్రంలో కలిసే మొగల వద్ద శాశ్వతంగా రాతికట్టడాలు కట్టాలే తప్ప తాత్కాలిక చర్యలతో ప్రయోజనం లేదన్నారు. మే 15 నాటికి ఎట్టి పరిస్థితుల్లోను సాగునీరు ఇవ్వాలన్న డిమాండ్‌కు కట్టుబడి ఉన్నామన్నారు. తొలకరి సాగుకు ముందు ప్రతి డివిజన్లో రైతు సమస్యలపై సమావేశం ఏర్పాటు చేయాలని సూచించగా రాజప్ప అంగీకరించారు. కోనసీమ రైతు పరిరక్షణ సమితి అధ్యక్షుడు యాళ్ల వెంకటానందం మాట్లాడుతూ ఇప్పుడున్న రెవెన్యూ డ్రైన్లను మాత్రమే ఆధునీకరిస్తున్నారని, చాలా డ్రైన్లు ఆక్రమణలతో కనిపించకుండా పోయాయన్నారు. ప్రస్తుతం తక్కువ వర్షానికే చేలు మునిగాయని, ముంపు తగ్గి నారుమడి వేయాలంటే పది రోజులు వర్షం కురవకుండా ఎండ కాయూలని అన్నారు. ఎమ్మెల్యే ఆనందరావు కలగజేసుకుని కూనవరం, రామేశ్వరం మొగల మధ్య పూడికను డ్రెడ్జింగ్ చేస్తే ముంపు సమస్య తగ్గుతుందన్నారు. -
క్రాప్ హాలిడే దిశగా కోనసీమ రైతులు:నాగిరెడ్డి
రాజమండ్రి: కోనసీమ రైతులు క్రాప్ హాలిడే దిశగా ఆలోచిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ పంట కాల్వల వ్యవస్థ సక్రమంగా లేకపోవడమే కారణమన్నారు. కోనసీమ రైతాంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతామని నాగిరెడ్డి తెలిపారు. -
క్రాప్ హాలీడే ప్రకటించడంలో తప్పేంలేదు
-
క్రాప్ హాలిడేలో తప్పు లేదు
సాక్షి, విశాఖపట్నం: ‘‘వర్షాల్లేవు.. ప్రాజెక్టుల్లో చాలినంత నీళ్లు లేవు.. రైతులు పంటలు వేస్తే లాభంలేదని భావించి స్వచ్ఛందంగా క్రాప్‌హాలిడే ప్రకటిస్తున్నారు. నీళ్లు లేవు.. వారు మాత్రం ఏం చేస్తారు. వారు చేస్తున్న దాంట్లో తప్పేమీలేదు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఆదివారమిక్కడ విశాఖ కలెక్టరేట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. కరువును సమర్థంగా ఎదుర్కొంటామని ఆయన చెప్పారు. ‘‘గతంలో ఎన్నడూలేని విధంగా రాష్ర్టంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై అన్నివిధాలా మానిటరింగ్ చేస్తున్నాం.. ఉన్న పంటల్ని కాపాడేందుకు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. చరిత్రలో తొలిసారిగా పంటల్ని కాపాడేందుకు ట్యాంకర్లద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం. ముఖ్యంగా రెండు మూడు తడులు పెడితే పంట చేతికొచ్చే పండ్ల తోటల్ని కాపాడేందుకు చర్యలు చేపట్టాం. అలాగే పశువుల ఆహారభద్రతకు ప్రత్యేకంగా రూ.250 కోట్లు కేటాయించాం. తాగునీటికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం’’ అని అన్నారు. నీళ్లు లేకపోవడంతో పంటలు వేసుకునేందుకు రైతులు ముందుకు రావట్లేదని, వారికోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు. ‘మీ ఇంటికి-మీ భూమి’ తొలివిడత పూర్తయిందని.. వచ్చిన అర్జీల్ని మూడుదఫాలుగా పరిశీలిస్తారని తెలిపారు. రికార్డులు తారుమారు చేయడంలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. చక్కెర ఫ్యాక్టరీల ఆధునికీకరణకు చర్యలు.. రాష్ర్టంలో చక్కెర ఫ్యాక్టరీల ఆధునికీకరణ.. అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు కొరియన్ పారిశ్రామిక ప్రతినిధులు విశాఖకు రానున్నారన్నారు. అలాగే జనవరిలో అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు విశాఖలో జరుగనుందని, దీనికి 70 దేశాలనుంచి ప్రతినిధులు హాజరు కాబోతున్నారని తెలిపారు. విశాఖ మెట్రో ప్రాజెక్టు ఫైనలైజ్ అయ్యిందని. శ్రీధరన్ కమిటీ తుది రిపోర్టు ఇవ్వనున్నారని. 2018లోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కసరత్తు జరుగుతోందని చెప్పారు. తెలంగాణలో రుణ మాఫీ పేరిట రూ.వెయ్యికోట్ల అవకతవకలు జరిగినట్టు ఆ రాష్ర్టమంత్రి ప్రకటించారని, కానీ మనరాష్ర్టంలో అర్హులైన ప్రతిఒక్కరికీ మాఫీ అయ్యేలా మూడువిడతల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేశామని చెప్పుకొచ్చారు. -
క్రాప్ హాలిడే ఆయన పుణ్యమే
కరువు కారణంగా రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నా, మరణించిన రైతు కుటుంబాలకు దమ్మిడీ సాయం కూడా అందడం లేదని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. వరి రైతులు దాదాపు 50 శాతం వరకు క్రాప్ హాలిడే ప్రకటించారని, అందుకు ప్రకృతి ఒక కారణమైతే మరోవైపు చంద్రబాబు నాయుడు పుణ్యం కూడా ఉందని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నాలుగో రోజైన గురువారం నాడు కరువు, రైతు ఆత్మహత్యలు తదితర అంశాలపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. జగన్ మోహన్ రెడ్డి పూర్తి ప్రసంగం వీడియో ఇక్కడ చూడండి... -
నీరు ఇవ్వలేం
‘శ్రీరాంసాగర్’ ఆయకట్టులో వరికి సెలవే రైతులకు అవగాహన కల్పిస్తున్నాం చిన్న కాల్వలను ఆధునికీకరిస్తాం ఎస్సారెస్పీ ఎస్ఈ సుధాకర్‌రెడ్డి ‘ఈ ఖరీఫ్‌లో శ్రీరాంసాగర్ ఆయకట్టుకు కాల్వల ద్వారా నీటి విడుదల సాధ్యం కాదు. ప్రాజెక్టులోకి ఇప్పుడు చుక్క ఇన్‌ఫ్లో లేదు. ఆగస్టు నెలపై చాలా ఆశలు పెట్టుకున్నాం. కానీ.. వరుణుడు కరుణించడం లేదు. ఈ నేపథ్యంలో జిల్లాకు సాగునీరు ఇవ్వలేం. ఆయకట్టు రైతులు ఈ ఖరీఫ్‌లో క్రాప్‌హాలిడే ఇవ్వాల్సిందే.’ అని ఎస్సారెస్పీ ఎస్ఈ సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం కూడా ఖరీఫ్ ప్రణాళిక అడగలేదని, ఖరీఫ్‌లో కాల్వ నీటిపై రైతులు ఆశలు పెట్టుకోవద్దని తేల్చిచెప్పారు. హన్మకొండ : ‘శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 23.3 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ప్రాజెక్టులో కనీసం 70 టీఎంసీలు ఉంటేనే సాగునీరు విడుదల చేస్తాం. మహారాష్ట్ర ఎగువన వర్షాలు లేకపోవడంతో ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి నీరు రావడం లేదు. ఈ పరిస్థితిలో జిల్లాకు సాగునీరు ఇవ్వలేం’ అని ఎస్సారెస్పీ ఎస్ఈ సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఎస్సారెస్పీ ఆయకట్టు సాగుపై ‘సాక్షి’ మంగళవారం నిర్వహించిన ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే... జిల్లాలో ఎస్సారెస్పీ కాల్వల కింద 4.24 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కాల్వలు కొంత అధ్వానంగా ఉండడంతో ప్రతి సీజన్లో 3 లక్షల ఎకరాల వరకు నీటిని సరఫరా చేయగలుగుతున్నాం. గత రబీ సీజన్లో తొమ్మిది విడతలుగా వారబందీ ప్రకారం నీటిని ఇచ్చాం. కానీ, ఇప్పుడు ప్రాజెక్టులో నీటి సామర్థ్యం లేదు. ఎల్ఎండీలో 9.1 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. జిల్లాలోని కాల్వల కింద ఆయకట్టుకు నీటిని అందించాలంటే సరాసరి 35 టీఎంసీల నీరు అవసరం పడుతోంది. ఇప్పుడున్న వర్షాభావ పరిస్థితుల్లో నీటిని అందించడం సాధ్యం కాదు. తాగునీటి అవసరాల దృష్ట్యా ఎల్ఎండీ నుంచి మరో 2 టీఎంసీలు ఇస్తామని ప్రాజెక్టు అధికారులు ఇప్పటికే సూచించారు. గోదావరి ప్రవహిస్తుండటంతో ఇప్పటికిప్పుడు ఎస్సారెస్పీ నీటిని నిల్వ చేసి, దేవాదుల ద్వారా ధర్మసాగర్ రిజర్వాయర్, వడ్డేపల్లి చెరువులలో నీటిని నింపుతున్నాం. వీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగిస్తాం. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో లేకపోవడంతో ఖరీఫ్‌లో ఆయకట్టుకు సాగునీటిని అందించలేం. అయితే ఇప్పటికే చాలా మంది ఆయకట్టుదారులు నాట్లు వేశారు. కానీ, ముందు నుంచీ రైతులకు చెబుతూనే ఉన్నాం. ప్రత్యేక నోటీసులిచ్చాం. వరి పంటలు వేస్తే నష్టపోతారని. ఆగస్టులో వర్షాలు కురుస్తాయని చూశాం. మహారాష్ట్రలో ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు వరద వచ్చే దిగువ ప్రాంతాల్లో వర్షపాతం లేదు. దీంతో ప్రస్తుతం ఒక్క చుక్క ఇన్‌ఫ్లో కూడా లేదు. దీంతో ఈసారి ఖరీఫ్‌కు కాల్వల ఆయకట్టుకు నీరివ్వలేం. 4.24 లక్షల ఎకరాల్లో క్రాప్‌హాలిడే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నీరందించే 4.24 లక్షల ఎకరాలు ఈసారి క్రాప్‌హాలిడే పాటించాల్సిందే. లేకుంటే ఒక్క ఎకరాకు కూడా నీరివ్వలేం. ఆగస్టు దాటి ఎంతో కొంత వర్షాలు కురిస్తే.. ఆరుతడి పంటలకు రెండు, మూడో తడుల నీరిచ్చే అవకాశం ఉంది. వాటిపై కూడా ఆశలు పెట్టుకోవద్దు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూ స్తూ ఆయకట్టులో పంటలు వేయొద్దు. నీరిచ్చే అవకాశం లేనందువల్ల రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ప్రస్తుతం కాల్వ నీరు విడుదల చేసే అవకాశం లేకపోవడంతో కాల్వల ఆధునీకరణ పనులు చేస్తున్నాం. ప్రధాన కాల్వ, ఉప కాల్వల మరమ్మతు పనులు చేయాలని ఆదేశాలిచ్చాం. ప్రస్తుతం డీబీఎం-48లో పనులు జరుగుతున్నాయి. స్టేజ్-1లోని ఆయా ప్రధాన కాల్వలతోపాటు చిన్న కాల్వలు, ఉప కాల్వలను ఆధునీకరిస్తాం. కొన్నిచోట్ల చాలా మట్టి పేరుకుపోయింది. వాటిని మరమ్మతులు చేస్తాం. -
ఆ 70 కోట్లు ఎవరివి చిరంజీవీ..?
2009లో చిరంజీవి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని ఊరూరా ప్రచారం చేసి తిరిగి అదే పార్టీలో కలిసిపోయారు. 2011లో రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తే అతివృష్టితో, అనావృష్టితో రైతులంతా ఇబ్బందులు పడుతుంటే రైతు సమస్యల మీద వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలంతా కలిసి ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఈ సమయంలో చిరంజీవి సహకారంతోనే కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం నిలబడింది. అందుకు ప్రతిఫలంగా చిరంజీవి మంత్రి పదవి పుచ్చుకుంది వాస్తవం అవునా కాదా? ఆరోజే కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పడిపోయి ఉంటే విభజన ఆగిపోయేది వాస్తవం కాదా? చిరంజీవి సొంతవారింట్లో రూ.70 కోట్లు దొరికాయి. ప్రజల ముందుకు వచ్చి చిరంజీవి ఏమైనా సమాధానం చెప్పారా? ప్రజారాజ్యం పార్టీకి ఓట్లు వేసిన 70 లక్షల మంది అభిమానాన్ని వెలకట్టి అమ్ముకుంటే రూ. 70 కోట్లు వచ్చి చిరంజీవిగారి ఇంట్లో చేరాయా? ఈ చిరంజీవి జగన్ అవినీతి గురించి మాట్లాడుతారా? ఏ ఆధారం చూపకుండానే 16 నెలలు జగన్మోహన్రెడ్డిని జైలులో పెట్టింది సీబీఐ. మరి చిరంజీవి సొంత వారింట్లో రూ. 70 కోట్లు సీబీఐ కంటికి కనిపించలేదా? చిరంజీవి మీద ఎందుకు విచారణ జరుపలేదు? ఆయన్నెందుకు జైలులో పెట్టలేదు? చిరంజీవేదో పెద్ద ఉత్తముడైనట్లు జగన్మోహన్రెడ్డి అవినీతిపరుడని నిందలు వేస్తున్నారు. చిరంజీవికి చట్టసభల్లో మాట్లాడే అవకాశం వస్తే ఈయన తన మంత్రి పదవి ఎక్కడ ఊడిపోతుందో అన్నట్లు సోనియాగాంధీని పల్లెత్తు మాటంటే ఒట్టు. ఆమెను అంటే ఏం పాపం చుట్టుకుంటుందో అన్నట్లు, ఈయన భక్తిని తెలుగు తల్లికి కాకుండా ఇటలీ తల్లికి చాటుకున్నాడు. ఇంత అడ్డగోలుగా కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని విభజించిన తరువాత కూడా చిరంజీవి కాంగ్రెస్‌లో ఉంటూ అదే పార్టీలో కొనసాగుతున్నారు. వారిచ్చిన పదవులు అనుభవిస్తున్నారు. ఈయన సీమాంధ్రలో అడుగు పెడితే, ఓట్లు అడిగితే ప్రజలంతా కాలర్ పట్టుకుని నిలదీయాల్సిన అవసరం ఉంది. -
ఇలా అయితే మళ్లీ క్రాప్ హాలిడేనే!
కారంచేడు, న్యూస్‌లైన్: సరికొత్త విధానాలతో శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేస్తూ కారంచేడుకు జిల్లా ధాన్యాగారంగా పేరు తీసుకొచ్చిన ఆ ప్రాంత రైతులు ప్రస్తుతం వ్యవసాయమంటే హడలిపోతున్నారు. ప్రతి ఏటా ప్రకృతి కన్నెర్రజేయడం.. పంటలు నీటిపాలవడం లేదా ఎండిపోవడం సాధారణంగా మారింది. గిట్టుబాటు ధరలు మృగ్యమయ్యాయి. దీంతో వ్యవసాయానికి ప్రత్యామ్నాయ మార్గాలవైపు చూస్తున్న రైతుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. దీనికి తోడు కొమ్మమూరు, రొంపేరు కాలువలు ఆధునికీకరణకు నోచుకోకపోవడం అతి పెద్ద సమస్యగా మారింది. గతంలో సంభవించిన ఓగ్ని తుఫాను వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కారంచేడులో పర్యటించి ఆ రెండు కాలువల వల్లే పంటలకు అధికంగా నష్టం కలుగుతున్నట్లు గుర్తించారు. వాటిని అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించారు. కానీ నేటి పాలకుల నిర్లక్ష్యం వల్ల పాత కథే పునరావృతమవుతోంది. నాటి గిట్టుబాటు ధరలు ఏవీ.. వైఎస్ హయాంలో రైతులంతా ఆత్మతృప్తి చెందేవారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. అప్పట్లో క్వింటా ధాన్యం రూ. 1450 వరకు పలకడం రికార్డుగా ఉండేది. ఆయన తదనంతరం రైతుల గురించి పట్టించుకొనేవారు లేకపోవడంతో కారంచేడు ప్రాంతంలో పండిన ధాన్యం ఇళ్లకే పరిమితమైంది. 2008-09, 2009-10, 2010-11 సంవత్సరాల్లో గ్రామం నిండా నిండిన పురులే దర్శనమిచ్చాయి. ఈ నేపథ్యంలో రైతులు రోడ్లు ఎక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే కానీ ఎంతోకొంత ధరకు ధాన్యం అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. 2011-12 సంవత్సరంలో అయితే నీరు లేక.. పాలకుల నుంచి ఎలాంటి హామీ లేక రాష్ట్రం మొత్తం మీద మొదటిసారిగా ఈ ప్రాంత రైతులు ‘క్రాప్‌హాలిడే’ ప్రకటించాల్సి వ చ్చింది. దీంతో వేల ఎకరాలు బీడు భూములుగా మారాయి. ఈ ఏడాదైనా తమ జీవి తాలు మారతాయనుకుంటున్న తరుణంలో బంగాళాఖాతం రూపంలో దురదృష్టం మళ్లీ తలుపు తట్టింది. చాలా కాలం నుంచి ధాన్యం తడవకుండా ఇంటికి వచ్చిన సందర్భాలే తక్కువని అన్నదాతలు వాపోతున్నారు. తుఫానులు లేదా వరదలు లేదా అకాల వర్షాల వంటి కారణాలు రైతు కంటిమీద కునుకులేకుండా చేయడం పరిపాటిగా మారింది. వ్యవసాయం లాటరీగా మారిన నేపథ్యంలో పెట్టుబడులన్నీ ఆవిరైపోవడం.. అప్పులు పెరగడం సాధారణమైంది. ఇంకా నీటిలోనే.. కారంచేడు గ్రామానికి ఉత్తరం, దక్షిణం, కుంకలమర్రు తూర్పు ప్రాంతాల్లో విస్తరించి ఉన్న సుమారు 5 వేల ఎకరాలు ఇంకా వరద నీటిలోనే నానుతున్నాయి. వారానికి పైగా ఇలాంటి పరిస్థితే ఉండడంతో ఏం చేయాలో తెలియక రైతులు సతమతమవుతున్నారు. పర్చూరు వాగుకు ఎగువన, స్వర్ణ, రంగప్పనాయుడువారిపాలెం ప్రాంతాల్లో పొలాలు కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి.