ఆ 70 కోట్లు ఎవరివి చిరంజీవీ..?
2009లో చిరంజీవి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని ఊరూరా ప్రచారం చేసి తిరిగి అదే పార్టీలో కలిసిపోయారు. 2011లో రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తే అతివృష్టితో, అనావృష్టితో రైతులంతా ఇబ్బందులు పడుతుంటే రైతు సమస్యల మీద వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలంతా కలిసి ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఈ సమయంలో చిరంజీవి సహకారంతోనే కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం నిలబడింది. అందుకు ప్రతిఫలంగా చిరంజీవి మంత్రి పదవి పుచ్చుకుంది వాస్తవం అవునా కాదా? ఆరోజే కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పడిపోయి ఉంటే విభజన ఆగిపోయేది వాస్తవం కాదా?
చిరంజీవి సొంతవారింట్లో రూ.70 కోట్లు దొరికాయి. ప్రజల ముందుకు వచ్చి చిరంజీవి ఏమైనా సమాధానం చెప్పారా? ప్రజారాజ్యం పార్టీకి ఓట్లు వేసిన 70 లక్షల మంది అభిమానాన్ని వెలకట్టి అమ్ముకుంటే రూ. 70 కోట్లు వచ్చి చిరంజీవిగారి ఇంట్లో చేరాయా? ఈ చిరంజీవి జగన్ అవినీతి గురించి మాట్లాడుతారా? ఏ ఆధారం చూపకుండానే 16 నెలలు జగన్‌మోహన్‌రెడ్డిని జైలులో పెట్టింది సీబీఐ. మరి చిరంజీవి సొంత వారింట్లో రూ. 70 కోట్లు సీబీఐ కంటికి కనిపించలేదా? చిరంజీవి మీద ఎందుకు విచారణ జరుపలేదు? ఆయన్నెందుకు జైలులో పెట్టలేదు?
చిరంజీవేదో పెద్ద ఉత్తముడైనట్లు జగన్‌మోహన్‌రెడ్డి అవినీతిపరుడని నిందలు వేస్తున్నారు. చిరంజీవికి చట్టసభల్లో మాట్లాడే అవకాశం వస్తే ఈయన తన మంత్రి పదవి ఎక్కడ ఊడిపోతుందో అన్నట్లు సోనియాగాంధీని పల్లెత్తు మాటంటే ఒట్టు. ఆమెను అంటే ఏం పాపం చుట్టుకుంటుందో అన్నట్లు, ఈయన భక్తిని తెలుగు తల్లికి కాకుండా ఇటలీ తల్లికి చాటుకున్నాడు.
ఇంత అడ్డగోలుగా కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని విభజించిన తరువాత కూడా చిరంజీవి కాంగ్రెస్‌లో ఉంటూ అదే పార్టీలో కొనసాగుతున్నారు. వారిచ్చిన పదవులు అనుభవిస్తున్నారు. ఈయన సీమాంధ్రలో అడుగు పెడితే, ఓట్లు అడిగితే ప్రజలంతా కాలర్ పట్టుకుని నిలదీయాల్సిన అవసరం ఉంది.