చిరుకు జగ్గారెడ్డి చురకలు | Congress Jagga Reddy Slams Actor Chiranjeevi Over Farmers Issue | Sakshi
Sakshi News home page

రైతుల పేరుతో సినిమా తీసి.. చిరుకు జగ్గారెడ్డి చురకలు

Published Fri, Jul 19 2024 3:54 PM | Last Updated on Fri, Jul 19 2024 4:17 PM

Congress Jagga Reddy Slams Actor Chiranjeevi Over Farmers Issue

రుణమాఫీపై మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి

షాక్‌తో బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలకు నిద్ర పట్టలేదంటూ సెటైర్లు

పనిలో పనిగా నటుడు చిరంజీవికి చురకలు అంటించిన టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

హాట్‌ టాపిక్‌గా చిరుపై జగ్గారెడ్డి వ్యాఖ్యలు

హైదరాబాద్‌, సాక్షి: రైతులకు నష్టం జరుగుతుందని సినిమాలు చిరంజీవి... ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతులకు ఎందుకు మద్దతు ఇవ్వలేకపోతున్నాడని ప్రశ్నించారు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి. రుణమాఫీ హామీ నెరవేర్చిన తరుణంలో ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌పై, అలాగే నటుడు చిరంజీవిపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు.   

‘‘తెలంగాణలో రుణమాఫీ పైసలతో ఫోన్లు అన్ని టింగు టింగుమంటుంన్నాయి. ఆగస్టు 15 లోపు 2 లక్షల మాఫీ అయిపోతుంది. దీనికి సాక్ష్యం రైతులే. ఫోన్ లలో మెసేజ్ లు చూసి రైతు ల ఇళ్ళలో సంబరాలు జరుగుతున్నాయి. కానీ, బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు గత రాత్రి నిద్రలేదు. కేటీఆర్ ట్విట్టర్ కే పనికొస్తడు.. పనికి పనికిరాడు. మా ప్రభుత్వానికి ఇంకా నాలుగున్నర సంవత్సరాల టైం ఉన్నా.. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఇచ్చిన హామీ నెరవేర్చాం.

.. ఇప్పటిదాకా బీజేపీ ఎన్నివేల కోట్ల రైతు రుణమాఫీ చేసింది? దీనికి బండి సంజయ్ సమాధానం చెప్పాలి. నీరవ్ మోదీ, లలిత్ మోదీ లాంటోళ్లకు రూ.16 లక్షల కోట్లు బీజేపీ మాఫీ చేసింది. కానీ, ఒక్క రైతుకైనా చేసిందా?. గతంలో.. దేశం మొత్తం 71 వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌కే చెల్లింది. 

.. రైతులకు నష్టం జరుగుతుందని సినిమా తీసిన మెగాస్టార్ చిరంజీవి.. ఢిల్లీలో ధర్నా చేసిన వారికి ఎందుకు మద్దతు ఇవ్వలేదు?. పవన్ కల్యాణ్‌కు, బీజేపీ వాళ్లకే ఎందుకు మద్దతు ఇస్తున్నారు. సినిమాలతో కోట్లు సంపాదిస్తున్న మీరు(చిరును ఉద్దేశించి..) రైతుల కష్టాలను ఎందుకు పట్టించుకోవడం లేదు?. రైతుల పేరుతో సినిమా తీసి డబ్బులు సంపాదించి, మోదీకి మద్దతు ఇస్తున్నారు!. రైతులకు మద్దతుగా నిలిచిన రాహుల్‌కు ఎందుకు సపోర్ట్‌ ఇవ్వలేదు. కాంగ్రెస్‌లో ఉంటే చిరంజీవి సరైన దారి లో ఉండేవాడు. ఇప్పుడు పక్కదారి పట్టాడు అని జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేశారు.

.. బీఆర్ఎస్ చరిత్ర అంతా అప్పులే. కేసీఆర్ గత పదేళ్ళలో రూ.7 లక్షల కోట్ల ఆప్పులు చేసి రైతులకు ఇచ్చింది 26 వేల కోట్ల రూపాయలే. కాంగ్రెస్ గత 6 నెలల్లో రైతులకు ఇచ్చింది రూ. 31 వేల కోట్లు.  తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ ఖూనీ చేసింది. అటు కేంద్రంలో బీజేపీ నల్ల చట్టాలతో రైతులను మర్డర్ చేసింది. కేంద్ర మంత్రుల కొడుకులు రైతు ల మీద నుంచి బండ్లు ఎక్కించారు అని జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement