jana patham
-
ఆ 70 కోట్లు ఎవరివి చిరంజీవీ..?
2009లో చిరంజీవి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని ఊరూరా ప్రచారం చేసి తిరిగి అదే పార్టీలో కలిసిపోయారు. 2011లో రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తే అతివృష్టితో, అనావృష్టితో రైతులంతా ఇబ్బందులు పడుతుంటే రైతు సమస్యల మీద వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలంతా కలిసి ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఈ సమయంలో చిరంజీవి సహకారంతోనే కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం నిలబడింది. అందుకు ప్రతిఫలంగా చిరంజీవి మంత్రి పదవి పుచ్చుకుంది వాస్తవం అవునా కాదా? ఆరోజే కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పడిపోయి ఉంటే విభజన ఆగిపోయేది వాస్తవం కాదా? చిరంజీవి సొంతవారింట్లో రూ.70 కోట్లు దొరికాయి. ప్రజల ముందుకు వచ్చి చిరంజీవి ఏమైనా సమాధానం చెప్పారా? ప్రజారాజ్యం పార్టీకి ఓట్లు వేసిన 70 లక్షల మంది అభిమానాన్ని వెలకట్టి అమ్ముకుంటే రూ. 70 కోట్లు వచ్చి చిరంజీవిగారి ఇంట్లో చేరాయా? ఈ చిరంజీవి జగన్ అవినీతి గురించి మాట్లాడుతారా? ఏ ఆధారం చూపకుండానే 16 నెలలు జగన్మోహన్రెడ్డిని జైలులో పెట్టింది సీబీఐ. మరి చిరంజీవి సొంత వారింట్లో రూ. 70 కోట్లు సీబీఐ కంటికి కనిపించలేదా? చిరంజీవి మీద ఎందుకు విచారణ జరుపలేదు? ఆయన్నెందుకు జైలులో పెట్టలేదు? చిరంజీవేదో పెద్ద ఉత్తముడైనట్లు జగన్మోహన్రెడ్డి అవినీతిపరుడని నిందలు వేస్తున్నారు. చిరంజీవికి చట్టసభల్లో మాట్లాడే అవకాశం వస్తే ఈయన తన మంత్రి పదవి ఎక్కడ ఊడిపోతుందో అన్నట్లు సోనియాగాంధీని పల్లెత్తు మాటంటే ఒట్టు. ఆమెను అంటే ఏం పాపం చుట్టుకుంటుందో అన్నట్లు, ఈయన భక్తిని తెలుగు తల్లికి కాకుండా ఇటలీ తల్లికి చాటుకున్నాడు. ఇంత అడ్డగోలుగా కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని విభజించిన తరువాత కూడా చిరంజీవి కాంగ్రెస్‌లో ఉంటూ అదే పార్టీలో కొనసాగుతున్నారు. వారిచ్చిన పదవులు అనుభవిస్తున్నారు. ఈయన సీమాంధ్రలో అడుగు పెడితే, ఓట్లు అడిగితే ప్రజలంతా కాలర్ పట్టుకుని నిలదీయాల్సిన అవసరం ఉంది. -
పేదవాడి సంక్షేమమే లక్ష్యం
జగనన్నతోనే మళ్లీ వైఎస్ సువర్ణయుగం సాధ్యం: షర్మిల గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుం దని, ప్రతి పేదవాడి సంక్షేమమే జగనన్న లక్ష్యమని జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల అన్నారు. ‘‘రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉండేదో నేను చెప్పనవసరం లేదు. ప్రతి విషయంలోనూ రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడ్డాడు రాజశేఖరరెడ్డి. రైతులకైతే పెట్టుబడులు తగ్గించి రాబడులు పెరిగేలా చేశారు. మద్దతు ధర పెంచారు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని జలయజ్ఞాన్ని కూడా తలపెట్టారు. ఏడు గంటల ఉచిత విద్యుత్ ఇస్తానని మాట ఇచ్చారు. మగాడిలాగా ఇచ్చిన మాటను నిలబెట్టుకుని చూపించారు. రైతులకు నష్టపరిహారం అయితేనేమీ, ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమీ, ఇన్సూరెన్స్ అయితేనేమీ అన్నీ అందజేశారు. ఒకసారి రైతు రుణాల మీద ఉన్న వడ్డీ నీ మాఫీ చేశారు. మరొకసారి రైతుల రుణాలన్నీ మాఫీ చేశారు’’ అని షర్మిల గుర్తుచేశారు. అలాంటి సువర్ణయుగం మళ్లీ జగన్‌తోనే సాధ్యమన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం గుంటూరు జిల్లా బేతపూడి, వెదుళ్లపల్లి బాపట్ల, పొన్నూరు, చెరుకుపల్లి, నగరంలలో జరిగిన బహిరంగ సభల్లో షర్మిల మాట్లాడారు. ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే.. ప్రతి పథకాన్నీ అద్భుతంగ అమలు చేశారు వైఎస్ రాజశేఖరరెడ్డికి ముందు చంద్రబాబు రైతులకు, మహిళలకు రూపాయి వడ్డీకి రుణాలు ఇచ్చేవారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత పావలా వడ్డీకే రుణాలు ఇస్తే బ్యాంకు ముఖాలు చూడని మహిళలు కూడా బ్యాంకుల వరకు వెళ్లి డబ్బులు తీసుకుని ఆర్థికంగా స్థిరపడే రోజులవి. వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంటుతో మన రాష్ట్రంలో లక్షల మంది పేద విద్యార్థులు ఉచితంగా ఉన్నత చదువులు చదువుకుని లక్షణంగా ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. చంద్రబాబు హయాంలో 16 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే రాజశేఖరరెడ్డి 71 లక్షల మందికి పింఛన్లు అందించారు. ఆ ఐదేళ్లలో పేదల కోసం దేశమంతా 47 లక్షల పక్కా ఇళ్లులు కడితే వైఎస్ ఒక్క మన రాష్ట్రంలోనే 48 లక్షల పక్కా ఇళ్లు కట్టించారు. ఆరోగ్యశ్రీతో పేదలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించారు. 108, 104, అభయహస్తం, ఉపాధి హామీ.. ఏ పథకం ప్రవేశపెట్టినా అద్భుతంగా అమలుచేసి చూపించారు. చంద్రబాబు వైఎస్ పథకాలను కాపీ కొడుతున్నారు రాజశేఖరరెడ్డి ప్రతి పథకానికీ జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత జీవం పోస్తారని మేం హామీ ఇస్తున్నాం. కానీ అలా చెప్పుకునే ధైర్యం చంద్రబాబుకు లేదు. అందుకని రాజశేఖరరెడ్డి ఏ పథకాలు అయితే చేశారో... అవే చేస్తానని చెప్పుకొంటూ తిరుగుతున్నారాయన. పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లు రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ ఇస్తే... అప్పుడేమో ఆ తీగల మీద బట్టలు ఆరేసుకోవడానికి తప్ప దేనికీ తరం కాదని హేళన చేసిన చంద్రబాబు ఇప్పుడు తాను కూడా ఉచిత విద్యుత్ ఇస్తానని చెబుతున్నాడు. రాజశేఖరరెడ్డి రుణమాఫీ చేస్తే ఇప్పుడు చంద్రబాబు చెయ్యెత్తి నేనూ రుణ మాఫీ చేస్తానంటున్నారు. నిజంగానే ఈయనకు రుణమాఫీ చేసే మనసే ఉంటే అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదంటే దానికి సమాధానం లేదు. రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ చేస్తే, ఇప్పుడు తాను కూడా ఉచితంగా వైద్యం చేస్తానని చెబుతున్నాడు చంద్రబాబు. రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తే ఇప్పుడు తాను కూడా ఉచిత విద్యనందిస్తానని చెబుతున్నారు. నక్క ఎన్ని వాతలు పెట్టుకున్నా నక్క నక్కే... పులి పులే.’’ -
పన్నులతో పేదల్ని బాదేశారు
చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిలపై వైఎస్ విజయమ్మ ధ్వజం కర్నూలు: టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తమ హయాంలలో పన్నులు అమాంతం పెంచి పేద, సామాన్య, మధ్య తరగతి కుటుంబాల జీవితాలతో చెలగాటమాడారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాబు హయాంలో 8 సార్లు, కిరణ్ హయాంలో 4 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని, వీటితోపాటు ఆర్టీసీ, నీటి పన్నులు, మున్సిపాలిటీ పన్నులు, గ్యాస్, పెట్రో ల్, డీజిల్, కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై భారం వేశారన్నారు. రూ.32 వేల కోట్ల కరెంట్ చార్జీల భారాన్ని ప్రజలపై మోపిన కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ప్రతిపక్షాలన్నీ అవిశ్వాసం పెడితే చంద్రబాబు విప్ జారీచేసి మరీ కాపాడారన్నారు. ఇప్పుడు విద్యుత్ చార్జీల పేరుతో మరో రూ.5,600 కోట్ల భారం వేయబోతున్నారని నిప్పులు చెరిగారు. ‘‘ప్రజల గుండెల్లో వైఎస్సార్ ఉన్నారు. ఆయన పాలన సువర్ణ యుగం. అలాంటి పాలన జగన్‌బాబుతోనే మళ్లీ సాధ్యమవుతుంది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుని జగన్‌బాబును సీఎంను చేద్దాం’’ అని విజయమ్మ కోరారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తన ఐదేళ్ల పాలనలో పైసా పన్ను, చార్జీలు పెంచకుండా రికార్డు ముఖ్యమంత్రిగా నిలిచారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ విజయమ్మ చేపట్టిన పర్యటన కర్నూలు జిల్లాలో నాలుగో రోజు ఆదివారం కొనసాగింది. విజయమ్మ డోన్, గూడూరు, ఎమ్మిగనూరు, ఆదోనిలలో రోడ్ షో, బహిరంగ సమావేశాలు నిర్వహించారు. అడుగడుగునా ప్రజలు విజయమ్మకు ఎదురొచ్చి ఘనస్వాగతం పలికారు. ప్రజలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో రోడ్లన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. పాల్గొన్న నేతలు.. కార్యక్రమంలో నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త బుట్టా రేణుక, మంత్రాలయం మాజీ ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి, డోన్, పత్తికొండ, కోడుమూరు నియోజకవర్గాల సమన్వయకర్తలు బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, కోట్ల హరిచక్రపాణిరెడ్డి, మణిగాంధీ, ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాదరెడ్డి, ఎర్రకోట జగన్మోహన్రెడ్డి, కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. పార్టీలోకి మసాల ఈరన్న ఆలూరు మాజీ ఎమ్మెల్యే మసాల ఈరన్న ఎమ్మిగనూరులో విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరారు. ఈయనతో పాటు పార్టీలో చేరిన పలువురు మున్సిపల్ మాజీ చైర్మన్లు, మాజీ సర్పంచ్‌లతోపాటు వెయ్యి మందికి విజయమ్మ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
చంద్రబాబు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు
ఆయనో అబద్ధాల వీరుడు నమ్మి గెలిపిస్తే రాష్ర్టం మరింత సంక్షోభం కరెంటు బిల్లులు చెల్లించలేదని రైతులపై కేసులు పెట్టించారు రోడ్‌షోలో అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ధ్వజం కళ్యాణదుర్గం రూరల్, న్యూస్‌లైన్ : తెలుగుదేశం అధినేత చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. ‘జన పథం’ పేరిట వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మంగళవారం కళ్యాణదుర్గంలోని టీ సర్కిల్లో నిర్వహించిన రోడ్‌షోలో ఎంపీ మాట్లాడారు. రాష్ర్ట విభజనకు టీడీపీ అధినేత పూర్తిగా సహకరించారని విరుచుకుపడ్డారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ అనేక పోరాటాలు చేసిందన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో విద్యుత్ బిల్లులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న రైతులపై కేసులు బనాయించారన్నారు. చివరికి మహిళలు మంగళసూత్రాలను తాకట్టుపెట్టి బకాయిలు చెల్లించాల్సి వచ్చిందన్నారు. అప్పుల బాధతో రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం నష్ట పరిహారం కూడా ఇవ్వక పోవడం శోచనీయమన్నారు. 1994 నుంచి 2004 వరకు చంద్రబాబు అడుగడుగునా ప్రజలను మోసం చేశారన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ ఇస్తానని ప్రకటిస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాలని ఎద్దేవా చేశారన్నాన్నారు. అయితే 2004లో వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక తొలి సంతకం ఉచిత విద్యుత్ ఫైలుపై చేసి.. ఇచ్చిన మాట నెరవేర్చుకున్నారని కొనియాడారు. టీడీపీ పాలనలో శాశ్వత అభివృద్ధి పనులు ఎక్కడా జరగలేదన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు నాలుగు సార్లు భూమి పూజ చేసి గాలికి వదిలేసింది వాస్తవం కాదా అని నిలదీశారు. వైఎస్ అధికారంలోకి రాగానే రాష్ర్టంలో ఊహించలేని అభివృద్ధి జరిగిందన్నారు. చంద్రబాబు అబద్ధాల వీరుడు, అధికారం కోసం ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఆయన మాటలను నమ్మి అధికారం కనుక కట్టబెడితే రాష్ర్టం మరింత సంక్షోభంలో కూరుకుపోతుందని హెచ్చరించారు. రాజకీయ నేతలకు అధికారం ముఖ్యం కాదు... ప్రజల సంక్షేమానికి పాటు పడాలని సూచించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోతున్న వైఎస్ జగన్ నాయకత్వంలో పని చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. రాబోవు ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ై వెఎస్సార్సీపీ అధికారంలోకి రావాడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం సీఈసీ సభ్యుడు ఎల్ఎం మోహన్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీని నమ్మితే ప్రజల భవిష్యత్తు అంధకారమేనన్నారు. వైఎస్ ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్తా సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్న టీడీపీ-కాంగ్రెస్‌ను తిప్పి కొట్టి వైఎస్సార్సీపీని గెలిపించాలన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త బి.తిప్పేస్వామి మాట్లాడుతూ జరగబోయే ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలిచి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి బహుమానంగా ఇద్దామన్నారు. కళ్యాణదుర్గం ప్రాంతానికి వైఎస్ విజయమ్మ రావడం మహా అదృష్టమన్నారు. రోడ్‌షోలో సీజీసీ సభ్యురాలు తోపుదుర్తి కవిత, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ రఘునాథరెడ్డి పాల్గొన్నారు. -
కొత్తపల్లికి నా గుండెల్లో చోటిస్తున్నాను:జగన్
నరసాపురం(ప.గో): వైఎస్సార్ సీపీలో చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడికి పార్టీలోనే కాదు.. తన గుండెల్లో చోటిస్తున్నానని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచార సభలో భాగంగా నరసాపురం విచ్చేసిన జగన్ సమక్షంలో కొత్తపల్లి సుబ్బారాయుడు వైఎస్సార్ సీపీలో చేరారు. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. కొత్తపల్లికి తనపార్టీలోనే కాదు..గుండెల్లో చోటిస్తున్నానని స్సష్టం చేశారు. ఇదంతా ఎన్నికల సీజన్ అయిన కారణంగా రకరకాల నాయకులొచ్చి..రకరకాల మాటల చెప్పి ప్రలోభ పెట్టే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు హయాంలో పింఛన్లు అందని అవ్వా, తాతలు,ఫీజులు కట్టలేక చదువులు ఆపేసిన విద్యార్థులు తనకు ఇంకా గుర్తుకువస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మాట కోసం మడమ తిప్పని వాడు, విశ్వసనీయతకు అర్థం తెలిసినవాడు, నిజాయతీ ఉన్నవాడే అసలైన నాయకుడని జగన్ తెలిపారు. ఆ విశ్వసనీయత, నిజాయితీ ఉంది కనుకే దివంగత నేత వైఎస్ఆర్ జనం గుండెల్లో ఉండిపోయారన్నారు. రూ.2 కిలో బియ్యాన్ని రూ.5 చేసిన ఘనత బాబుకే దక్కుతుందని తెలిపారు. ఒకే అబద్ధాన్ని వందసార్లు చెప్పగలిగే ఏకైకవ్యక్తిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారన్నారు.అందుకే అన్నిచోట్లా చంద్రబాబు అబద్ధాలు చెబుతూ మోసం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు వయసు 65 ఏళ్లని, ఆయనకివే చివరి ఎన్నికలని జగన్ ఎద్దేవా చేశారు. లక్షా 60వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తారని బూటకపు మాటలు చెబుతున్న బాబు అసలు మనిషేనా?అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రతి ఇంటికీ ఉద్యోగం ఇస్తారని కల్లిబొల్లి మాటలు చెబుతూ ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. రాష్ట్రంలో మూడున్నర కోట్ల ఇళ్లున్నాయని, మూడున్నర కోట్ల మందికి ఉద్యోగాలను చంద్రబాబు ఎలా ఇస్తారని జగన్ నిలదీశారు. ఆయనలాగా దొంగ హామీలను తాను ఇవ్వలేనన్నారు.కాగా ఉభయ గోదావరులను కలిపే బ్రిడ్జిను మాత్రం నిర్మిస్తానని జగన్ హామీ ఇచ్చారు.