పేదవాడి సంక్షేమమే లక్ష్యం | Benefits of climate target | Sakshi
Sakshi News home page

పేదవాడి సంక్షేమమే లక్ష్యం

Published Mon, Mar 24 2014 2:51 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

పేదవాడి సంక్షేమమే లక్ష్యం - Sakshi

పేదవాడి సంక్షేమమే లక్ష్యం

జగనన్నతోనే మళ్లీ వైఎస్ సువర్ణయుగం సాధ్యం: షర్మిల

 గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుం దని, ప్రతి పేదవాడి సంక్షేమమే జగనన్న లక్ష్యమని జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు. ‘‘రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉండేదో నేను చెప్పనవసరం లేదు. ప్రతి విషయంలోనూ రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడ్డాడు రాజశేఖరరెడ్డి. రైతులకైతే పెట్టుబడులు తగ్గించి రాబడులు పెరిగేలా చేశారు. మద్దతు ధర పెంచారు.

ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని జలయజ్ఞాన్ని కూడా తలపెట్టారు. ఏడు గంటల ఉచిత విద్యుత్ ఇస్తానని మాట ఇచ్చారు. మగాడిలాగా ఇచ్చిన మాటను నిలబెట్టుకుని చూపించారు. రైతులకు నష్టపరిహారం అయితేనేమీ, ఇన్‌పుట్ సబ్సిడీ అయితేనేమీ, ఇన్సూరెన్స్ అయితేనేమీ అన్నీ అందజేశారు. ఒకసారి రైతు రుణాల మీద ఉన్న వడ్డీ నీ మాఫీ చేశారు. మరొకసారి రైతుల రుణాలన్నీ మాఫీ చేశారు’’ అని షర్మిల గుర్తుచేశారు. అలాంటి సువర్ణయుగం మళ్లీ జగన్‌తోనే సాధ్యమన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం గుంటూరు జిల్లా బేతపూడి, వెదుళ్లపల్లి బాపట్ల, పొన్నూరు, చెరుకుపల్లి, నగరంలలో జరిగిన బహిరంగ సభల్లో షర్మిల మాట్లాడారు. ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే..

 ప్రతి పథకాన్నీ అద్భుతంగ అమలు చేశారు వైఎస్

 
రాజశేఖరరెడ్డికి ముందు చంద్రబాబు రైతులకు, మహిళలకు రూపాయి వడ్డీకి రుణాలు ఇచ్చేవారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత పావలా వడ్డీకే రుణాలు ఇస్తే బ్యాంకు ముఖాలు చూడని మహిళలు కూడా బ్యాంకుల వరకు వెళ్లి డబ్బులు తీసుకుని ఆర్థికంగా స్థిరపడే రోజులవి. వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంటుతో మన రాష్ట్రంలో లక్షల మంది పేద విద్యార్థులు ఉచితంగా ఉన్నత చదువులు చదువుకుని లక్షణంగా ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.

  చంద్రబాబు హయాంలో 16 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే రాజశేఖరరెడ్డి 71 లక్షల మందికి పింఛన్లు అందించారు. ఆ ఐదేళ్లలో పేదల కోసం దేశమంతా 47 లక్షల పక్కా ఇళ్లులు కడితే వైఎస్ ఒక్క మన రాష్ట్రంలోనే 48 లక్షల పక్కా ఇళ్లు కట్టించారు. ఆరోగ్యశ్రీతో పేదలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించారు. 108, 104, అభయహస్తం, ఉపాధి హామీ.. ఏ పథకం ప్రవేశపెట్టినా అద్భుతంగా అమలుచేసి చూపించారు.

చంద్రబాబు వైఎస్ పథకాలను  కాపీ కొడుతున్నారు

 
రాజశేఖరరెడ్డి  ప్రతి పథకానికీ జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత జీవం పోస్తారని మేం హామీ ఇస్తున్నాం. కానీ అలా చెప్పుకునే ధైర్యం చంద్రబాబుకు లేదు. అందుకని రాజశేఖరరెడ్డి ఏ పథకాలు అయితే చేశారో... అవే చేస్తానని చెప్పుకొంటూ తిరుగుతున్నారాయన.

 
పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లు రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ ఇస్తే... అప్పుడేమో ఆ తీగల మీద బట్టలు ఆరేసుకోవడానికి తప్ప దేనికీ తరం కాదని హేళన చేసిన చంద్రబాబు ఇప్పుడు తాను కూడా ఉచిత విద్యుత్ ఇస్తానని చెబుతున్నాడు.

 
రాజశేఖరరెడ్డి రుణమాఫీ చేస్తే ఇప్పుడు చంద్రబాబు చెయ్యెత్తి నేనూ రుణ మాఫీ చేస్తానంటున్నారు. నిజంగానే ఈయనకు రుణమాఫీ చేసే మనసే ఉంటే అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదంటే దానికి సమాధానం లేదు. రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ చేస్తే, ఇప్పుడు తాను కూడా ఉచితంగా వైద్యం చేస్తానని చెబుతున్నాడు చంద్రబాబు.

 
రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ చేస్తే ఇప్పుడు తాను కూడా ఉచిత విద్యనందిస్తానని చెబుతున్నారు. నక్క ఎన్ని వాతలు పెట్టుకున్నా నక్క నక్కే... పులి పులే.’’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement