కడప ఎంపీ, ఎమ్మెల్యేల ధ్వజం
కడప కార్పొరేషన్ : అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో టీడీపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని సక్రమంగా నెరవేర్చలేదని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మేయర్ కె. సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనువాసులు, పి. రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్‌బి అంజద్‌బాషా మండిపడ్డారు. అవినీతికి కేరాఫ్‌గా మారిన చంద్రబాబు ఇపుడు నీతులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. శుక్రవారం స్థానిక వైఎస్ గెస్ట్ హౌస్‌లో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆదివారం ప్రారంభించనున్న కడప ఎయిర్‌పోర్ట్‌కు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ పేరు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో నష్టపోయిన ఉద్యాన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా ఉలుకూ, పలుకూ లేదని ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనువాసులు ఆవేదన వ్యక్తం చే శారు. తమ నియోజకవర్గంలో 40 వేల ఎకరాల్లో అరటి, మామిడి, పసుపు తదితర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయన్నారు. ఈ విషయాన్ని తాను ఇప్పటికి నాలుగైదు సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయానని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హమీని కూడా నెరవేర్చలేదన్నారు. అందుకే వైఎస్ జగన్ చేపట్టిన సమరదీక్షకు అన్ని వర్గాల ప్రజలు పోటెత్తారన్నారు. వృద్దులు, వితంతువులు, వికలాంగుల పింఛన్లు అకారణంగా తొలగించారన్నారు. చంద్రబాబు పాలన బ్రిటీషు పాలనకంటే అధ్వాన్నంగా ఉందని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. పోలీసులను అడ్డుపెట్టుకొని వారు ప్రజల్లోకి వస్తున్నారని, లేకపక్షంలో ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితులున్నాయన్నారు. జిల్లాలో 30 మంది టీడీపీ నాయకులు ఇసుక మాఫియాగా ఏర్పడి కోట్లు గడించారని ఆరోపించారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఎమ్మెల్యేలు సిఫారసు చేసినా దిక్కులేదని మండిపడ్డారు. గతంలో వాయుదూత్‌లు మాత్రమే దిగే కడప ఎయిర్‌పోర్టుకు 1100 ఎకరాలు భూమితోపాటు రూ. 34కోట్ల నిధులు కేటాయించి వైఎస్‌ఆర్ పూర్తి చేశారన్నారు. ఎయిర్‌పోర్టు పూర్తయి, కొప్పర్తిలో స్టీల్‌ప్లాంటు ఏర్పడితే జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. దివంగత వైఎస్‌ఆర్ చలువతో కడప ఎయిర్‌పోర్టు 2012లోనే పూర్తయిందని కడప శాసన సభ్యులు ఎస్‌బి అంజద్‌బాషా తెలిపారు. రాజకీయ కారణాలతో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దీన్ని ప్రారంభించలేదన్నారు. చంద్రబాబుకు కూడా దీన్ని ప్రారంభించడానికి ఏడాది పట్టిందని విమర్శించారు. వైఎస్‌ఆర్ కల ఇప్పటికైనా నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందని, ఎయిర్‌పోర్టుకు వైఎస్‌ఆర్ పేరు పెట్టాలని డిమాండ్ చే శారు.
అవినీతికి మారుపేరు చంద్రబాబు
Published Sat, Jun 6 2015 5:45 AM | Last Updated on Thu, Aug 9 2018 5:07 PM
Advertisement
Advertisement