వైఎస్సార్‌సీపీ నేతల ధ్వజం
వైఎస్ గెస్ట్‌హౌస్(కడప కార్పొరేషన్): చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో హెరిటేజ్‌లో అమ్ముడుపోని సరుకును ప్రజలకు అంటగడుతున్నారని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ధ్వజమెత్తారు. నగరంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, నగర మేయర్ కె. సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజద్‌బాషా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి కానుక పేరుతో నాసిరకం సరుకులు పంపిణీ చేస్తున్నారన్నారు.
హెరిటేజ్‌లో అమ్ముడుపోకుండా ఉన్న నెయ్యి, డాల్డాలను ప్రజలకు ఇస్తున్నారని ఆరోపించారు. తన స్వంత సంస్థకు లాభం చేకూర్చడానికే ఈ సరుకులు ఇస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రులు వారు చేస్తున్న తప్పులను కప్పి పుచ్చుకోవడానికి వైఎస్‌ఆర్‌ను, వైఎస్ జగన్‌ను విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వం ఏర్పడి 9 మాసాలు కావొస్తున్నా జిల్లాకు ఒక్కపైసా నిధులు మంజూరు చేయలేదన్నారు. వస్తాయని భావిస్తున్న బ్రహ్మణి ఉక్కు ఫ్యాక్టరీని, డీఆర్‌డీఓ ప్రాజెక్టులను రాకుండా అడ్డుకుంటున్నారన్నారు.
ఎయిర్‌పోర్టు పనులు పూర్తయి సంవత్సరం అవుతున్నా ప్రారంభించేందుకు కూడా సీఎంకు తీరిక దొరకడం లేదన్నారు. సింగపూర్, జపాన్, మలేషియా అంటూ నెలకో దేశం తిరుగుతూ వందల కోట్ల ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారన్నారు.
జిల్లాలో తాగు, సాగునీరు లేక వర్షాలు పడక, రుణాలు మాఫీ కాక రైతులు అల్లాడుతుంటే పట్టించుకొనే నాథుడే కరువయ్యాడన్నారు. సమావేశంలో జిల్లా అధికారప్రతినిధి టీకే అఫ్జల్ ఖాన్, యువజన అధ్యక్షుడు చల్లా రాజశేఖర్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఖాజా పాల్గొన్నారు.
అవన్నీ అమ్ముడుపోని సరుకులే
Published Tue, Jan 13 2015 2:26 AM | Last Updated on Thu, Aug 16 2018 4:12 PM
Advertisement
Advertisement