కర్నూలు రూరల్: జిల్లాలో ఎక్కడైనా నాటుసారా, బెల్టు షాపులు నిర్వహిస్తే ప్రజలు సమాచారం ఇవ్వాలని, వెంటనే స్పందించి నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జాయింట్‌కలెక్టర్ కె.కన్నబాబు అన్నారు. సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో జేసీ బాధితుల సమస్యలను ఆలకించారు. జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలపై వివిధ పత్రికల్లో వచ్చే కథనాలకు ఆయా శాఖల అధికారులు స్పందించాలని జేసీ అధికారులను ఆదేశించారు. ఏజేసీ అశోక్‌కుమార్, డీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి, డ్వామా పీడీ హరినాథరెడ్డి పాల్గొన్నారు.
బాధితుల ఫిర్యాదు చేసిన సమస్యల్లో కొన్ని: మద్దికెర మండల కేంద్రంలో ఉన్న మెయిన్ రోడ్డులో ఉన్న జడ్పీ హైస్కూల్ రోడ్డుకు సమీపంలో ఉందని, రోడ్డుకి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, అలాగే ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర వికలాంగుల కోసం ర్యాంపులు ఏర్పాటు చేయాలని మద్దికెరకు చెందిన చంద్ర ఫిర్యాదు చేశారు.
కోవెలకుంట్ల మండలం సోదరదిన్నెలో విచ్చలవిడిగా నాటుసారా స్థావరాలు, బెల్టు షాపులు ఉన్నాయని, దీనివల్ల గ్రామంలో మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఆ గ్రామ మహిళలు ఫిర్యాదు చేశారు.
డోన్ మండలం ఎద్దుపెంట గ్రామంలో పంచాయతీ అధికారులు సక్రమంగా పట్టించుకోకపోవడం వల్ల పారిశుద్ధ్యం లోపించిందని, సాక్షర భారత్ కేంద్రంలో ఎలాంటి చదువు చెప్పడం లేదని, గ్రామంలో చాలా ఏళ్ల క్రితం ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం నిర్మించినా ప్రయోజనం లేకుండాపోయిందని స్థానికులు జేసీకి విన్నవించారు.
ఎమ్మిగనూరులోని 16వ వార్డు ఎస్సీ కాలనీలో ఇంతవరకు వీధి దీపాలు ఏర్పాట చేయలేదని వార్డువాసులు ఫిర్యాదు చేశారు.
బెల్టు షాపులు నిర్వహిస్తే డయల్ యువర్
Published Tue, Jul 22 2014 1:38 AM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM
Advertisement
Advertisement