k.kannababu
-
పురపాలక శాఖ డెరైక్టర్‌గా కన్నబాబు
హైదరాబాద్: గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్‌గా పనిచేస్తున్న కె. కన్నబాబు పురపాలక శాఖ డెరైక్టర్‌గా బదిలీ అయ్యారు. ప్రస్తుతం డెరైక్టర్‌గా ఉన్న జి.వాణీమోహన్‌కు పోస్టింగ్ ఇవ్వలేదు. తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని వాణీమోహన్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
బెల్టు షాపులు నిర్వహిస్తే డయల్ యువర్
కర్నూలు రూరల్: జిల్లాలో ఎక్కడైనా నాటుసారా, బెల్టు షాపులు నిర్వహిస్తే ప్రజలు సమాచారం ఇవ్వాలని, వెంటనే స్పందించి నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జాయింట్‌కలెక్టర్ కె.కన్నబాబు అన్నారు. సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో జేసీ బాధితుల సమస్యలను ఆలకించారు. జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలపై వివిధ పత్రికల్లో వచ్చే కథనాలకు ఆయా శాఖల అధికారులు స్పందించాలని జేసీ అధికారులను ఆదేశించారు. ఏజేసీ అశోక్‌కుమార్, డీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి, డ్వామా పీడీ హరినాథరెడ్డి పాల్గొన్నారు. బాధితుల ఫిర్యాదు చేసిన సమస్యల్లో కొన్ని: మద్దికెర మండల కేంద్రంలో ఉన్న మెయిన్ రోడ్డులో ఉన్న జడ్పీ హైస్కూల్ రోడ్డుకు సమీపంలో ఉందని, రోడ్డుకి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, అలాగే ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర వికలాంగుల కోసం ర్యాంపులు ఏర్పాటు చేయాలని మద్దికెరకు చెందిన చంద్ర ఫిర్యాదు చేశారు. కోవెలకుంట్ల మండలం సోదరదిన్నెలో విచ్చలవిడిగా నాటుసారా స్థావరాలు, బెల్టు షాపులు ఉన్నాయని, దీనివల్ల గ్రామంలో మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఆ గ్రామ మహిళలు ఫిర్యాదు చేశారు. డోన్ మండలం ఎద్దుపెంట గ్రామంలో పంచాయతీ అధికారులు సక్రమంగా పట్టించుకోకపోవడం వల్ల పారిశుద్ధ్యం లోపించిందని, సాక్షర భారత్ కేంద్రంలో ఎలాంటి చదువు చెప్పడం లేదని, గ్రామంలో చాలా ఏళ్ల క్రితం ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం నిర్మించినా ప్రయోజనం లేకుండాపోయిందని స్థానికులు జేసీకి విన్నవించారు. ఎమ్మిగనూరులోని 16వ వార్డు ఎస్సీ కాలనీలో ఇంతవరకు వీధి దీపాలు ఏర్పాట చేయలేదని వార్డువాసులు ఫిర్యాదు చేశారు. -
మహాప్రభో..మా కష్టాలు తీర్చండి
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: అధికారుల చుట్టూ తిరిగేకంటే ఆ దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేసినా వారి సమస్యలు పరిష్కారమయ్యే ఏమో. ఒకటి..రెండు..మూడు.. ఐదు..పది.. ఇరవై.. ఇలా వందల సార్లు ప్రజాదర్బార్‌లో వినతులు ఇచ్చినా సమస్యలకు మోక్షం లభించడం లేదు. సుదూర ప్రాంతాల నుంచి తీవ్ర వ్యయ ప్రయాసలకోర్చి ప్రతి వారం కలెక్టరేట్లో జరిగే ప్రజాదర్బార్‌కు వస్తున్న బాధితులకు నిరాశే ఎదురవుతోంది. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తదితరులు వివిధ వర్గాల ప్రజలు ఇచ్చే వినతులను పైపైనే చదివి ఎండార్స్మెంట్ రాసి సంబంధిత అధికారులకు రెఫర్ చేస్తున్నారు. వారు వాటిని కింది స్థాయి అధికారులు, సిబ్బందిపై తోసేసి చేతులు దులుపుకుంటున్నారు. సమస్యలు మాత్రం పరిష్కారం కాక వివిధ వర్గాల ప్రజలు ఇటు ప్రజాదర్బార్, అటు సంబంధిత అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జరిగిన ప్రజాదర్బార్‌లో కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ కె.కన్నబాబు, డీఆర్ఓ వేణుగోపాల్ రెడ్డి వినతులు స్వీకరించి సంబంధిత అధికారులకు రెఫర్ చేశారు. హౌసింగ్ పీడీ రామసుబ్బు, డీఆర్డీఏ-ఐకేపీ పీడీ నజీర్‌సాహెబ్ తమకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు. ప్రజాదర్బార్‌లో వినతులు వెల్లువెత్తాయి. అర్జీలు ఇచ్చేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పోటీ పడ్డారు. సునయన ఆడిటోరియంలోకి వెళ్లేందుకు తోపులాట జరిగింది. ప్రజాదర్బార్‌కు వచ్చిన వినతుల్లో కొన్ని ఇలా ఉన్నాయి. -
‘మీ సేవ’లో ఆధార్ సమాచారం
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: జిల్లాలో ఆధార్ నమోదు చేయించుకున్న వారిలో 26 లక్షల మందికి యూఐడీ నెంబర్లు జనరేట్ అయ్యాయని జాయింట్ కలెక్టర్ కె.కన్నబాబు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వీటిని గ్రామం, మండలం వారీగా ఆల్ఫాబెటికల్ పద్ధతిలో ఉంచామని, వివరాలను మీసేవ కేంద్రాల నుంచి పొందవచ్చన్నారు. వీటితోపాటు ఆధార్ సమాచారం మొత్తం మీ సేవ కేంద్రాల్లో అందుబాటులో ఉందన్నారు. రూ. 25 చెల్లించి యూఐడీ నెంబర్‌తోపాటు కార్డు కూడా పొందవచ్చన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 300 ఆధార్ సెంటర్లు నడుస్తున్నాయని, ఇప్పటిదాకా నమోదు చేయించుకోని వారు వెంటనే ఏదో ఒక కేంద్రాన్ని సందర్శించి నమోదు చేయించుకోవాలన్నారు. స్కాలర్షిప్ దరఖాస్తుల పొడిగింపుపై ప్రచారం చేయండి స్కాలర్షిప్ దరఖాస్తు గడువును నవంబర్ 30వతేదీ నుంచి డిసెంబర్ 10 వరకు పొడిగించామని, ఈ విషయంపై ప్రచారం చేసి విద్యార్థులంతా సద్వినియోగం చేసుకునేలా చూడాలని జాయింట్ కలెక్టర్ కన్నబాబు సూచించారు. శనివారం తన ఛాంబర్లో డీబీటీపై నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడుతూ అనేకమంది యూఐడీ నెంబర్లు రాలేదనే అసంతృప్తితో ఉన్నారని, అటువంటి వారందరూ మీ సేవ సెంటర్లకు వెళ్లి కార్డులు పొందాలన్నారు. బ్యాంకు ఖాతాలను ఆధార్ నెంబర్లతో అనుసంధానం చేసి ఎల్డీఎంకు అప్పగించాలన్నారు. ఉపకార వేతనాలకు 84 వేల మంది అర్హులుగా ఉంటే ఇప్పటి వరకు 45 వేల మంది మాత్రమే ఆధార్ నమోదు చేయించుకున్నారని, మిగతా వారు వెంటనే నమోదు చేయించుకునేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శోభారాణి, బీసీ, గిరిజన సంక్షేమాధికారులు రవిచంద్ర, గిరిధర్ పాల్గొన్నారు. -
అవకాశాలను అందిపుచ్చుకోవాలి
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్ : ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకున్న వారే జీవితంలో అభివృద్ధి చెందుతారని రాష్ట్ర చిన్ననీటిపారుదల శాఖ మంత్రి టి.జి.వెంకటేష్ అన్నారు. శుక్రవారం సి.క్యాంప్‌లోని లలిత కళాసమితి(టీజీవి కళాక్షేత్రం)లో డీఆర్డీఏ - మెప్మా సంయుక్తంగా రాజీవ్ యువకిరణాలు ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్‌మేళా నిర్వహించాయి. అర్హులైన వారిని ఎంపిక చేసుకునేందుకు అపోలో ఫార్మసీ, బిగ్‌సీ మొబైల్, లెమన్ మీడియా, టాటా మోటార్స్, భారత్ మోటార్స్, గ్రూప్-4 సెక్యూరిటీ కంపెనీ మొత్తం 18 కంపెనీలు జాబ్‌మేళాలో పాల్గొన్నాయి. సూపర్వైజర్, మార్కెటింగ్ మేనేజర్, పరిపాలనాధికారులు, కాల్‌సెంటర్ ఎగ్జిక్యూటివ్, సెక్యూరిటీ గార్డులు, సెక్యూరిటీ సూపర్వైజర్ తదితర ఉద్యోగాలలోకి తీసుకునేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. దాదాపు వె య్యి మంది యువతీయువకులు పాల్గొన్నారు. కష్టించేతత్వం ఉన్నవారికి అవకాశాలు అనేకం ఉన్నాయని మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. కష్టపడకపోతే ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉంటారని, అభివృద్ధిలోకి రాలేరని తెలిపారు. రాజీవ్ యువకిరణాలు పథకం యువతకు ఉపాధి అవకాశాలను పెంచిందని పేర్కొన్నారు. భవిష్యత్‌లో కర్నూలుకు వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు పలు కంపెనీలు రానున్నాయని, అందువల్ల ఉపాధి అవకాశాలు మరింత పెరగనున్నాయని పేర్కొన్నారు. యువతీ యువకులు వృత్తినైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని పేర్కొన్నారు. రాజీవ్ యువకిరణాలు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు సూచించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ కె.కన్నబాబు ప్రసంగించారు. వికలాంగులకు సదరం ధ్రువపత్రాల పంపిణీ... కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్‌కు చెందిన 480 మంది వికలాంగులకు సదరం ధ్రువపత్రాలను మంత్రి టి.జి.వెంకటేష్, ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు, జేసీ కన్నబాబు పంపిణీ చేశారు. సదరం సర్టిఫికెట్ల వల్ల బోగస్ వికలాంగులకు అడ్డుకట్ట వేసినట్లు అయ్యిందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ నజీర్ సాహెబ్, మెప్మా పీడీ రామాంజనేయులు, మునిసిపల్ కమిషనర్ సత్యనారాయణమూర్తి, ఐకేపీ జాబ్స్ మేనేజర్ విజయకుమార్, మెప్మా లైవ్లీ ఉడ్ నిపుణుడు వెంకటేష్, డీపీఎం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
అత్యవసరమైన వారికి ప్రాధాన్యం
కర్నూలు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: నగదు బదిలీ పథకం పరిధిలోకి వచ్చే గ్యాస్ వినియోగదారులు, పింఛన్‌దారులు, విద్యార్థులకు ఆధార్ నమోదులో ప్రాధాన్యం ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ కె.కన్నబాబు సూచించారు. గ్యాస్ డీలర్లతో శనివారం జేసీ తన ఛాంబర్లో సమావేశమయ్యారు. గ్యాస్ వినియోగదారులకు జనవరి నుంచి నగదు బదిలీ పథకం అమలులోకి రానుందన్నారు. అయితే జిల్లాకు సంబంధించి 5.72 లక్షల మంది గ్యాస్ వినియోగదారుల్లో ఇప్పటి వరకు 3.40 లక్షల మంది నుంచి మాత్రమే యూఐడీ, ఈఐడీ, బ్యాంకు ఖాతాల నంబర్లు సేక రణ పూర్తయిందన్నారు. వీరిలో 1.25 లక్షల మంది ఆధార్, బ్యాంకు ఖాతాల అనుసంధానం పూర ్తయిందన్నారు. మిగతా వారి నుంచి యూఐడీ, ఈఐడీ నంబర్లు సేకరించే పనిని ముమ్మరం చేయాలని, వాటిని బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసి ఎల్డీఎంకు పంపాలని సూచించారు. ఇదంతా అక్టోబరు చివరినాటికి వందశాతం పూర్తికావాలన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఆధార్ సెంటర్లు పని చేస్తున్నాయని, నగదు బదిలీ పథకంలోకి వచ్చేవారు ఏ ప్రాంతం వారైనా వారికి ప్రాధాన్యం ఇచ్చి వారి నమోదును పూర్తి చేయించాలన్నారు. ఈ ప్రాంతం వారు కాదనో.. ఈ కేంద్రం పరిధిలోకి రారనో వెనక్కు పంపవద్దని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో డీఎస్ఓ వెంకటేశ్వర్లు, ఏఎస్ఓలు రాజా రఘువీర్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.