కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: అధికారుల చుట్టూ తిరిగేకంటే ఆ దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేసినా వారి సమస్యలు పరిష్కారమయ్యే ఏమో. ఒకటి..రెండు..మూడు.. ఐదు..పది.. ఇరవై.. ఇలా వందల సార్లు ప్రజాదర్బార్‌లో వినతులు ఇచ్చినా సమస్యలకు మోక్షం లభించడం లేదు. సుదూర ప్రాంతాల నుంచి తీవ్ర వ్యయ ప్రయాసలకోర్చి ప్రతి వారం కలెక్టరేట్‌లో జరిగే ప్రజాదర్బార్‌కు వస్తున్న బాధితులకు నిరాశే ఎదురవుతోంది.
జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తదితరులు వివిధ వర్గాల ప్రజలు ఇచ్చే వినతులను పైపైనే చదివి ఎండార్స్‌మెంట్ రాసి సంబంధిత అధికారులకు రెఫర్ చేస్తున్నారు. వారు వాటిని కింది స్థాయి అధికారులు, సిబ్బందిపై తోసేసి చేతులు దులుపుకుంటున్నారు. సమస్యలు మాత్రం పరిష్కారం కాక వివిధ వర్గాల ప్రజలు ఇటు ప్రజాదర్బార్, అటు సంబంధిత అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో జరిగిన ప్రజాదర్బార్‌లో కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ కె.కన్నబాబు, డీఆర్‌ఓ వేణుగోపాల్ రెడ్డి వినతులు స్వీకరించి సంబంధిత అధికారులకు రెఫర్ చేశారు. హౌసింగ్ పీడీ రామసుబ్బు, డీఆర్‌డీఏ-ఐకేపీ పీడీ నజీర్‌సాహెబ్ తమకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు. ప్రజాదర్బార్‌లో వినతులు వెల్లువెత్తాయి. అర్జీలు ఇచ్చేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పోటీ పడ్డారు. సునయన ఆడిటోరియంలోకి వెళ్లేందుకు తోపులాట జరిగింది. ప్రజాదర్బార్‌కు వచ్చిన వినతుల్లో కొన్ని ఇలా ఉన్నాయి.
మహాప్రభో..మా కష్టాలు తీర్చండి
Published Tue, Jan 21 2014 2:00 AM | Last Updated on Sat, Sep 2 2017 2:49 AM
Advertisement