victims protests
-
చందాదారుల ఆస్తులు కొల్లగొడుతున్న గజదొంగ రామోజీ
సాక్షి, అమరావతి: ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఓ బందిపోటు సంస్థ. పేదలు, మధ్య తరగతివర్గాల ఆస్తులు కొల్లగొడుతున్న గజదొంగ రామోజీరావు’ అని మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘం ధ్వజమెత్తింది. ‘ష్యూరిటీలు ఇచ్చినా కొర్రీలు వేస్తోంది. చిట్టీల ఉచ్చులో బిగించి మా ఆస్తులు కొల్లగొడుతోంది. ప్రైజ్‌మనీ ఇవ్వకుండా మా అనుమతి లేకుండానే రశీదు డిపాజిట్లుగా అట్టిపెట్టుకుంటోంది. గట్టిగా అడిగితే లక్షల్లో చిట్టీలు కడితే వందలు చేతిలో పెడుతోంది’ అని దుయ్యబట్టింది. ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలను ఇక సహించేది లేదు. సంఘటితంగా పోరాడతాం. సీఐడీ దర్యాప్తునకు సహకరిస్తాం. రాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటాం. రామోజీరావు అక్రమాలపై ఉమ్మడిగా న్యాయ పోరాటం చేస్తాం’ అని స్పష్టం చేసింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలకు వ్యతిరేకంగా బాధితులు బుధవారం విజయవాడలో సంఘటితమయ్యారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఈ సమావేశానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో చందాదారులు తరలివచ్చారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో చిట్టీ కట్టి మోసపోయిన విధానం, తాము పడుతున్న ఇబ్బందులు, పోగొట్టుకున్న ఆస్తులను ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘం అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ పేదలు, మధ్యతరగతివర్గాల ఆదాయ వనరులను పరిగణనలోకి తీసుకోకుండా తలకు మించి చిట్టీలు కట్టిస్తూ రామోజీరావు వారిని చిట్టీల ఊబిలోకి నెట్టివేసి, వారి ఆస్తులు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. నిబంధనల ప్రకారం ష్యూరిటీలు సమ ర్పించినవారికి కూడా చిట్టీ ప్రైజ్‌మనీ ఇవ్వకుండా అక్రమ డిపాజిట్లుగా మళ్లిస్తున్నారన్నారు. రామోజీరావు అక్రమాలతో సామాన్యులు ఆస్తులు కూడా అమ్ముకుంటున్నారని, అయినా అప్పులు తీరక మానసిక క్షోభ అనుభవిస్తున్నారని తెలిపారు. విజయవాడలో ఓ ట్యాక్సీ డ్రైవర్‌తో రూ.20 లక్షల చిట్టీ కట్టించి వేధిస్తున్నారన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ గూండాలు ఇంటిపైకి వచ్చి వేధింపులకు గురిచేయడంతో కర్నూలులో ఒకరు తీవ్ర మానసిక క్షోభతో పక్షవాతం బారిన పడ్డారని తెలిపారు. రామోజీరావు ఉద్దేశపూర్వకంగానే పేద, మధ్య తరగతి వర్గాల వారిని ఒక చిట్టీతో మొదలుపెట్టి అయిదు.., పది.., ఇరవై వరకు చిట్టీల్లో సభ్యులుగా చే ర్పించి వారు అప్పులు, వాయిదాల ఉచ్చు నుంచి బయటకు రాలేని దుస్థితి కల్పిస్తున్నారని వివరించారు. ఒక చిట్టీ ప్రైజ్‌మనీని మరో చిట్టీలోకి సర్దుబాటు చేస్తూ చందాదారులకు చేతికి మాత్రం చిల్లిగవ్వ ఇవ్వడంలేదని తెలిపారు. చందాదారులందరినీ సంఘటితం చేసేందుకే ఈ సంఘం మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులు కొన్ని వేల మంది ఉన్నారని, వారందరినీ సంఘటితం చేసేందుకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేశామని శ్రీనివాస్ చెప్పారు. కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టంలోని సెక్షన్ 22, 66 ప్రకారం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బాధితులకు న్యాయం చేసేందుకు సమష్టిగా పోరాడతామన్నారు. అందుకు సీఐడీ, రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నాయని చెప్పారు. కాల్‌మనీ రాకెట్‌ను తలదన్నేలా రామోజీ అక్రమాలు సంఘం ఉపాధ్యక్షుడు సాంబశివరావు మాట్లాడుతూ కాల్‌మనీ రాకెట్‌ను తలదన్నే రీతిలో రామోజీరావు అరాచకాలకు పాల్పడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. చందాదారుల సంతకాలను కూడా ఫోర్జరీ చేసి ఎన్నో చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చేర్పిస్తూ వారిని శాశ్వతంగా రుణగ్రస్తులుగా ఉండేట్టు కుట్ర పన్నుతున్నారన్నారు. తమ కుటుంబం రెండు చిట్టీలతో మొదలు పెడితే.. తరువాత ఏకంగా 40 చిట్టీల వరకు చేర్చించి మోసం చేశారన్నారు. రూ.80 లక్షల చిట్టీ పాట పాడితే రూ.215 మాత్రమే ఇచ్చారని, రూ.40 లక్షలు, రూ.20 లక్షలు, రూ.10 లక్షలు చిట్టీలు పాడినా ఒక్క దానికి కూడా రూ.200కు మించి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర చిట్‌ఫండ్ చట్టం చందాదారులకు కల్పిస్తున్న రక్షణ పట్ల చాలామందికి అవగాహన లేకపోవడాన్ని రామోజీరావు తన దుర్మార్గాలకు అనుకూలంగా మలచుకుంటున్నారని అన్నారు. అందుకే చందాదారుల్లో చైతన్యం తీసుకొచ్చి మార్గదర్శి చిట్‌ఫండ్స్ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేశామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులకు అండగా నిలుస్తామని చెప్పారు. – సంఘం ఉపాధ్యక్షుడు సాంబశివరావు ఇళ్లపై పడి వేధిస్తున్నారు.. ఆస్తులు గుంజుకున్నారు ‘మా సంతకాలు ఫోర్జరీ చేసి కొత్త చిట్టీ గ్రూపుల్లో చే ర్పించారు. మాకు తెలియకుండానే పాట పాడి ఆ మొత్తాన్ని అప్పుల కింద జమ చేసుకున్నామని చెప్పారు. 90 చిట్టీల్లో చే ర్పించి మమ్మల్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. అవి తీర్చడం కోసం మా ఇల్లు, స్థలాలు తీసుకున్నారు. విదేశాల్లో ఉన్న మా అమ్మాయి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి ఆమెను కూడా చందాదారుగా చే ర్పించారు. ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి ప్రైజ్‌మనీ డబ్బును వాళ్లే తీసుకున్నారు. ఇదెక్కడి అన్యాయం అని ప్రశ్నిస్తే ఇంటి మీదకు గూండాలను పంపించి తీవ్రంగా వేధిస్తున్నారు’ అని సంఘం కార్యదర్శి అన్నపూర్ణాదేవి ఆవేదనతో చెప్పారు. – సంఘం కార్యదర్శి అన్నపూర్ణాదేవి నా అనుమతి లేకుండానే నా డబ్బు డిపాజిట్ చేసేశారు నేను చిట్టీ పాడి నిబంధనల ప్రకారం నలుగురు ప్రభుత్వ ఉద్యోగులతో ష్యూరిటీలు ఇప్పించాను. అయినా ప్రైజ్‌మనీ ఇవ్వడంలేదు. నా అనుమతి లేకుండానే డిపాజిట్‌గా జమ చేసేశారు. అలా ఎందుకు చేశారు అని గట్టిగా అడిగితే భవిష్యత్ చందాల కోసం డిపాజిట్ చేశామని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. అలా ప్రతి ఆరు నెలలకు వాళ్లే డిపాజిట్లను రెన్యూవల్ చేస్తూ రెండేళ్లుగా ప్రైజ్‌మనీ ఇవ్వకుండా వేధిస్తున్నారు. నాలా వేలాదిమంది మార్గదర్శి చిట్‌ఫండ్స్ మోసాల బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. – విశ్వప్రసాద్, బాధితుడు ష్యూరిటీలు ఇచ్చినా వేధిస్తున్నారు మేము చిట్టీ పాడితే, ఆ ప్రైజ్ మనీ ఇవ్వడానికి నలుగురు ప్రభుత్వ ఉద్యోగులతో ష్యూరిటీలు కావాలని చెప్పారు. నేను నలుగురితో ష్యూరిటీలు ఇప్పించాను. అయినా చాలదు అన్నారు. ఆరుగురు.. తరువాత ఎనిమిది మంది ప్రభుత్వ ఉద్యోగులతో ష్యూరిటీలు ఇప్పించినా మా ప్రైజ్‌మనీ మాత్రం ఇవ్వలేదు. పైగా ష్యూరిటీ ఇచ్చిన వారిని వేధిస్తున్నారు. దీనిపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. న్యాయం కోసం ఈ సంఘంలో సభ్యునిగా చేరాను. – నందిగం వరప్రసాద్, హైదరాబాద్ ‘మార్గదర్శి’పై కఠిన చర్యలు తీసుకోండి హోం శాఖ, సీఐడీకి బాధితుల విజ్ఞప్తి సాక్షి, అమరావతి: చందాదారులను మోసగిస్తున్న మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ సంస్థ మోసాలకు అడ్డుకట్ట వేసి చందాదారులకు న్యాయం చేయాలని మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘం అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు వి.సాంబశివరావు, కార్యదర్శి వి.అన్నపూర్ణమ్మ, ఇతర ప్రతినిధులు హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్‌కుమార్ గుప్తా, సీఐడీ అదనపు డీజీ సంజయ్‌కు బుధవారం విడివిడిగా వినతిపత్రాలు సమ ర్పించారు. ష్యూరిటీలు సమ ర్పించినా చందాదారులను ఇబ్బంది పెడుతున్నారని వివరించారు. చందాదారుల సొమ్మును రామోజీరావు సొంత వ్యాపారాల్లో పెట్టుబడులుగా మళ్లిస్తూ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని చెప్పారు. కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టంలోని సెక్షన్లు 22, 64 ప్రకారం మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై కఠిన చర్యలు తీసుకుని చందాదారులకు అండగా నిలవాలని కోరారు. -
డీప్ ఫేక్ బారిన రష్మిక, కత్రినా..రక్షణ కోసం ఏం చేయాలంటే..!
టాలీవుడ్ నటి రష్మిక మందన్న, బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ఢీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సాంకేతికతో వస్తున్న విప్లవాత్మక మార్పులు అందిపుచ్చుకుని కొందరూ ఈ దురాగతాలకు పాల్పడుతున్నారు. ప్రముఖుల, సెలబ్రెటీలనే గాక సాధారణ మహిళలు సైతం బాధితులుగా ఉంటున్నారు. ఇటీవల కాలంలో 37% ఈ ఫోటో లేదా వీడియో మార్ఫింగ్ ఫేక్ కేసులే అధికంగా వస్తున్నట్లు సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు. బాధితుల పరువు ప్రతిష్ట దిగజార్చి వారిని నానారకాలుగా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజుతున్న ఉదంతాలెన్నో తెర మీదకు వస్తున్నాయి. తెలిసో తెలియక ఇలా మీ ఫోటోలు లేదా వీడియోలు మార్ఫింగ్ బారిన పడినట్లయితే వెంటనే ఏం చేయాలి? ఈ సమస్యను నుంచి సునాయాసంగా ఎలా బయటపడాలి తదితరాల గురించే ఈ కథనం!. మార్ఫింగ్ అంటే.. మీ వ్యక్తిగత ఫోటోలు లేదా వీడియోలు కొందరూ మార్ఫింగ్ టెక్నాలజీని ఉపయోగించి అశ్లీలంగా లేదా అభ్యంతరకరంగా మార్చి సోషల్ మీడియాలో వదులుతుంటారు. దీంతో ఒక్కసారిగా మీ వ్యక్తిగత పరువు, గౌరవం కోల్పోయినవాళ్లుగా మిగిలిపోతాం. ఇలాంటప్పుడూ తెలియకుండానే మన మానసిక స్థితి బలహీనమవుతుంది. దీన్నే ఆసరాగా తీసుకుని మీ నుంచి లబ్ధి పొందే కుట్రకు తెగబడుతుంటారు ఆన్లైన్ నేరగాళ్లు. నిజానికి ఏ వ్యక్తి అయినా ఈ స్థితిలో మానసికంగా నిలువునా కూలబడిపోతాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. అన్ని బాగున్నప్పుడే ధైర్యంగా ఉండటం వేరు. పరిస్థితి దారుణంగా ఉన్నప్పుడూ తట్టుకుని నిలబడేవాడు నిజమైన ధైర్యవంతుడు అని గుర్తించుకోండి. ఇక్కడ మీకు కావల్సింది మానసిక స్థితిని స్ట్రాంగ్ ఉండేలా చేసుకోవడమే మీ మొట్టమొదటి తక్షణ కర్తవ్యం. ఆ తర్వాత మీ బాధని, ఆవేదనని అర్థం చేసుకునేవాళ్లు లేదా మిమ్మల్ని సపోర్ట్ చేసి, సాయం చేస్తారనుకునేవాళ్లకు అసలు విషయాన్ని చెప్పాలి. కనీసం మీకు అలా సాయం చేసేవాళ్లు లేకపోతే సైబర్‌క్రైం, షీ టీం వంటి విమెన్ సంరక్షణ కోసం వస్తున్న పోలీసు విభాగాలను ఆశ్రయించి ఈ సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. డీప్ ఫేక్ వీడియోలు ఎలా గుర్తించొచ్చంటే.. డీప్ ఫేక్ వీడియోలను గుర్తించొచ్చు. ఎందుకంటే మన వాళ్లు లేక మనమో దీనికి గురైతే పరిస్థితిని వివరించడానికి ఇది ఉపకరిస్తుంది. ఎప్పుడైనా ఇలా ఏఐ సాంకేతతో డీప్ ఫేక్ వీడియోలు చేసినట్లయితే..ఆ వీడియోలను నిశితంగా గమనిస్తే వాటి ఆడియో సీన్లో వ్యక్తి ముఖకవళికలను గమనించాలి. ఆ వీడియో బ్యాక్ గ్రౌండ్ సౌండ్స్‌ని గమనించినా అర్థమైపోతుంది అది ఫేక్ అని. అలాగే విజువల్స్ కూడా క్లారిటీగా ఉండవు. ఇలా ఫోటోలు, వీడియోలు మార్చే సాంకేతిక తోపాటు అలాంటి వాటిని గుర్తించే టెక్నాలజీ కూడా అభివృద్ధి చెందింది. అలాంటి డీప్ ఫేక్ వీడియోలు లేదా ఫోటోలు గుర్తించే టూల్స్ ఏంటంటే.. సెంటినెల్ ఇంటెల్ రియల్-టైమ్ డీప్‌ఫేక్ డిటెక్టర్ WeVerify (వీ వెరీఫై) మైక్రోసాఫ్ట్ వీడియో ప్రమాణీకరణ సాధనం Phoneme-Viseme టూల్ తక్షణమే చేయాల్సిన మరోపని ఇటీవల కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువయ్యాయని సాయం చేసేలా కొన్ని హెల్ప్లైన్ల అందుబాటులో పెట్టారు. అలాగే ముఖ్యంగా 18 ఏళ్ల నిండని చిన్నారుల సైతం బాధితులవ్వకూడదననే ఉద్దేశ్యంతో కొన్ని ఆన్లైన్ చారిటీ సంస్థలు సాంకేతికతో కూడిన ప్రముఖ టూల్స్‌ని కూడా తీసుకొచ్చాయి. నేరుగా పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి కంప్లైయింట్ ఇవ్వడానికి భయపడే బాధితుల కోసమే ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ముందుగా హెల్ప్‌లైన్ నెంబర్ 1902కి కాల్ చేసి మీ ఫోటో లేదా వీడియోలు మార్ఫింగ్ అయినా వాటి గురించి పూర్తి వివరాలను తెలియజేయాలి. ఆ తర్వాత వెబసైట్ లింక్‌లో https://stopncii.org/ మీ ఒరిజన్‌ల ఫోటో తోపాటు మార్ఫింగ్‌కి గురైన ఫోటోను అప్లోడ్ చేయాలి. అంతే మీ ఫోటో ఇంటర్నెట్లో ఎక్కడ ఉన్నా వెంటనే డిలీట్ అయిపోతుంది. ఈ వెబ్సైట్ మీ గోప్యతను కాపాడుతుంది. బాధితులకు మద్దతుగా ఉండేందుకు రూపొందించిన వెబ్సైట్ ఇది. ఇది 2000లో ప్రారంభమైంది. ఆన్లైన్లో బాధితులుగా ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వామ్య వాటాదారులతో కలిసి పనిచేస్తుంది. వ్యక్తిగత డేటాను ఆన్లైన్లో షేర్ చేసేటప్పుడూ.. సోషల్ మీడియా ఖాతాలలో మీ డేటాను గోప్యంగా ఉంచండి మీ వ్యక్తిగత చిత్రాలను ఆన్లైన్లో పబ్లిక్‌గా ఎప్పుడూ షేర్ చేయవద్దు చిత్రాలను పంచుకునేటప్పుడు వాటర్‌మార్క్ ఉపయోగించండి మీ సోషల్ మీడియా ఖాతాల స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లతో రెండు కారకాల ప్రమాణీకరణను ఉపయోగించండి. అనుకోని సంఘటన ఎదురైతే తెలియజేసేలా అందుకు సంబంధించిన సాక్ష్యం, స్క్రీన్ షాట్లను సేవ్ చేయండి. బాధితులు తీసుకోవాల్సిన చర్యలు సమీప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదున నమోదు చేయండి cybercrime.gov.inలో మీ వివరాలు చెప్పకుండా కూడా ఆన్లైన్ ఫిర్యాదును నమోదు చేసుకునే అవకాశం కూడా ఉంది. అలాగే సోషల్ మీడియా ఖాతా సహాయ కేంద్రానికి నివేదించండి ఈ నేరానికి సంబంధించిన చట్టాలు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 66,37 వంటి కేసులు పెట్టోచ్చు ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసినందుకు, చీటింగ్ చేసినందుకు సెక్షన్ 354(డీ), 465, 463 వంటి కేసులు పెట్టొచ్చు బాధితులు చిన్న పిల్లలైతే చైల్డ్ ఫోర్నోగ్రఫీకి సంబంధించిన సెక్షన్ 14, 15 వంటి బలమైన కేసులు పెట్టొచ్చు. వీటికి జైలు శిక్ష, భారీ మొత్తంలో జరిమాన విధించడం జరుగుతుంది. (చదవండి: ఆర్ట్ సైంటిస్ట్! ఆర్ట్, సైన్సును కలిపే సరికొత్త కళ!) -
ఎంత దా’రుణ’మో.. నష్టాల ఊబిలో జయలక్ష్మి సొసైటీ
కాకినాడ రూరల్(కాకినాడ జిల్లా): ఆకర్షణీయమైన వడ్డీల మోజులో పడి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పొదుపు చేసుకున్న సొమ్ములను జయలక్ష్మి ఎంఏఎం కో ఆపరేటివ్ సొసైటీలో ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ) చేసుకున్న సభ్యులు.. నేడు సొసైటీ దివాళా దశకు చేరిందని తెలిసి లబోదిబోమంటున్నారు. కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ వద్ద ప్రధాన బ్రాంచితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 29 బ్రాంచిలు కలిగిన జయలక్ష్మి సొసైటీ నష్టాల ఊబిలో చిక్కుకున్నట్టు తేటతెల్లమవుతోంది. సుమారు 19,911 మంది సభ్యులు కలిగిన ఈ సొసైటీ అన్ని శాఖల్లో సుమారు 10 వేల మంది వరకూ తమ సొమ్ములను ఎఫ్డీలు గాను, నెలవారీ వడ్డీలకు గాను డిపాజిట్ చేసుకున్నారు. అయితే రెండు నెలలుగా సొమ్ములను డిపాజిట్ చేసుకుంటున్న సొసైటీ ఉద్యోగులు.. గడువు ముగిసినా బాండ్లకు చెల్లింపులు మాత్రం జరపలేదు. దీంతో సుమారు రూ.520 కోట్ల డిపాజిట్ల సొమ్ముల విషయం ప్రశ్నార్థకమైంది. పోలీసులకు ఫిర్యాదు తొలుత పిఠాపురం బ్రాంచి నుంచి ఈ వ్యవహారం బయటకు రాగా, ఇప్పుడు అన్ని బ్రాంచిల పరిధిలోని డిపాజిటర్లు తమ సొమ్ములపై భయాందోళన చెందుతున్నారు. సర్పవరం జంక్షన్‌లోని ప్రధాన బ్రాంచి వద్ద రెండో రోజైన గురువారం కూడా డిపాజిటర్లు భారీగా క్యూ కట్టారు. జయలక్ష్మి సొసైటీ పాలకవర్గం అందుబాటులో లేకపోగా.. మీడియాలో కథనాల నేపథ్యంలో తరలిస్తున్న సభ్యులకు సమాధానం చెప్పేవారు కూడా లేకుండా పోయారు. సొసైటీలో కీలక అధికారిని పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తుండడంతో తాళాలు కూడా తెరవలేదు. సుమారు 200 మంది డిపాజిటర్లు కాకినాడ టూ టౌన్ పోలీసు స్టేషన్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. మరోవైపు సొసైటీ ఉద్యోగి సుధాకర్ ఫిర్యాదు నేపథ్యంలో డీసీఓ ఆదేశాల మేరకు తొలి రోజు రికార్డుల తనిఖీ ప్రారంభించిన ముగ్గురు సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు.. గురువారం ఉదయం నుంచీ తాళాలు తెరకవపోడంతో మూడు గంటల పాటు బయటే వేచి ఉన్నారు. ఆ తరువాత పోలీసులు అదుపులో ఉన్న ఉద్యోగి వచ్చి తాళం తీయడంతో రికార్డులు పరిశీలించారు. తొలి రోజు రికార్డులు పరిశీలించిన అసిస్టెంట్ రిజిస్ట్రార్లు జవహర్, లక్ష్మి, ఉమా శంకర్‌లతో పాటు రెండో రోజు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చిన డిప్యూటీ రిజిస్ట్రార్ కృష్ణకాంత్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు రికార్డుల పరిశీలనలో పాల్గొన్నారు. నష్టాలకు అనేక కారణాలు మ్యాక్స్ చట్టం–95 ప్రకారం స్వయంప్రతిపత్తి కలిగిన జయలక్ష్మి సొసైటీని సభ్యులు, పాలకవర్గమే నిర్వహించుకోవాల్సి ఉంది. దీనిలో ఇతరుల జోక్యం లేదు. దాదాపు 23 ఏళ్ల పాటు బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సొసైటీలో వేలాది మంది సభ్యులు ఉన్నారు. ఆకర్షణీయమైన వడ్డీల పేరుతో డిపాజిట్లు సేకరించడంతో సుమారు 10 వేల మంది వరకూ ఎఫ్డీలు చేశారు. ఆ సొమ్ములకు 12.5 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలంటే అంతకంటే ఎక్కువగా వ్యాపారం చేయాల్సి ఉంది. ఇది అధిక వడ్డీకి రుణాలు ఇవ్వడం ద్వారానే సాధ్యమవుతుంది. ఇక్కడే సొసైటీ నష్టాలకు బీజం పడినట్టు తెలుస్తోంది. సుమారు రూ.520 కోట్ల వరకూ వివిధ రూపాల్లో రుణాలు ఇవ్వడం, అవి సకాలంలో రికవరీ కాకపోవడం సొసైటీని నష్టాల ఊబిలోకి నెట్టింది. తగిన సెక్యూరిటీ లేకుండా రుణాలు ఇవ్వడంతో వాటి వసూళ్లు కష్టమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించే చార్టర్డ్ అకౌంటెన్సీ కంపెనీ, కన్సల్టెన్సీ వైఫల్యం సొసైటీని ముంచిందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. రికార్డులు తనిఖీ చేస్తున్న అధికారులు ఇదే విషయాన్ని చెబుతున్నారు. సొసైటీ పాలకవర్గాన్ని ముందుగా హెచ్చరించి ఉంటే అన్ సెక్యూర్డ్ రుణాలు ఇచ్చేవారు కాదని అంటున్నారు. ఇదిలా ఉండగా జయలక్ష్మి సొసైటీ డిపాజిటర్లకు ఏవిధంగా న్యాయం చేయాలనే అంశాన్ని అధికారులు ప్రభుత్వానికి నివేదించనున్నారు. సొసైటీ ఆస్తులు, నగదును తమ అ«దీనంలోకి తీసుకుని డిపాజిటర్లకు చెల్లించేలా ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఆందోళనగా ఉంది దివాలా తీస్తుందని ప్రచారం ఉండడంతో జయలక్ష్మి సొసైటీలో దాచుకున్న సుమారు రూ.35 లక్షల డిపాజిట్లపై మా కుటుంబం ఆందోళనలో ఉంది. ప్రభుత్వం న్యాయం చేయాలి. – మాదిరెడ్డి ఉమామహేశ్వరరావు, డిపాజిటర్, కాకినాడ వారం క్రితమే గాంధీ నగర్ బ్రాంచిలో డిపాజిట్ ఎక్కువ వడ్డీ వస్తుందని, నెల వారీగా తీసుకునేందుకు మార్చి 29న గాంధీ నగర్ బ్రాంచిలో రూ.1.5 లక్షలు డిపాజిట్ చేశాను. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కూడబెట్టిన సొమ్మును ఆ బ్రాంచి ఉద్యోగులు చెప్పడంతోనే ఎస్బీఐ నుంచి తీసుకుని ఇక్కడ పొదుపు చేశాను. ఇప్పుడు బోర్డు దిప్పే దశలో ఉండడంతో తీవ్రంగా ఆందోళన చెందుతున్నాను. – గన్నవరపు గిరికుమార్, సాఫ్్టవేర్ ఉద్యోగి, కాకినాడ -
నిలువునా ముంచేసిన బ్యాంకు.. 200 మంది మరణం.. చివరకు స్వల్ప ఊరట
PMC Crisis: పంజాబ్ మహరాష్ట్ర నేషనల్ బ్యాంక్ (పీఎంసీ బ్యాంక్) కుంభకోణంలో డిపాజిట్‌దారులకు స్వల్ప ఊరట లభించింది. స్వల్ప మొత్తాల డిపాజిట్లకు సంబంధించిన చెల్లింపుల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా తాజాగా జారీ చేసిన ఆదేశాలు బాధితులకు కొంత మేర ఉపశమనం కలిగించాయి. 90 రోజుల్లో బ్యాంక్ మేనేజర్ అడ్డదారులు తొక్కడంతో పీఎంసీ బ్యాంకు నష్టాల ఊబిలో కూరుకుపోయింది. 2019 సెప్టెంబరు నుంచి డిపాజిట్‌దారులు తమ సొమ్ములు వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అంశంపై ఆర్బీఐ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంకులో దాచుకున్న సొమ్ము వడ్డీతో కలిపి మొత్తం ఐదు లక్షల రూపాయల లోపు ఉన్న వారు దరఖాస్తు చేసుకున్న తర్వాత 90 రోజుల్లోగా నగదు చెల్లింపులు ఉంటాయని ఆర్బీఐ ప్రకటించింది. డిపాజిట్ ఇన్సురెన్స్, క్రెడిట్ గ్యారంటీ కార్పోరేషన్ ద్వారా ఈ చెల్లింపులు చేయనున్నారు. ఈ నిర్ణయం వల్ల లక్ష మంది వరకు బాధితులకు ఊరట లభించనుంది. మరి వారి సంగతి ముంబై ప్రధాన కార్యాలయంగా పంజాబ్ మహారాష్ట నేషనల్ బ్యాంకుకి దాదాపు పది లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు. ఆర్బీఐ తాజాగా తీసుకున్న నిర్ణయంతో కేవలం లక్ష మంది వరకు సేఫ్ జోన్లోకి వెళ్తున్నారు. కానీ మిగిలిన డిపాజిటర్ల పరిస్థితి ఇంకా అగమ్యగోచరంగానే ఉంది. ఇందులో 43,000ల మంది ఖాతాదారులైతే భారీ మొత్తంలో తమ సొమ్మును ఈ బ్యాంకులో డిపాజిట్ చేశారు. ఎదిగిన తీరు పీఎంసీ బ్యాంకుని 1984లో నవీ ముంబైలో ఏర్పాటు చేశారు. ఎక్కువ వడ్డీ ఇస్తుండటంతో ముంబైలో పని చేసే కార్మికులు, ఉద్యోగులు ఈ బ్యాంకును ఆదరించారు. దీంతో అనతి కాంలోనే మహారాష్ట్ర, పంజాబ్‌లతో పాటు దేశమంతటా 130 వరకు బ్రాంచీలకు విస్తరించింది. ఖాతాదారుల సంఖ్య పది లక్షల వరకు చేరుకుంది. దేశంలో ఉన్న సహాకార బ్యాంకుల్లో 11 శాతం డిపాజిట్లతో అగ్రగామి బ్యాంకుగా పీఎంసీ ఎదిగింది. కుప్ప కూలిన వైనం మహారాష్ట్రలోని బందూప్ బ్రాంచ్‌లో తొలిసారిగా కుంభకోణానికి బీజం పడింది. ఇక్కడి నుంచి ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి నిబంధనలకు తూట్లు పొడుస్తూ బాం్యకు సిబ్బంది రూ. 6500 కోట్ల రూపాయల రుణం మంజూరు చేశారు. అంతేకాకుండా ఊరుపేరు ఖాతాలు సృష్టించి సామాన్యుల నుంచి సేకరించిన సొమ్మును తరించారు. చివరకు 2019 సెప్టెంబరులో ఈ పాపం వెలుగులోకి వచ్చింది. కష్టాల్లోకి ఖాతాదారులు దీంతో 2019 సెప్టెంబరులో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకు లావాదేవీలు నిలిపేసింది. దీంతో కష్టపడి ఈ బ్యాంకులో సొమ్ములు దాచుకున్న ఎందరో ఆందోళన చెందారు. తమ డబ్బులు వెనక్కి తీసుకునేందుకు వారు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కుంభ కోణం వెలుగు చూసిన నెల రోజుల వ్యవధిలోనే 20 మందికి పైగా ఖాతాదారులు మరణించారు. కానీ ఏళ్లు గడిచినా సమస్యకు పరిష్కారం లభించలేదు. కరోనా ఎఫెక్ట్‌తో కూలిన బతుకులు బ్యాంకు సంక్షోభం రేపోమాపో చక్కబడుతుందనుకులోగా కరోనా వచ్చి పడింది. దాని వెంటే లాక్డౌన్ రావడంతో ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. దీంతో ఏళ్ల తరబడి ఈ బ్యాంకులో డబ్బులు దాచుకున్న డిపాజిట్లు అష్టకష్టాలు పడ్డారు. పీఎంసీ బ్యాంకు ఫైట్ పేరుతో గ్రూపులుగా ఏర్పడి పోరాటం చేస్తున్నారు. వీరు చెప్పిన వివరాల ప్రకారమే కేవలం ఈ బ్యాంకు చేసిన ద్రోహం కారణంగా ఇప్పటి వరకు 200ల మందికి పైగా ఖాతాదారులు మరణించారు. ఇందులో కొంత మంది ఆత్మహత్యలకు పాల్పడగా మరికొందరు అక్కరలో డబ్బులు అందక మరణించారు. మరెంతో మంది ఆర్థిక ఆధారం లేక దుర్బర జీవితం గడుపుతున్నారు. అందర్నీ ఆదుకోవాలి ముంబైలో పని చేసే కార్మికులు, ఉద్యోగస్తులు చిరు వ్యాపారాలు చేయాలని, ఇళ్లు కట్టుకోవాలనే లక్ష్యంతో తమ రెక్కల కష్టాన్ని ఈ బ్యాంకులో దాచుకున్నారు. ఆర్బీఐ తాజా నిర్ణయం కొంత మేరకు ఊరట ఇచ్చినా.. చాలా మంది ఇంకా తమ కష్టాల నుంచి గట్టెక్కలేదు. డిపాజిట్ ఇన్సురెన్స్, క్రెడిట్ గ్యారంటీ కార్పోరేషన్ ద్వారా అందరికీ న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. చదవండి : ఆర్బీఐ కీలక నిర్ణయం.. విదేశాల్లోనూ యూపీఐ పేమెంట్స్! -
‘డబ్బు ఇవ్వకుంటే పురుగుల మందు తాగుతాం’
నగరం(రేపల్లె): ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించిన అక్కల వీరారెడ్డి ఇంటి ఎదుట బాధితుడి కుటుంబం బైఠాయించిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. బాధితుడు విజయవాడకు చెందిన వెంకటేశ్వర్లు కథనం మేరకు.. మండలంలోని పూడివాడ గ్రామానికి చెందిన అక్కల వీరారెడ్డి, సీబీసీఐడీలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.22 లక్షలు డబ్బు తీసుకున్నాడు. అప్పటి నుంచి అదుగో రేపు మాపు అంటూ వీరారెడ్డి కాలం నెట్టుకొచ్చాడు. దీంతో పోలీసులను ఆశ్రయిస్తే కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నట్లు చెప్పారు. డబ్బులు ఇచ్చే వరకు తిరిగి వెళ్లేది లేదని ఇంటి ఎదుట భార్యతో సహా కూర్చున్నారు. మాకు డబ్బులు ఇవ్వని పక్షంలో కుటుంబం మొత్తం పురుగు మందు తాగి ఆత్మహత్యకు సిద్ధంగా ఉన్నామని ఆవేదన భరితంగా చెప్పారు. అపార్టుమెంట్లో ప్లాట్ ఇప్పిస్తానని.. విజయవాడకు చెందిన తలగడదీవి రత్నకుమారి నుంచి అపార్టుమెంట్లో ప్లాట్ ఇప్పిస్తానని మార్చి 2020లో రూ.4లక్షలు తీసుకుని మోసగించాడని వాపోయారు. పేదలమైన మావద్ద నుంచి లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశాడని, డబ్బులు ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేసింది. అదే విధంగా వీరారెడ్డి పలు చోట్ల ఛీటింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా నగరం మండలం ఎస్ఐ వాసును వివరణ కోరగా తమకు ఎటుంటి ఫిర్యాదు అందలేని తెలిపారు. చదవండి: ఉల్లిగడ్డల చోరీకి వచ్చాడని చంపేశారు.. డెత్‌నోట్ రాసి.. ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య -
ప్రతి పనికీ మనీ మనీ..!
కేశంపేట : రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్ లావణ్య బాధితులు శుక్రవారం తహసీల్దార్ కార్యాలయానికి భారీగా చేరుకున్నారు. తహసీల్దార్ లావణ్యకు ఎంత సమర్పించుకున్నారో చెప్పారు. ప్రతి పనికీ రేటును ఫిక్స్ చేసి వసూలు చేశారని పలువురు రైతులు ఆరోపించారు. రైతులు తమ భూ సమస్యలను పరిష్కరించుకోవాలంటే తహసీల్దార్‌కుగానీ, తన ఏజెంట్లకుగానీ డబ్బులు ముట్టజెప్పాల్సిందేనని, మీడియాకు తెలిపితే తమ సమస్యలను మరింత జటిలం చేస్తుందనే తాము ఎవరికీ చెప్పలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయంపై దాడి.. కార్యాలయంలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో రైతులు బయటే గుమిగూడారు. అదే సమయంలో వచ్చిన సర్వేయర్ నాగేశ్ కాళ్ళు మొక్కి తమకు ఇవ్వాల్సిన రిపోర్టులను అందజేయాలని రైతులు కోరారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహించిన రైతులు సర్వేయర్‌ను నిలదీశారు. టేబుల్, కుర్చీలను ఎత్తి పడేశారు. సకాలంలో పోలీసులు స్పందించి రైతులను సముదాయించి బయటకు పంపించారు. కలెక్టర్ రావాలి... గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారులు లంచాలు తీసుకుని భూరికార్డులను మాయం చేసిన లీలలు తెలవాలంటే కలెక్టర్ కేశంపేటకు రావాలని రైతులు డిమాండ్ చేశారు. మండలంలో జరిగిన అవినీతిపై కలెక్టర్ విచారణ జరిపించాలన్నారు. సర్వేయర్ కాళ్లు మొక్కుతున్న బాధితురాలు మళ్లీ ఏసీబీ తనిఖీలు కేశంపేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం మళ్లీ తనిఖీలు నిర్వహించారు. ఐదుగురు సభ్యులతో కూడిన అధికారుల బృందం కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. తహసీల్దార్ లావణ్య, వీఆర్వో అనంతయ్య రైతు వద్ద నుంచి భారీ మొత్తంలో లంచం తీసుకొని ఏసీబీ అధికారులకు పట్టుబడిన నేపథ్యంలో వారిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో కేశంపేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మరోమారు తనిఖీలు నిర్వహించారు. రూ. 50 వేలు ఇస్తేనే కాస్తు.. కేశంపేట శివారులోని సర్వే నంబర్ 223లో రెండు ఎకరాల భూమిని 1991లో సాదాబైనామాగా తలకొండపల్లి మండలంలోని రామకృష్ణపురం గ్రామానికి చెందిన శేరిల వెకటయ్య వద్ద కొనుగోలు చేశామని భారతమ్మ అనే మహిళా రైతు తెలిపారు. అప్పటి నుంచి కబ్జాలో ఉన్నామని, దానికి కాస్తు రాయాలని వీఆర్వో అనంతయ్యను కోరగా రూ.50 వేలు డిమాండ్ చేశారని చెప్పారు. తప్పనిపరిస్థితుల్లో డబ్బులిచ్చి కాస్తు రాయించుకున్నామన్నారు. గత సంవత్సరం మళ్లీ కాస్తు రాయాలని కోరగా లక్ష రూపాయలు ఇవ్వాలని వీఆర్వో కోరారని, తహసీల్దార్‌ను సంప్రదిస్తే అనంతయ్య చెప్పినట్టు లక్ష రూపాయలు ఇసైనే కాస్తు రాస్తామన్నారని భారతమ్మ ఆరోపించారు. తాము డబ్బులు ఇవ్వకపోవడంతో శేరిల వెంకటయ్య పేరును అన్లైన్లో చేర్చారని తెలిపారు. దీంతో అతను ఆ భూమిని విక్రయించాడని, తమకు న్యాయం చేయాలని బాధితురాలు కోరారు. -
అంగడి ఆగమాగం
సాక్షి, హైదరాబాద్: ఓవైపు బాధితుల ఆగ్రహ జ్వాలలు.. మరోవైపు మిన్నంటిన ఆక్రందనలు, ఆర్త నాదాలు.. ఇంకోవైపు నేతల ఘెరావ్‌లు, ఆందోళనలతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ గురువారం అట్టుడికింది. అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి రోడ్డునపడ్డ బాధితులను ఆదుకునేందుకు ఇటు ప్రభుత్వపరంగా, అటు నిర్వాహకుల నుంచి ఎలాంటి హామీ లభించకపోవడంతో బాధితులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఎగ్జిబిషన్ సొసైటీ పాలక మండలి కార్యాలయాన్ని ముట్టడించి, అక్కడున్న పూలకుండీలను ధ్వంసం చేశారు. లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన హోం మంత్రి మహమూద్ అలీ, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ సహా ఇతర నేతలను బాధితులు ఘోరావ్ చేశారు. వారి కాన్వాయ్‌ని అడ్డుకునేందుకు యత్నించిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్ప లాఠీఛార్జీ చేశారు. ఇదే సమయంలో కొంత మంది బాధితులు సొసైటీ కార్యాలయంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకుని వారికి నచ్చజెప్పారు. నుమాయిష్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో కాలిపోయిన ఓ స్టాల్లో చెల్లాచెదురుగా పడివున్న వస్తువులు, సగం కాలిన వస్త్రాలు వచ్చే ఏడాది ఉచితంగా స్టాళ్లు... బుధవారం సాయంత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోని నుమాయిష్‌లో అగ్నిప్రమాదం జరిగి దాదాపు 300 స్టాళ్లు దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసు, అగ్నిమాపకశాఖ, క్లూస్‌టీం బృందాలు గురువారం ఘటనాస్థలికి చేరుకుని ఆధారాల కోసం అన్వేషించాయి. 15 రెవెన్యూ బృందాలు బాధితుల వివరాలు, ఆస్తి నష్టాల వివరాలను సేకరించాయి. 130 మందికి చెందిన 300 స్టాళ్లు దగ్ధం కావడంతో సుమారు రూ.60 కోట్ల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. దీంతో బాధితులకు తక్షణ సాయంగా రూ.10వేల నగదుతోపాటు రూ.25వేల చెక్కును అందజేయనున్నట్లు మాజీ మంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు ఈటెల రాజేందర్ ప్రకటించారు. నుమాయిష్‌కు శుక్ర, శనివారాలు సెలవు ప్రకటించారు. ఫిబ్రవరి 15 నుంచి 28 వరకు ఎగ్జిబిషన్ పొడగిస్తున్నట్లు హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. షెడ్డులు మళ్లీ ఏర్పాటుచేసి, బాధితులకు ఉచితంగా అందజేయడమే కాకుండా ఆ 14 రోజులపాటు వచ్చే ఆదాయాన్ని పూర్తిగా బాధితులను ఆదుకునేందుకే కేటాయించనున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది కూడా వారి నుంచి ఎలాంటి అద్దె వసూలు చేయబోమని స్పష్టంచేశారు. ఓ స్టాల్లో కాలిపోయిన కరెన్సీ నోట్లు సేవాభావం నుంచి వ్యాపార ధోరణికి... చిరు వ్యాపారులను ఆదుకునేందుకు నిజాం ప్రభువు హైదరాబాద్‌లోని నాంపల్లి మైదానంలో ఏటా ఎగ్జిబిషన్ నిర్వహించేవారు. నుమాయిష్ దేశంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్ కావడంతో ఇక్కడ స్టాళ్లను ఏర్పాటు చేయడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా జమ్ముకాశ్మీర్, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, సూరత్, ఈశాన్య రాష్ట్రాల నుంచి వ్యాపారులు వస్తుంటారు. మొదట్లో ఇది పూర్తిగా సేవాభావంతో పనిచేసేది. ప్రస్తుతం దీన్ని కమర్షియల్‌గా మార్చేశారు. ఒక్కో షాపునకు రూ.70 వేల అద్దె వసూలు చేస్తుండటంతో యజమానులు వాటిని మరో ఇద్దరు ముగ్గురు వ్యాపారులకు సబ్లీజుకు ఇస్తున్నారు. చివరకు మైదానంలోని దేవాలయం చుట్టూ కూడా షాపులు ఏర్పాటు చేశారు. పైగా వాటి మధ్య కనీసం గ్యాప్ కూడా వదిలిపెట్టలేదు. మరోవైపు షాపుల ముందు ఫైర్ సేఫ్టీ సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేదు. అంతే కాకుండా ఒకే విద్యుత్ వైరు నుంచి అనేక షాపులకు కనెక్షన్లు ఇచ్చారు. నాసిరకం కేబుళ్లు వాడటం, అనేకచోట్ల జాయింట్లతోపాటు లూజ్ కనెక్షన్లు ఉన్నాయని చెప్పినా విద్యుత్ అధికారులు పట్టించుకోకపోవడంతో భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఆందోళన చేస్తున్న స్టాళ్ల యజమానులు కళ్ల ముందే బూడిదయ్యాయి నాలుగైదేళ్ల నుంచి నుమాయిష్‌లో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నా. పోచంపల్లి, గద్వాల, సిరిసిల్ల చేనేత వస్త్రాలను విక్రయిస్తున్నా. షాపులో రూ.10 లక్షలకుపైగా విలువైన మెటిరీయల్ ఉంటుంది. వస్త్రాలు అమ్మగా వచ్చిన రూ.48వేల నగదు కూడా కౌంటర్లోనే ఉంది. ఒంటిపై ఉన్న బంగారం కుదువపెట్టి, ఫైనాన్స్ నుంచి అప్పు తీసుకుని మెటిరీయల్ కొన్నా. సంపాదించిన నగదు సహా అన్నీ కళ్ల ముందే కాలిబూడిదయ్యాయి. చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియడం లేదు. – ఆర్తి, హైదరాబాద్ భార్యాపిల్లలతో రోడ్డున పడ్డాను పదిహేనేళ్ల నుంచే నుమాయిష్‌లో పాల్గొంటున్నా. రూ.70వేలు చెల్లించి స్టాల్ అద్దెకు తీసుకున్నా. రూ.20 లక్షలు ఖర్చుచేసి ఖరీదైన సిల్క్, ఇతర డ్రెస్ మెటిరీయల్ తెప్పించాను. అంతా కళ్లముందే కాలి బూడిదైపోయింది. భార్యాపిల్లలతో రోడ్డున పడ్డాను. కట్టుకునేందుకు బట్టలే కాదు, కనీసం తినేందుకు తిండి కూడా లేదు. – మునాఫ్ ఆలం, బిహార్ తిరిగి వెళ్లడానికీ డబ్బుల్లేవు సూరత్‌లో ఓ వ్యాపారి వద్ద నా భార్య నగలన్నీ కుదవపెట్టి సరుకు తెచ్చాను. మరికొంత బంధువుల వద్ద అప్పు కూడా తీసుకొచ్చి పెట్టుబడి పెట్టాను. ఇప్పటి వరకు సరుకు అమ్మగా వచ్చిన నగదు కూడా కౌంటర్లోనే ఉంది. మెటీరీయల్‌తో పాటు నగదు కూడా కాలిపోయింది. తిరిగి వెళ్లడానికీ డబ్బుల్లేవు. – ఉమేష్, గుజరాత్ అన్నీ కాలిపోయాయి 30 ఏళ్ల నుంచి స్టాల్ ఏర్పాటు చేస్తున్నా. అన్నీ చేనేత వస్తువులే. అప్పు చేసి మెటీరియల్ కొన్నా. ఈ ఏడాది వ్యాపారం కూడా అంతగా లేదు. 95 శాతం సరుకు స్టాల్లోనే ఉండిపోయింది. ఆ రోజు వచ్చిన నగదు సహా అన్నీ కాలిపోయాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. – రత్నమాణిక్యం, నర్సాపూర్ ఫైరింజన్లో నీళ్లు లేవు తాగేందుకు నీరు లేదు. బాత్రూమ్లూ బాగోలేదు. మౌలిక సదుపాయాల కల్పన విషయంలో పాలకమండలి ఘోరంగా విఫలమైంది. దీనిపై 2018లోనే ఫిర్యాదు చేశాను. కానీ ఎవ్వరూ పట్టించుకోకపోగా, బ్లాక్ మెయిల్ చేశారు. అద్దె చెల్లించినా.. అదనంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఫోన్ చేసిన వెంటనే ఫైర్ ఇంజన్ వచ్చినప్పటికీ.. అటు ఇటూ తిరిగిందే కానీ మంటలు ఆర్పే ప్రయత్నం చేయలేదు. అందులో నీళ్లు కూడా లేవు. – సబిత, గుజరాత్ స్టాళ్ల మధ్య గ్యాప్ లేకపోవడం వల్లే ప్రమాదం గతంలో స్టాల్‌కు స్టాల్ మధ్య గ్యాప్ ఉండేది. ఏదైనా ప్రమాదం జరిగితే, వెంటనే ఆర్పేందుకు మైదానానికి నాలుగు వైపులా నాలుగు ఫైర్ ఇంజన్లు ఉండేవి. స్టాల్స్ ముందు ఫైర్‌సేప్టీ కూడా ఉండేది. ప్రస్తుతం వాటిని ఏర్పాటు చేయలేదు. అందువల్లే ఇంత భారీ ప్రమాదం చోటుచేసుకుంది. – మహ్మద్ అశ్రత్, జమ్ముకాశ్మీర్ సమావేశంలో మాట్లాడుతున్న ఈటల బాధితులను ఆదుకుంటాం: ఈటల హైదరాబాద్: నుమాయిష్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని మాజీమంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ తెలిపారు. గురువారం ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 79 ఏళ్ల నుమాయిష్ చరిత్రలో ఇంతపెద్ద ప్రమాదం జరగలేదన్నారు. ఘటనలకు గల కారణాలను తెలుసుకునేందుకు ప్రభుత్వ ఏజెన్సీలు, క్లూస్ టీంలు వివరాలు సేకరిస్తున్నాయని తెలిపారు. అలాగే నష్టం వివరాలను అంచనా వేస్తున్నామన్నారు. ప్రమాద వివరాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారని వెల్లడించారు. ఎగ్జిబిషన్ సొసైటీ ప్రైవేటు, వ్యాపార సంస్థ కాదని.. గొప్ప ఆశయం కోసం ఇది ఏర్పాటైందని తెలిపారు. ప్రైవేటు సంస్థలను డిమాండ్ చేసినట్లుగా సొసైటీని డిమాండ్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఏడాది ఎగ్జిబిషన్ ఏర్పాటులో ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రతలు తీసుకుంటామని స్పష్టంచేశారు. స్టాల్‌కు స్టాల్‌కు మధ్య స్థలం ఉండేలా చూస్తామని, స్టాళ్లను కట్టెలతో కాకుండా ఇనుముతో నిర్మిస్తామని పేర్కొన్నారు. ప్రతి షాప్ వద్ద ఫైర్‌సేఫ్టీ సదుపాయాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్యాస్ సిలిండర్లు, స్టౌవ్‌లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. షాపు యజమానులు స్టాల్స్‌కు బీమా తీసుకోవాలని.. ఈ విషయంలో సొసైటీ తరపున రాయితీ కల్పిస్తామని ఈటల తెలిపారు. -
కుట్టుమిషన్ల పేరుతో కుచ్చుటోపి
కృష్ణాజిల్లా : విజయవాడలో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. కుట్టుమిషన్లు ఇస్తామని రూ.కోట్లలో కుచ్చుటోపి పెట్టిన ఘటన నగరంలో చోటుచేసుకుంది. గ్లోబల్ గివింగ్ సంస్థ కుట్టుమిషన్లు ఇస్తామని ప్రజల నుంచి రూ.కోట్లలో వసూలు చేసింది. ఎన్ని రోజులైనా మిషన్లు ఇవ్వకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు సోమవారం సంస్థ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. మోసం చేసిన సంస్థపై చర్యలు తీసుకోవడంతో పాటు తమ డబ్బును తిరిగి ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. -
ఎమ్మార్వోను సస్పెండ్ చేయాలంటూ ధర్నా
కృష్ణాజిల్లా: అవినీతికి పాల్పడిన తహశీల్దార్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. బాధిత మహిళలు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన ఘటన కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంది. కంచికచర్ల తహశీల్దార్‌గా పని చేస్తున్న ఎన్. విజయ్‌కుమార్ గ్రామానికి చెందిన మందా శామ్యేల్కు చెందిన ఆరు ఎకరాల భూమిని లంచం తీసుకొని వేరే వారి పేరు మీద పట్టాదారు పాసుపుస్తకాన్ని సృష్టించాడు. విషయం తెలుసుకున్న బాధితులు శనివారం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. తహశీల్దార్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని లేకుంటే.. ఇక్కడి నుంచి కదిలేది లేదని మహిళలు ధర్నా చేపట్టారు. -
మహాప్రభో..మా కష్టాలు తీర్చండి
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: అధికారుల చుట్టూ తిరిగేకంటే ఆ దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేసినా వారి సమస్యలు పరిష్కారమయ్యే ఏమో. ఒకటి..రెండు..మూడు.. ఐదు..పది.. ఇరవై.. ఇలా వందల సార్లు ప్రజాదర్బార్‌లో వినతులు ఇచ్చినా సమస్యలకు మోక్షం లభించడం లేదు. సుదూర ప్రాంతాల నుంచి తీవ్ర వ్యయ ప్రయాసలకోర్చి ప్రతి వారం కలెక్టరేట్లో జరిగే ప్రజాదర్బార్‌కు వస్తున్న బాధితులకు నిరాశే ఎదురవుతోంది. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తదితరులు వివిధ వర్గాల ప్రజలు ఇచ్చే వినతులను పైపైనే చదివి ఎండార్స్మెంట్ రాసి సంబంధిత అధికారులకు రెఫర్ చేస్తున్నారు. వారు వాటిని కింది స్థాయి అధికారులు, సిబ్బందిపై తోసేసి చేతులు దులుపుకుంటున్నారు. సమస్యలు మాత్రం పరిష్కారం కాక వివిధ వర్గాల ప్రజలు ఇటు ప్రజాదర్బార్, అటు సంబంధిత అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జరిగిన ప్రజాదర్బార్‌లో కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ కె.కన్నబాబు, డీఆర్ఓ వేణుగోపాల్ రెడ్డి వినతులు స్వీకరించి సంబంధిత అధికారులకు రెఫర్ చేశారు. హౌసింగ్ పీడీ రామసుబ్బు, డీఆర్డీఏ-ఐకేపీ పీడీ నజీర్‌సాహెబ్ తమకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు. ప్రజాదర్బార్‌లో వినతులు వెల్లువెత్తాయి. అర్జీలు ఇచ్చేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పోటీ పడ్డారు. సునయన ఆడిటోరియంలోకి వెళ్లేందుకు తోపులాట జరిగింది. ప్రజాదర్బార్‌కు వచ్చిన వినతుల్లో కొన్ని ఇలా ఉన్నాయి.