కుట్టుమిషన్ల పేరుతో కుచ్చుటోపి
కృష్ణాజిల్లా : విజయవాడలో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. కుట్టుమిషన్లు ఇస్తామని రూ.కోట్లలో కుచ్చుటోపి పెట్టిన ఘటన నగరంలో చోటుచేసుకుంది.
గ్లోబల్ గివింగ్ సంస్థ కుట్టుమిషన్లు ఇస్తామని ప్రజల నుంచి రూ.కోట్లలో వసూలు చేసింది. ఎన్ని రోజులైనా మిషన్లు ఇవ్వకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు సోమవారం సంస్థ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. మోసం చేసిన సంస్థపై చర్యలు తీసుకోవడంతో పాటు తమ డబ్బును తిరిగి ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.