
వీరారెడ్డి ఇంటి వద్ద పురుగుమందు డబ్బాతో తలగడదీవి రత్నకుమారి (సర్కిల్‌లో)
నగరం(రేపల్లె): ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించిన అక్కల వీరారెడ్డి ఇంటి ఎదుట బాధితుడి కుటుంబం బైఠాయించిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. బాధితుడు విజయవాడకు చెందిన వెంకటేశ్వర్లు కథనం మేరకు.. మండలంలోని పూడివాడ గ్రామానికి చెందిన అక్కల వీరారెడ్డి, సీబీసీఐడీలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.22 లక్షలు డబ్బు తీసుకున్నాడు. అప్పటి నుంచి అదుగో రేపు మాపు అంటూ వీరారెడ్డి కాలం నెట్టుకొచ్చాడు. దీంతో పోలీసులను ఆశ్రయిస్తే కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నట్లు చెప్పారు. డబ్బులు ఇచ్చే వరకు తిరిగి వెళ్లేది లేదని ఇంటి ఎదుట భార్యతో సహా కూర్చున్నారు. మాకు డబ్బులు ఇవ్వని పక్షంలో కుటుంబం మొత్తం పురుగు మందు తాగి ఆత్మహత్యకు సిద్ధంగా ఉన్నామని ఆవేదన భరితంగా చెప్పారు.
అపార్టుమెంట్‌లో ప్లాట్ ఇప్పిస్తానని..
విజయవాడకు చెందిన తలగడదీవి రత్నకుమారి నుంచి అపార్టుమెంట్‌లో ప్లాట్ ఇప్పిస్తానని మార్చి 2020లో రూ.4లక్షలు తీసుకుని మోసగించాడని వాపోయారు. పేదలమైన మావద్ద నుంచి లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశాడని, డబ్బులు ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేసింది. అదే విధంగా వీరారెడ్డి పలు చోట్ల ఛీటింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా నగరం మండలం ఎస్‌ఐ వాసును వివరణ కోరగా తమకు ఎటుంటి ఫిర్యాదు అందలేని తెలిపారు.
చదవండి:
ఉల్లిగడ్డల చోరీకి వచ్చాడని చంపేశారు..
డెత్‌నోట్ రాసి.. ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment